Back

ⓘ చరిత్ర                                               

విక్రమార్క చరిత్ర

తెలుగుసాహిత్యంలో వెలువడిన ముఖ్యమైన కథాకావ్యాలలో క్రీ. శ. 15 వ శతాబ్దానికి చెందిన విక్రమార్క చరిత్ర ఒకటి. దీనిని జక్కన కవి రచించాడు. 8 అశ్వాసాలు గల ఈ తెలుగు కథాకావ్యంలో విక్రమార్కుడనే పౌరాణిక రాజు చేసిన అద్భుత సాహస కృత్యాలను వర్ణించే కథలున్నాయి.

                                               

యాత్రా చరిత్ర

యాత్రాచరిత్ర మండపాక పార్వతీశ్వర శాస్త్రి రచించిన వచన గ్రంథము. దీనిని పూర్వభాగము, ఉత్తరభాగము లనే రెండు పుస్తకములుగా ముద్రించారు. దీని పూర్వభాగాన్ని బొబ్బిలి సంస్థానానికి చెందిన శ్రీ రంగరాయ విలాస ముద్రాక్షరశాల వారు 1915లో ముద్రించారు.

                                               

తెలుగు భాషా చరిత్ర (పుస్తకం)

తెలుగు భాషా చరిత్ర ప్రధానంగా తెలుగు భాషా పరిశోధక వ్యాస సంకలనం కావున అధ్యాపకులకు సహాయ గ్రంథంగా ఉపయోగంగా వుంటుంది. నామ విభక్తులు, సర్వనామాలు, సంఖ్యావాచకాలు మొదలైనవి రెండు వేల ఏండ్ల చరిత్రలో పొందిన మార్పులు తెలుసుకోవచ్చు. అన్ని విశ్వవిద్యాలయాల్లోనూ ఎం.ఏ పరీక్షకూ, ఓరియంటల్ పరీక్షలకూ, కేంద్ర, రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలకు కూడా దీన్ని పాఠ్యగ్రంథంగా నిర్ణయించారు.

                                               

ఈ చరిత్ర ఏ సిరాతో

ఈ చరిత్ర ఏ సిరాతో 1982లో విడుదలైన తెలుగు సినిమా. నవతరం పిక్చర్స్ పతాకంపై గోగినేని ప్రసాద్, యు.రాజేంద్ర ప్రసాద్లు నిర్మించిన ఈ సినిమాకు వేజెళ్ళ సత్యనారాయణ దర్శకత్వం వహించాడు. రాజేంద్రప్రసాద్, గుమ్మడి వెంకటేశ్వరరావు, రంగనాథ్ ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు శివాజీ రాజా సంగీతాన్నందించాడు. ఈ సినిమాను చెరబండరాజుకు అంకితం ఇచ్చారు.

                                               

డాక్టర్ పట్టాభి (జీవిత చరిత్ర)

డాక్టర్ పట్టాభి మల్లాది గారు రచించిన జీవిత చరిత్ర పుస్తకం. ఇది 1946 సంవత్సరంలో కొండపల్లి వీరవెంకయ్య అండ్ సన్సు, రాజమండ్రి వారిచే ముద్రించబడినది. డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య జీవితచరిత్ర గ్రంథమిది. పట్టాభి సీతారామయ్య ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, భారత జాతీయ కాంగ్రెస్ నాయకుడు, ఆంధ్రా బ్యాంకు వ్యవస్థాపకుడు, సుప్రసిద్ధ రాజనీతివేత్త. ఆయన ఏ పుస్తకాన్ని రిఫర్ చేయకుండా కేవలం తన అపార జ్ఞాపకశక్తిపైనే ఆధారపడి కాంగ్రెసు చరిత్ర రచించారని ప్రతీతి. ఇంత ప్రాచుర్యం కలిగిన బహుముఖ ప్రజ్ఞాశాలి జీవితచరిత్ర ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది.

                                               

రాయలసీమ రచయితల చరిత్ర

రాయలసీమలో నివసించిన 20వశతాబ్దపు కవులు, రచయితల జీవితవిశేషములు, సాహిత్యసేవ, కావ్యపరిచయము, కావ్యములలోని ప్రశస్త ఘట్టములు మొదలైనవాటిని చేర్చి కల్లూరు అహోబలరావు ఈ గ్రంథాన్ని నాలుగు సంపుటాలుగా వెలువరించాడు. ఈ పుస్తకము వెలువడక ముందు రాయలసీమ రచయితలను పరిచయం చేసే పుస్తకాలు జానమద్ది హనుమచ్ఛాస్త్రి గారి మాసీమ కవులు వంటివి కొన్ని వచ్చినా అవి బహుళ ప్రచారానికి నోచుకోలేదు. Who is who of Rayalaseema writers గా మాత్రమే కాకుండా ఈ పుస్తకం ఒక ఎన్‌సైక్లోపీడియాగా ఉపయోగపడాలని సంపాదకుడి ఆశయం. ఎన్నో వ్యయప్రయాసలకు లోనై ఈ గ్రంథాలలోని సమాచారాన్ని సేకరించాడు.

                                               

మరో చరిత్ర

అప్పటికే రంగుల చిత్రాలు విరివిగా వస్తున్న సమయంలో నలుపు-తెలుపులో విడుదలైన మరో చరిత్ర సినిమా సంచలన విజయం సాధించింది. తెలుగు సినీ రంగంలో కమల్ హాసన్, సరితలకు ఈ సినిమా ఒక మైలురాయిగా నిలిచింది. ఒక తమిళ బ్రాహ్మణ యువకుడు, ఒక హిందూ యువతి విశాఖపట్నంలో ప్రేమలో పడతారు. ఇద్దరూ దృఢమైన వ్యక్తిత్వం కలవారు. అడ్డుచెప్పిన పెద్దలతో వాదినకు దిగుతారు. ఒక సంవత్సరం ఒకరినొకరు కలుసుకొనకుండా తమ ప్రేమ నిజమైనదని నిరూపించడానికి సంసిద్ధులౌతారు. ఈ సినిమా చివరకు విషాదాంతమౌతుంది.

                                               

రక్త చరిత్ర (సినిమా)

రక్త చరిత్ర తెలుగు,తమిళ, హిందీ భాషలలో రెండు భాగాలుగా వచ్చిన చిత్రము. ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దీనిని తెరకెక్కించారు. ఈ చిత్రము ప్రముఖ రాజకీయ నాయకులైన పరిటాల రవి, అతని విరోధి మద్దెలచెరువు సూర్యనారాయణ రెడ్డిల వాస్తవిక గాధతో రూపొందించబడింది. ఇది అధికారికంగా 2010, ఆగస్టు నెలలో విడుదల కావలసివున్నాకానీ 2010 అక్టోబరు 22న విడుదలైంది. హిందీలో రక్త్‌చరిత్ర్ గా విడుదలైంది.

                                               

తెలుగు సినిమా చరిత్ర

1886లో లుమీర్ సోదరులు భారతదేశంలో మొదటి మూగ సినిమాను ప్రదర్శించారు. తరువాత ఆర్.జి.టోర్నీ అనే విదేశీయుడు 1910లో "భక్త పుండరీక", 1911లో "రాజదర్బార్" అనే చిత్రాలు నిర్మించాడు. భారత దేశంలో మొదటి మూగ సినిమా నిర్మించిన భారతీయుడు దాదా సాహెబ్ ఫాల్కే. ఈయన 1913 మే 3న రాజా హరిశ్చంద్ర చిత్రాన్ని విడుదల చేశాడు. 1921లో మచిలీపట్నానికి చెందిన రఘుపతి వెంకయ్య, తనకుమారుడు ఆర్.ఎస్.ప్రకాష్ దర్శకత్వం, నటనలో భీష్మ ప్రతిజ్ఞ అనే మూగ సినిమాను నిర్మించి విడుదల చేశాడు. అర్దేష్ ఇరానీ నిర్మాతగా 1931లో హిందీ అలం అరా, తెలుగు భక్త ప్రహ్లాద, తమిళ కాళిదాసభాషలలో మూడు టాకీ చిత్రాలు విడుదల అయ్యాయి. వీటిలో తెలుగు, తమిళ చిత్రాల స ...

                                               

చిలుకూరు క్షేత్ర చరిత్ర (పుస్తకం)

తెలంగాణ తిరుమలగా ఖ్యాతి గాంచిన హైదరాబాదుకు అతి సమీపంలోని చిలుకూరు గ్రామంలో వెలిసిన చిలుకూరు బాలాజీ దేవాలయంపై బులెమోని వెంకటేశ్వర్లు సుమారు మూడు సంవత్సరాలపాటు పరిశోధన చేసి వ్రాసిన గ్రంథం "చిలుకూరు క్షేత్ర చరిత్ర". క్రీ.శ.1067లో అప్పటి రాజు అసగ మారస నేతృత్వంలో నిర్మించిన ఈ చిలుకూరు దేవాలయాల గూర్చి పూర్తి స్థాయిలో పరిశోధన చేసి, నాటి శిలా శాసనాలు, వాటి వివరాలు సహా ప్రచురించిన ఈ గ్రంథాన్ని 25 మార్చ్ 2005న అప్పటి శాసన సభ స్పీకర్ కె.ఆర్. సురేశ్ రెడ్డి విడుదల చేశారు. ఈ "చిలుకూరు క్షేత్ర చరిత్ర" గ్రంథాన్ని నెక్స్ట్ స్టెప్ పబ్లికేషన్స్ ప్రచురించగా, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, నవోదయ బుక్ హౌస్, ప్రజాశ ...

                                               

ఆంధ్రప్రదేశ్‌ దళిత ఉద్యమ చరిత్ర

ఆంధ్ర ప్రదేశ్‌ దళిత ఉద్యమ చరిత్ర అనే పుస్తకం యాగాటి చిన్నారావు ఆంగ్లంలో వ్రాసిన దళిత్‌ స్ట్రగుల్‌ ఫర్‌ ఐడెంటిటీ యొక్క తెలుగు అనువాదం. ఈ అనువాదానికి గాను ప్రభాకర్ మందారకు 2009 లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. ఈ అవార్డును 20 ఆగస్టు 2010 న పనాజీ లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర సాహిత్య అకాడమీ అధ్యక్షులు సునీల్ గంగోపాధ్యాయ ప్రదానం చేసారు.

                                               

ఏది చరిత్ర? (పుస్తకం)

ఏది చరిత్ర? ప్రాచీన మధ్యయుగ భారతదేశ చరిత్రను ఒక కొత్త కోణంలోంచి చూపిన చరిత్ర పుస్తకం. ఎం.వి.ఆర్.శాస్త్రి రచించిన ఈ పుస్తకం, శతాబ్దాలుగా చరిత్ర పేరుతో వ్యాప్తిలో ఉన్న అనేక విషయాలను ఆధారాల సహితంగా, సాధికారికంగా తప్పులుగా చూపిస్తుంది. ఆంధ్రభూమి దినపత్రిక లో ఏది చరిత్ర పేరుతో వచ్చిన అనేక వ్యాసాల సంకలనమే ఈ పుస్తకం. ఆర్యుల కాలం నుండి మొగలుల దాకా, భారతదేశ చరిత్ర లోని ముఖ్య ఘట్టాలను విశ్లేషిస్తూ ఇప్పటి వరకూ ప్రచారంలో ఉన్న చరిత్రను విమర్శనాత్మకంగా పరిశీలిస్తూ ఈ పుస్తకం సాగుతుంది.

                                               

కౌండిన్యుడు

కౌండిన్యుడు కౌండిన్యుడు కౌండిన్య గోత్రానికి మూలపురుషుడు. కౌండిన్య గోత్రమనునది ఒక బ్రాహ్మణ గోత్రము. ఇది ఉత్తర భారత మరియు దక్షిణ భారత దేశములో కనిపిస్తుంది. చరిత్ర లో కౌండిన్య గోత్ర బ్రాహ్మణ రాజులు, దక్షిణ-తూర్పు ఆసియా నందలి ప్రాంతాలను పరిపాలించారు. వియత్నాం లోని Mekong Delta ప్రాంతమందలి Funan Kingdom ను కౌండిన్య రాజు పరిపాలించాడు.

                                               

సంకుసాల నృసింహకవి

సంకుసాల నృసింహకవి క్రీ.శ.14వ శతాబ్దానికి చెందిన తెలుగు కవి. ఈయన రచించిన కవి కర్ణరసాయనము అనే ప్రౌఢ ప్రబంధ కావ్యము ప్రసిద్ధమైన రచన. కవి కర్ణరసాయనము. 1981 భారతి మాసపత్రిక. వ్యాసము:సంకుసాల నరసింహకవి కొన్ని చారిత్రక సత్యములు. వ్యాసకర్త:డా.జి.చలపతి.

                                               

ఎం.కె.సరోజ

ఈమె 1931, ఏప్రిల్ 7వ తేదీన చెన్నైలో జన్మించింది. ఈమె తన 5వ యేట తన సోదరితో కలిసి ముత్తుకుమారన్ పిళ్ళై వద్ద శాస్త్రీయ నృత్యం నేర్చుకోవడం ప్రారంభించింది.తన గురువు బెంగళూరుకు వెళ్ళడంతో ఈమె అక్కడికి వెళ్ళి నాట్యాన్ని అభ్యసించింది. ఈమె 1940లో తన తొలి నాట్యప్రదర్శనను ఇచ్చింది. తక్కువ సమయంలోనే మంచి నర్తకిగా పేరు గడించింది. 1946లో జెమినీ స్టూడియో సినిమాలలో నటించడానికి అవకాశాన్ని ఇచ్చింది. ఐతే ఈమె దానిని తిరస్కరించింది. 1949లో ఈమె చరిత్రకారుడు, నాట్యకళాకారుడు మోహన్ ఖోకర్‌ను వివాహం చేసుకుంది.ఈమె తన భర్త మహారాజా సయాజీరావు యూనివర్సిటీ ఆఫ్ బరోడా, నాట్య విభాగానికి అధిపతిగా నియమించబడటంతో అతనితో బాటు బరోడా ...

చరిత్ర
                                     

ⓘ చరిత్ర

గడిచిన కాలములో మానవుని చర్యల యొక్క అధ్యయనమే చరిత్ర. ఒక శాస్త్రముగా నిర్వచించినప్పుడు ప్రాథమికముగా రాతల ద్వారా భద్రపరచబడిన, జరిగిన కాలములోని మనుషుల, కుటుంబాల, సమాజాల యొక్క పరిశీలన, అధ్యయనమే చరిత్ర అని చెప్పవచ్చు. ఈ విధముగా చరిత్రను పూర్వ చరిత్రతో భేదిస్తారు. చరిత్ర యొక్క జ్ఞానము సాధారణంగా జరిగిన సంఘటనల యొక్క జ్ఞానముతో పాటు చరిత్ర ఆలోచనా సాధనాల యొక్క జ్ఞానమును కూడా పరిగణలోకి తీసుకుంటుంది. మనిషి చరిత్రను తెలుగుసుకొనుటవల్ల పూర్వం జరిగిన దురాచారాలను, నష్టాలను భవిష్యత్తులో నివారించడానికి తోడ్పడుతుంది.

సాంప్రదాయకంగా చరిత్ర అధ్యయనము మానవీయ శాస్త్రములలో భాగముగా పరిగణిస్తారు. అయితే ఆధునిక విద్యావర్గము చరిత్రను కాలక్రమము క్రోనాలజీ, హిస్టోరియోగ్రఫీ అను ఉపవిభాగములతో సామాజిక శాస్త్రములలో భాగముగా వర్గీకరిస్తున్నారు.

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →