Back

ⓘ కర్ణాటక                                               

కర్ణాటక సంగీతం

కర్ణాటక సంగీతము భారతీయ శాస్త్రీయ సంగీతంలో ఒక శైలి. హిందుస్తానీ సంగీతం ఉత్తర భారతదేశంలో కానవస్తే ఈ సంగీతం భారత ఉపఖండంలో ముఖ్యంగా ద్రవిడ రాష్ట్రాలు లేదా దక్షిణ భారత రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడులో కానవస్తుంది. హిందుస్థానీ సంగీతం పర్షియన్, ఇస్లామిక్ ప్రభావం వలన తనదైన ప్రత్యేకమైన శైలి సంతరించుకోగా, కర్నాటక సంగీతం మాత్రం సాంప్రదాయ మూలాలను పరిరక్షించుకుంటూ వస్తోంది. కానీ రెండింటిలోనూ సాధారణంగా గాత్ర సంగీతానికే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది.

                                               

కర్ణాటక యుద్ధాలు

కర్ణాటక యుద్ధాలు 18వ శతాబ్దం మధ్యలో భారత ఉపఖండాన సైనిక విభేదాల వలన సంభవించాయి. ఇందులో వారసత్వం, భూభాగం కోసం జరిగిన పోరాటాలు, ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీల మధ్య జరిగిన దౌత్య, సైనిక పోరాటాలు ఉన్నాయి. ఈ యుద్ధాల ఫలితంగా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో ఐరోపా వ్యాపార కంపెనీలపై తమ ఆధిపత్యాన్ని స్థాపించింది. చివరకు ఫ్రెంచి కంపెనీ ప్రధానంగా ఒక్క పాండిచ్చేరికి మాత్రమే పరిమితమైనది. బ్రిటిష్ కంపెనీ ఆధిపత్యం చివరకు భారతదేశంలో బ్రిటీషు రాజ్య స్థాపనకు దారితీసింది. ప్రధానంగా మూడు కర్ణాటక యుద్ధాలు 1744-1763 మధ్య జరిగాయి.

                                               

కర్ణాటక జిల్లాలు

కర్ణాటక ప్రస్తుత స్వరూపంలో 1956లో మైసూరు రాజ్యం, కూర్గు సంస్థానము, బొంబాయి, హైదరాబాదు, మద్రాసు రాష్ట్రాలలోని కన్నడ మాట్లాడే ప్రాంతాలు ఏకమై ఏర్పడింది. మైసూరు రాజ్యం పది జిల్లాలుగా విభజించబడి ఉంది. అవి - బెంగుళూరు, కోలార్, తుముకూరు, మాండ్యా, మైసూరు, హసన్, చిక్‌మగలూరు కదూర్, షిమోగా జిల్లాలు. 1953లో మద్రాసు రాష్ట్రంలోని తెలుగు మాట్లాడే ఉత్తర జిల్లాలు వేరుపడి ఆంధ్ర రాష్ట్రం అవతరించినప్పుడు, బళ్లారి జిల్లాను మద్రాసు రాష్ట్రం నుండి విడదీసి మైసూరు రాష్ట్రంలో కలిపారు. ఆ తరువాత కొడగు జిల్లా ఏర్పడింది. 1956లో మద్రాసు రాష్ట్రం నుండి దక్షిణ కన్నడ జిల్లాను, బొంబాయి రాష్ట్రం నుండి ఉత్తర కన్నడ, ధార్వడ్, బ ...

                                               

కర్ణాటక సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్

కర్ణాటక సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ యశ్వంతపూర్ హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ ల మధ్య నడిచే సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ రైలు.12650 నెంబరుతో యశ్వంతపూర్ నుండి బయలుదేరి ధర్మవరం, కాచిగూడ, భోపాల్ మీదుగా ప్రయాణిస్తూ ఢిల్లీ చేరుతుంది.ఈ రైలుకు అనుబంధంగా మరొక సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ యశ్వంతపూర్, చండీగఢ్ ల మద్య నడుస్తున్నది.ఈ రైళ్ళూ కర్ణాటక ఎక్స్‌ప్రెస్, బెంగళూరు రాజధాని ఎక్స్‌ప్రెస్ లకు ప్రత్యామ్నాయ రైలుగా ఉపయోగపడుతున్నాయి.

                                               

కర్ణాటక రాజులు

సుప్రసిద్ద చరిత్రకారుడైన బుద్ధరాజు వరహాల రాజు గారు తన శ్రీ ఆంధ్ర క్షత్రియ వంశ రత్నాకరము అను పుస్తకంలో ఆంధ్ర దేశంలో తూర్పు చాళుక్య, కోట, పరిచ్చెద, విష్ణుకుండిన, కాకతీయ వంటి తెలుగు క్షత్రియ సామ్రాజ్యాల పతనానంతరము ఆత్రేయ, పశుపతి, విశ్వామిత్ర, భరద్వాజ గోత్రముల వారు కర్ణాటక రాష్ట్రంలో దత్త మండలానికి వలసవెళ్ళారని, అనాటినుండి కర్ణాటక క్షత్రియులుగా పిలువబడుతున్నారని వ్రాసిరి. భరద్వాజ గోత్రపు క్షత్రియుల జాడ మాత్రము తెలియరాకున్నది. గోత్ర నామములు, ఆచార వ్యవహారములను బట్టి కర్ణాటక రాజుల పూర్వీకులు హోయసాలులు, పశ్చిమ చాళుక్యులు, కదంబులు, హంపి విజయనగర రాజులు అయివుండవచ్చునని పలు చరిత్రకారుల ఊహ. కర్ణాటక రాజ ...

                                               

కర్ణాటక తాలూకాలు

పాలనా వ్వవస్థ పరంగా భారత దేశం కొన్ని రాష్ట్రాల సముదాయం. ప్రతి రాష్ట్రాన్ని కొన్ని జిల్లాలుగా విభజించారు. ఒక్కొక్క జిల్లాను కొన్ని ఉప విభాగాలుగా చేశారు. ఇలాంటి ఉప విభాగాలను తాలూకా, తహసీలు, మండలం, పరగణా, మహాకుమా వంటి పేర్లతో పిలుస్తారు. అత్యధిక రాష్ట్రాలలో "తాలూకా", "తహసీలు", "మండల్" పేర్లు వాడుకలో ఉన్నాయి. సాధారణంగా జిల్లాలో విభాగాలు ఇలా ఉంటాయి పెద్ద గ్రామాన్ని "నగర పంచాయితీ"గా పరిగణించడం కొన్ని రాష్ట్రాలలో జరుగుతుంది. ఒకమాదిరి పట్టణమైతే అది ఒక మునిసిపాలిటీ నగరపాలికగా పరిగణింపబడుతుంది. తతిమ్మా వాటిలో కొన్ని కొన్ని గ్రామాల సముదాయాన్ని ఒక మండలం లేదా తహసీలు లేదా తాలూకాగా విభజించడం జరుగుతుంది. ...

కర్ణాటక
                                     

ⓘ కర్ణాటక

కర్ణాటక భారతదేశములోని ఐదు దక్షిణాది రాష్ట్రాలలో ఒకటి. 1950 లో పూర్వపు మైసూరు రాజ్యము నుండి యేర్పడటము వలన 1973 వరకు ఈ రాష్ట్రము మైసూరు రాష్ట్రముగా వ్యవహరించబడింది. 1956 లో చుట్టుపక్క రాష్ట్రాలలోని కన్నడ మాట్లాడే ప్రాంతాలు కలుపుకొని విస్తరించబడింది. కర్ణాటక రాజధాని బెంగళూరు రాష్ట్రములో 10 లక్షలకు పైగా జనాభా ఉన్న ఏకైక నగరము. మైసూరు, మంగుళూరు, హుబ్లి-ధార్వాడ్, బళ్ళారి, బెళగావి రాష్ట్రములోని ఇతర ముఖ్య నగరాలు. కన్నడ, కర్ణాటక రాష్ట్ర అధికార భాష. 2001 జనాభా లెక్కల ప్రకారము దేశములో 5 కోట్లకు మించి జనాభా ఉన్న పది రాష్ట్రాలలో ఇది ఒకటి.

                                     

1. భౌగోళికము

కర్ణాటకకు పశ్చిమాన అరేబియా సముద్రము, వాయువ్యమున గోవా రాష్ట్రము, ఉత్తరాన మహారాష్ట్ర, తూర్పున తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, తూర్పున, ఆగ్నేయమున తమిళనాడు, నైౠతిన కేరళ రాష్ట్రములు సరిహద్దులుగా ఉన్నాయి.

భౌగోళికముగా రాష్ట్రము మూడు ప్రధాన ప్రాంతాలుగా విభజించబడింది.

 • దక్కన్ పీఠభూమి - కర్ణాటకలోని చాలా మటుకు భూభాగము ఈ ప్రాంతములోనే ఉంది. ప్రాంతము పొడిగా వర్షాభావముతో సెం-అరిద్ స్థాయిలో ఉంది.
 • సన్నని తీర ప్రాంతము, - పడమటి కనుమలకు, అరేబియా సముద్రానికి మధ్యన ఉన్న ఈ ప్రాంతము లోతట్టు ప్రాంతము. ఇక్కడ ఓ మోస్తరు నుండి భారి వర్షాలు కురుస్తాయి.
 • పడమటి కనుమలు - ఈ పర్వత శ్రేణులు సగటున 900 మీటర్ల ఎత్తుకు చేరతాయి. వర్షపాతము ఒక మోస్తరు నుండి భారీ వర్షపాతము.

కర్ణాటక యొక్క పేరు ఎలా వచ్చినది అనేదానికి చాలా వాదనలున్నాయి. అయితే అన్నిటికంటే తర్కబద్ధమైన వాదన ఏమిటంటే కర్ణాటక పేరు కరు+నాడు = ఎత్తైన భూమి నుండి వచ్చినదని. గమనించవలసిన విషయమేమంటే కర్ణాటక రాష్ట్ర సగటు ఎత్తు 1500 అడుగులు మిగిలిన రాష్ట్రాలతో పోల్చితే ఎక్కువే.

రాష్ట్రములో అత్యధిక ఉష్ణోగ్రత 45.6 సెంటీగ్రేడు రాయచూరు వద్ద 1928 మే 23న నమోదైనది. అత్యల్ప ఉష్ణోగ్రత 2.8 డిగ్రీల సెంటీగ్రేడు బీదర్లో 1918 డిసెంబరు 16 న నమోదైనది.

                                     

2. భాష

కర్ణాటక, భాష ఆధారితముగా యేర్పడిన రాష్ట్రము. అందుకే రాష్ట్రము యొక్క ఉనికిలో ఇది ముఖ్య పాత్ర పోషిస్తుంది. రాష్ట్రములో అత్యధిక సంఖ్యాకులు అధికార భాష అయిన కన్నడను మాట్లాడతారు. తెలుగు, తమిళము, కొడవ, తులు, ఇతర భాషలు.

                                     

3. ఆర్ధిక రంగము

కర్ణాటక భారతదేశములోని పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన రాష్ట్రాలలో ఒకటి. దీని రాజధాని బెంగళూరు దేశములో సమాచార సాంకేతిక సేవలకు ప్రధాన కేంద్రము. భారతదేశములోని 90% బంగారము ఉత్పాదన కర్ణాటకలోనే జరుగుతుంది. ఇటీవల మాంగనీసు ముడిఖనిజము యొక్క వెలికితీత పనులు బళ్ళారి, హోస్పేట జిల్లాలలో ముమ్మరముగా సాగుతున్నాయి.

                                     

4. చరిత్ర

కర్ణాటక చరిత్ర పురాణ కాలమునాటిది. రామాయణములో వాలి, సుగ్రీవుడు, వానర సేన యొక్క రాజధాని ప్రస్తుత బళ్లారి జిల్లాలోని హంపి అని భావిస్తారు. మహాభారతములో పాండవులు తమ తల్లి కుంతితో వనవాసము చేయుచున్న కాలములో భీమునిచే చంపబడిన కౄర రాక్షసుడు అయిన హిడింబాసురుడు ప్రస్తుత చిత్రదుర్గ జిల్లా ప్రాంతములో నివసించుచుండేవాడు. అశోకుని కాలమునాటి శిలాశాసనములు ఇక్కడ లభించిన పురాతన పురావస్తు ఆధారాలు.

క్రీ.పూ. 4వ శతాబ్దములో శాతవాహనులు ఈ ప్రాంతమున అధికారమునకు వచ్చి దాదాపు 300 సంవత్సరాలు పరిపాలించారు. ఈ వంశము క్షీణించడముతో ఉత్తరమున కాదంబులు, దక్షిణమున గాంగులు అధికారమునకు వచ్చారు. అత్యంత ఎత్తైన గోమటేశ్వరుని ఏకశిలా విగ్రహము గాంగుల కాలమునాటి కట్టడమే. బాదామి చాళుక్యులు 500 - 735 వరకు నర్మదా నదీ తీరమునుండి కావేరీ నది వరకు గల విస్తృత ప్రాంతాన్ని రెండవ పులకేశి కాలము 609 - 642 నుండి పరిపాలించారు. రెండవ పులకేశి కనౌజ్ కు చెందిన హర్షవర్ధనున్ని కూడా ఓడించాడు. బాధామీ చాళుక్యులు బాదామి, ఐహోల్, పట్టడకళ్లో అద్భుతమైన రాతి కట్టడాలను కట్టించారు. ఐహోల్ ను దేశములో ఆలయ శిల్పకళకు మాతృభూములలో ఒకటిగా భావిస్తారు. వీరి తరువాత 753 నుండి 973 వరకు ఈ ప్రాంతాన్ని పరిపాలించిన మల్ఖేడ్ కు చెందిన రాష్ట్రకూటులు కనౌజ్ పాలకులపై కప్పము విధించారు. ఈ కాలములో కన్నడ సాహిత్యము ఎంతగానో అభివృద్ధి చెందినది. జైన పండితులు ఎందరో వీరి ఆస్థానములో ఉండేవారు. 973 నుండి 1183 వరకు పరిపాలించిన కళ్యాణీ చాళుక్యులు, వీరి సామంతులైన హళేబీడు హొయసలులు అనేక అద్భుతమైన దేవాలయాలను కట్టించి సాహిత్యము మొదలైన కళలను ప్రోత్సహించారు. మితాక్షర గ్రంథమును రచించిన న్యాయవేత్త విజ్ఞేశ్వర కళ్యాణీలోనే నివసించాడు. వీరశైవ మతగురువైన బసవేశ్వర కళ్యాణీలోనే మంత్రిగా ఉండేవాడు. విజయనగర సామ్రాజ్యము దేశీయ సంప్రదాయాలకు పెద్దపీట వేసి కళలను, మతమును, సంస్కృత, కన్నడ, తెలుగు, తమిళ భాషలలో సాహిత్యమును ప్రోత్సహించారు. ఇతర దేశాలతో వాణిజ్యము అభివృద్ధి చెందినది. గుల్బర్గా బహుమనీ సుల్తానులు, బీజాపూరు ఆదిల్‌షాహీ సుల్తానులు ఇండో-సార్సెనిక్ శైలిలో అనేక కట్టడములు కట్టించారు, ఉర్దూ, పర్షియన్ సాహిత్యాలను ప్రోత్సహించారు. మరాఠాపీష్వా, టిప్పూ సుల్తాన్ల పతనముతో మైసూరు రాజ్యము కర్ణాటక బ్రిటీషు పాలనలోకి వచ్చింది.

భారత స్వాతంత్ర్యానంతరము, మైసూరు ఒడియార్ మహారాజు తన రాజ్యాన్ని భారతదేశములో విలీనము చేశాడు. 1950 లో, మైసూరు రాష్ట్రముగా అవతరించడముతో, పూర్వపు మహారాజు కొత్తగా యేర్పడ్డ రాష్ట్రానికి రాజప్రముఖ్ లేదా గవర్నరుగా నియమితుడయ్యాడు. విలీనము తర్వాత ఒడియార్ కుటుంబానికి ప్రభుత్వము 1975 వరకు భత్యము ఇచ్చింది. ఈ కుటుంబ సభ్యులు ఇప్పటికీ మైసూరులోని తమ వంశపారంపర్యమైన ప్యలెస్ లోనే నివసిస్తున్నారు.

రాజ్యోత్సవ దినము నవంబర్ 1, 1956 న కూర్గ్ రాజ్యాన్ని, చుట్టుపక్కల ఉన్న మద్రాసు, హైదరాబాదు, బొంబాయి లలోని కన్నడ మాట్లాడే ప్రాంతాలను కలుపుకొని మైసూరు రాష్ట్రము విస్తరించి ప్రస్తుత రూపు సంతరించుకొన్నది. 1973 నవంబర్ 1 న రాష్ట్రము పేరు కర్ణాటక అని మార్చబడింది.                                     

5. పకృతి సిద్ధ ప్రదేశాలు

కర్ణాటక అనేక జాతీయ వనాలకు ఆలవాలము. అందులో ముఖ్యమైనవి

 • ఆన్షీ జాతీయవనము - ఉత్తర కన్నడ జిల్లా.
 • బందీపూర్ జాతీయ వనము - మైసూరు జిల్లా
 • కుద్రేముఖ్ జాతీయవనము - దక్షిణ కన్నడ, చిక్‌మగళూరు జిల్లాలు
 • నాగర్‌హోల్ జాతీయవనము - మైసూరు, కొడగు జిల్లాలు
 • బన్నేరుఘట్ట జాతీయవనము - బెంగళూరు జిల్లా

ఇవే కాక అనేక వన్యప్రాణి సంరక్షణాలయాలు అభయారణ్యాలు ఉన్నాయి.

 • షిమోగా జిల్లాలోని జోగ్ జలపాతం ప్రపంచములోనే రెండవ ఎత్తైన జలపాతము
                                     

6. బయటి లింకులు

 • Techwgl
 • కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వము
 • కర్ణాటక రాష్ట్ర పర్యాటక శాఖ
 • కర్ణాటక ప్రభుత్వ సమాచార శాఖ
 • హసన్‌లోని హొయసల పర్యటన
 • కర్ణాటక చరిత్ర, సాంస్కృతిక అంశాలు
 • Alltechways
 • కర్ణాటక పర్యటన
 • కర్ణాటక పటము
                                               

కర్ణాటకరత్న

కర్ణాటకరత్న పురస్కారం కర్ణాటక రాష్ట్రపు అత్యున్నత పౌరపురస్కారం. ఈ పురస్కారాన్ని ఏ రంగంలో అయినా అత్యున్నత కృషి చేసిన వ్యక్తికి బహూకరిస్తారు. ఈ పురస్కారం 1992లో కర్ణాటక రాష్ట్రప్రభుత్వం చేత ఆరంభించబడింది. ఇంతవరకు ఈ పురస్కారాన్ని 9మందికి ప్రదానం చేశారు.

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →