Back

ⓘ బాలభారతం(పత్రిక)                                               

చతుర పత్రిక

చతుర పత్రిక ఈనాడు గ్రూపుచే నిర్వహించబడిన మాస పత్రిక. ఇందులో ప్రతి నెలా ఒక నవల ప్రచురించబడుతుంది. కరోనా నిరోధంలో భాగంగా ఇంటి పట్టునే ఉంటున్న వారు సమయాన్ని సద్వినియోగం చేసుకునేలా ‘తెలుగువెలుగు, బాలభారతం, చతుర, విపుల’ పత్రికలను అంతర్జాలంలో ఉచితంగా అందుబాటులో ఉంచుతున్నట్టు ‘రామోజీ ఫౌండేషన్‌’ ఓ ప్రకటనలో తెలిపింది. చిత్ర మాస పత్రికను 1978 ఫిబ్రవరి న ప్రారంభించారు దీనికి రూపకల్పన చేసినది తొలి నుంచి నేటి దాకా సంపాదకుడిగా ఉన్నది చలసాని ప్రసాదరావు. ఇందులో ప్రచురించిన మొదటి నవల కమలమ్మ కమతం దీని రచయిత సి.ఎస్.రావు.ప్రారంభించినప్పుడు దీని ధర ఒక రూపాయి 25 పైసలు. సకుటుంబంగా చదువుకోగల ఉత్తమ ప్రమాణాలతో ఉన్న ...

                                               

డి.కె.చదువులబాబు

డి.కె.చదువులబాబు తెలుగు కథా రచయిత. వీరి పేరు ఎంత వినూత్నంగా ఉందో, ఇతని కథలు కూడా అంత వినూత్నంగా ఉంటాయి. వివిధ వార, మాస పత్రికల్లో సుమారు 50 సాంఘిక కథలు, బాలసాహిత్య రచనలు సుమారు 250 కథలు వీరివి ప్రచురితమయ్యాయి. నిజానికి వీరు మొదట బాలసాహిత్యాన్ని అందుకుని ఒక యజ్ఞంలా కథలు రాసి, ఆ తరువాత సాంఘిక కథలవైపు, పెద్దల కథలవైపు దృష్టి సారించారు. వీరి కథలు ఆంధ్రభూమి, ఆంధ్రప్రభ, జ్యోతి, విశాలాంధ్ర, వార్త, జాగృతి, ప్రజాశక్తి మొదలగు ప్రముఖ పత్రికలలో రెగ్యులర్‌గా ప్రచురిస్తున్నాయి. 2003లో బాలల కథలు అనే సంపుటిని ప్రచురించారు.

                                               

తెలుగు పత్రికలు

తొలి తెలుగు పత్రిక పేరు ఆంధ్రపత్రిక. దీని వ్యవస్థాపకులు కాశీనాథుని నాగేశ్వరరావు గారు. ఈ పత్రిక 1908లో ఆరంభమయ్యింది. అటు పిమ్మట తెలుగు పత్రికారంగం చాలా అభివృద్ధి చెందింది. జనవరి -జూన్ 2013 ఎబిసి గణాంకాల ప్రకారం ఎబిసి సభ్య తెలుగు దినపత్రికలు 64 సంచికలతో 3.530.263 కాపీలు పంపిణీ చేయబడుతున్నాయి. ఇది అంతకు ముందు ఆరు మాసాలలో 3.679.788 గా వుంది అనగా 4శాతం పెరుగుదల ఉంది. వార్తా వారపత్రికలలో ఒక సంచిక 13.441 స్థాయిలో వుండగా గత ఆరు మాసాలలో 14.187 గా ఉంది. ఇక మిగతా పత్రికల విషయంలో సర్క్యులేషన్ 319.746 గా ఉంది. ఇది అంతకు ముందు ఆరు మాసాలలో 304.178 గా ఉంది.

                                               

రామోజీరావు

చెరుకూరి రామోజీరావు, ఒక భారతీయ వ్యాపారవేత్త, ఈనాడు గ్రూపు సంస్థల అధినేత. తెలుగు దినపత్రిక ఈనాడుకు వ్యవస్థాపకుడు, ప్రధాన సంపాదకుడు, ప్రచురణ కర్త. మార్గదర్శి చిట్‌ఫండ్, ప్రియా ఫుడ్స్, కళాంజలి మొదలగు వ్యాపార సంస్థల అధినేత. రామోజీరావు స్థాపించిన రామోజీ గ్రూపు ఆధీనంలో ప్రపంచంలోనే అతిపెద్ద సినిమా స్టూడియో రామోజీ ఫిల్మ్ సిటీ ఉంది. 2016లో భారత ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది.

                                               

తాడేపల్లి (విజయవాడ గ్రామీణ)

తాడేపల్లి కృష్ణా జిల్లా, విజయవాడ గ్రామీణ మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన విజయవాడ గ్రామీణ నుండి 13 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన విజయవాడ నుండి 13 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1022 ఇళ్లతో, 3998 జనాభాతో 753 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 1950, ఆడవారి సంఖ్య 2048. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 936 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 651. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 589209.పిన్ కోడ్: 520012, ఎస్.టి.డి.కోడ్ = 0866. దీనిని కొత్తూరు తాడేపల్లి అంటారు.

                                               

బాలభారతి

1975 నుండి బాలభారతి జానపద బాలల నవలలు ప్రచురిస్తూ 1978లో పత్రికను ప్రారంభించారు. అప్పటినుండి నేటి వరకు నిర్విరామంగా ప్రచురింపబడుతుంది. ఆయన 1994లో స్వర్గస్తులైనాడు. అనంతరం ఆయన సతీమణి శ్రీమతి వెల్లంపల్లి బాలభారతి, పుత్రుడు వెల్లంపల్లి ప్రేంకుమార్, వెల్లంపల్లి శ్రీహరి కొనసాగించడం జరిగింది. వీరు బాలభారతి పత్రికతోపాటు జ్ఞానమార్గం భక్తి టుడే, ఆయుర్వేదం టుడే, జ్యోతిష్యం టుడే, యోగ టుడే, హంగామా అనే పత్రికలను సైతం స్థాపించి ప్రచురించసాగారు. తెలుగు వారి పట్ల వీరి కృషిని గుర్తించి దక్షిణ భారత తెలుగు సంక్షేమ సంఘం వారు 27.06.2010 నాడు సన్మానం చేయడం గుర్తించదగిన విషయం.

బాలభారతం(పత్రిక)
                                     

ⓘ బాలభారతం(పత్రిక)

2013 మే 27న పత్రికావిష్కరణ కార్యక్రమం ఫిల్మ్‌సిటీలో జరిగింది. రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ పత్రికను ఈనాడు మేనేజింగ్ డైరక్టర్ అయిన సుమన్, మార్గదర్శి చిట్ ఫండ్స్ అధినేత శైలజా కిరణ్ ల చిన్న కుమార్తె దివిజ ఆవిష్కరించింది. ఫిల్మ్‌సిటీ, డాల్ఫిన్‌ హోటళ్ల ఎండీ విజయేశ్వరి, సుమన్‌ల కుమారుడు సుజయ్‌ లాంఛనంగా ఆవిష్కరించాడు. 2013 జూన్ 1 వ తేదీన తొలి సంచిక విడుదలైంది. నాణ్యమైన కాగితంపై 84 పేజీలతో సర్వాంగ సుందరంగా వెలువడుతున్నది. డిసెంబరు 2019 లో పత్రిక ధర 20 రూపాయలు మాత్రమే. ప్రస్తుతం సంచికలు ఉచితంగా అంతర్జాలంలో అందుబాటులో వున్నాయి. మార్చి2021 సంచికతో పత్రిక మూతపడింది.

                                     

1. శీర్షికలు-అంశాలు

ఈ పత్రికలో ప్రధానంగా విజ్ఞానం, వినోదం, కళలు, సైన్సు, చరిత్ర, జీవిత చరిత్రలు, సమకాలీన అంశాలు మొదలైన అంశాలు ఉంటాయి. పిల్లల నిత్య జీవితానికి ఉపకరించే అనేకానేక విశేషాలతోపాటు, నీతి కథలు, రంగురంగుల బొమ్మలతో ఆకట్టుకునేలా పత్రికను తీర్చిదిద్దారు. ఆరోగ్యం, వర్తమాన వ్యవహారాలు, విజ్ఞాన శాస్త్రాలు, జీవజాలానికి సంబంధించిన వివిధ ఆసక్తికర విషయాలతో పిల్లలకు అర్థమయ్యే తేలికైన భాషలో ఈ పత్రిక వెలువడుతోంది. పనికిరాని వస్తువుల నుంచి కొత్త వస్తువులు తయారు చేయడం, సులువుగా బొమ్మలు గీయడం ఎలాగో నేర్పే ఈనాడు కార్టూన్‌ ఎడిటర్‌ శ్రీధర్‌ పాఠాలు, జీవన నైపుణ్యాలు, వ్యక్తిత్వ వికాసం వంటివెన్నో అందిస్తుంది.

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →