Back

ⓘ శివానందమూర్తి                                               

డిసెంబర్ 21

1959: కృష్ణమాచారి శ్రీకాంత్, భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు. 1931: అవసరాల రామకృష్ణారావు, కథ, నవల రచయిత. మ.2011 1942: హు జింటావ్, పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా యొక్క అత్యున్నత నాయకుడు. 1928: శివానందమూర్తి, మానవతావాది, ఆధ్యాత్మిక, తత్వవేత్త. మ.2015 2002: తప్పెట్ల భవిత, బాగ్ లింగంపల్లి, హైదరాబాద్, తెలంగాణ. 1972: వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి, రాజకీయ నాయకుడు. 1932: యు.ఆర్.అనంతమూర్తి, కన్నడ రచయిత, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత. మ.2014 1939: సూరపనేని శ్రీధర్, తెలుగు సినిమా నటుడు. మ.2007 1926: అర్జా జనార్ధనరావు, తెలుగు నాటక, సినిమా నటుడు. మ.2007 1972: తుంపిల్ల శ్రీనివాస్, న్యాయవాది, కేసముద్రం, మహబూబాబా ...

                                               

జూన్ 10

1922: జూడీ గార్లాండ్, అమెరికాకు చెందిన నటి, గాయకురాలు, అభినేత్రి. మ.1969 1958: ఇ.వి.వి.సత్యనారాయణ, తెలుగు సినిమా దర్శకుడు. మ.2011 1892: పొణకా కనకమ్మ, కస్తూరిబాయి మహిళా విద్యాకేంద్రమును స్థాపించారు, కొంతకాలం జమీన్ రైతు పత్రిక నడిపారు. మ.1963 1938: రాహుల్ బజాజ్, భారత పారిశ్రామిక వేత్త. 1951: మంగు రాజా, మ్యూజికాలజిస్ట్ గా సేవలందించడమే కాకుండా, రాజా తనలోని సృజనాత్మక రచనా సామర్ధ్యాలతో కథలు, నవలలు, సీరియల్స్ కూడా రాశారు. 1960: నందమూరి బాలకృష్ణ, తెలుగు సినిమా నటుడు. 1916: పైడిమర్రి సుబ్బారావు, బహుభాషావేత్త, భారత జాతీయ ప్రతిజ్ఞ భారతదేశం నా మాతృభూమి. రచయిత. మ.1988 1908: ఈశ్వరప్రభు, హేతువాది, చందమామ ...

                                               

1928

మే 15: మిక్కి మౌస్, మిన్ని కలసి షార్టు ప్లేన్ క్రేజీ అనే కార్టున్ యొక్క అరంగేట్రం చెయ్యబడింది. సూర్యాపేటలో జరిగిన ఆంధ్ర సభల్లో గ్రంథాలయ మహాసభ వామన నాయక్ నాయకత్వంలో నిర్వహించారు. జూలై 28: 9వ వేసవి ఒలింపిక్ క్రీడలు ఆంస్టర్‌డాంలో ప్రారంభమయ్యాయి. చిలుకూరి నారాయణరావు సీడెడ్ ప్రాంతానికి రాయలసీమ అనే పేరుపెట్టారు.

                                               

మల్లాది చంద్రశేఖరశాస్త్రి

మల్లాది చంద్రశేఖరశాస్త్రి ప్రముఖ పండితుడు, పురాణ ప్రవచకులు. ఆయన స్వరంలోని మాధుర్యం, రామాయణ, భారత, భాగవతాలపై ఆయనకున్న పట్టు కారణంగా పురాణప్రవచన ప్రముఖులలో ఆయన ప్రత్యేకతను సంతరించుకున్నారు. తన పదిహేనవ ఏట నుంచి ప్రారంభించిన ఈ ప్రవచన యజ్ఞం అసిధారావ్రతంగా ఇప్పటికీ కొనసాగుతోంది. ప్రస్తుతం 87 ఏళ్లు పైబడినా ఉపన్యాసం, హరికథ, నాటకం, పురాణం కలిపి శ్రోతలను ఆకట్టుకునే విధంగా పురాణ ప్రవచనం చేయడంలో మల్లాది చంద్రశేఖరశాస్త్రి సుప్రసిద్ధులు.

                                               

2015

జనవరి 8: గెడ్డాపు సత్యం, పద్యకవి, సాహితీవేత్త. జూన్ 10: శివానందమూర్తి, మానవతావాది, ఆధ్యాత్మిక, తత్వవేత్త. జ.1928 డిసెంబర్ 12: శరద్ అనంతరావు జోషి, రైతు నాయకుడు. రాజ్యసభ సభ్యుడు. జ.1935 జూన్ 8: దాశరథి రంగాచార్య, సాహితీవేత్త, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు. జ.1928 ఆగష్టు 14: గోపరాజు లవణం, గోరా కుమారుడు, హేతువాది, నాస్తికుడు. జ.1930 డిసెంబర్ 25: మెట్ల సత్యనారాయణ రావు, రాజకీయనాయకుడు. తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు. జ.1942 డిసెంబర్ 19: రంగనాథ్, విలక్షణ సినిమా నటుడు, కవి. జ.1949 జనవరి 9: తాడిగిరి పోతరాజు, విప్లవ రచయితల సంఘం వ్యవస్థాపక సభ్యుడు. జ.1937 జూలై 14: ఎమ్మెస్ విశ్వనాథన్, దక్షిణ భారతదేశానికి చ ...

                                               

కర్దమ మహర్షి

కర్దముడు అనే పేరున్న మహర్షి, ప్రజాపతి సనాతన ధర్మంలోని పలు గ్రంథాల్లో ప్రస్తావితమైనారు. ఆయన భార్య దేవహూతితో కలిసి బ్రహ్మ ఆజ్ఞపై సంతానం అభివృద్ధి చేసినందుకు ప్రజాపతిగా గుర్తించారు. బ్రహ్మజ్ఞాన సంపన్నుడై తపస్సు చేసినందుకు ఆయనను మహర్షిగా సంబోధించారు.

                                               

పి.వి.రమణయ్య రాజా

ఆయన విశాఖపట్టణం జిల్లా లోని భీమిలి సమీపంలోని పాండ్రంగి గ్రామంలో 1927లో జన్మించాడు. ఆయన విజయనగరంలో చదువుకున్నాడు. ఆ రోజుల్లో ఆదిభట్ల, ద్వారం, దాలిపర్తి, చొప్పల్లి వంటి కళాకారుల ప్రభావంతో కళాభిమానం పెంచుకున్నాడు. వ్యాపారం నిమిత్తం 1968లో మద్రాసుకు మకాం మార్చాడు.ఆయనకు వ్యాపారాభివృద్ధితో పాటు కళా, సాహిత్య రంగాలపై మమకారం కూడా పెరిగింది. ఆనాటి నుండి సాహిత్య సాంస్కృతిక రంగాల చరిత్రలో ఆయన పేరు పెనవేసుకుపోయింది. కవులకీ, కళాకారులకీ ముఖ్యంగా సాహితీవేత్తలకీ రాజా చేసిన సత్కారాలు, వారి పై చూపిన ఆదరణ చూస్తే ప్రాచీనకాలం నాటి కవుల వైభవాన్ని పునరుద్ధరించడానికి ఆయన పుట్టారనిపిస్తుంది. శ్రీనాధుని కావ్యాలు అంక ...

                                               

వంకాయల నరసింహం

వంకాయల నరసింహం విజయనగరానికి చెందిన ప్రముఖ సంగీత విద్వాంసుడు. మన రాష్ట్రంలోని ప్రథమశ్రేణి మృదంగ నిపుణుడు మృదంగ కోవిదుడు, ఆదర్శ ఉపాధ్యాయుడుకూడా. విజ్జల నగరం గా పిలువబడే విజయనగరంలో వంకాయల నరసింహం 1931 నవంబరు 14 న, వెంకటలక్ష్మి, లక్ష్మణస్వామి పుణ్యదంపతులకు జన్మించాడు. స్థానిక యం.ఆర్. కాలేజీలో బియస్సీ, ఆంధ్ర విశ్వవిద్యాలయంలో బి.ఇడి చేసి విజయనగరం మునిసిపల్ ఉన్నత పాఠశాలలో సైన్స్ ఉపాధ్యాయునిగా 22 ఏళ్ళు ఉద్యోగ బాధ్యతలు నిర్వహించాడు.

                                               

అయ్యగారి శ్యామసుందరం

అయ్యగారి శ్యామసుందరం ప్రముఖ వైణికుడు. అతను కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కారాన్ని పొందాడు. అతను దేశంలో ఒక సీనియర్ టాప్ గ్రేడ్ వీణా కళాకారుడు. వీణా వాద్యవిశారద, సంగిత విద్వన్మణి, సునాద సుధానిధి, వీణా వాదన చతుర, వంటి అనేక బిరుదులను పొందాడు.

                                               

హిందూమతం

హిందూమతం లేదా హిందూ ధర్మం భారతదేశంలో జన్మించిన ఒక ఆధ్యాత్మిక సాంప్రదాయం. హిందూ మతం అతి పురాతన మతం. దీనినే సనాతన ధర్మం అని కూడా తరచు వ్యవహరించడం జరుగుతుంది. పూర్వకాలమునందు భారతదేశమున ఏది ధర్మ నామముతో వ్యవహరింపబడినదో, అదే ఇప్పుడు మత మను పేరుతో వాడబడుచున్నది. ధర్మము అనగా ఆచరణీయ కార్యము. మతమనగా అభిప్రాయము. హిందూ అనే పదమును పార్శీలు మొదట వాడేవారు, హిందు అనే పదానికి పార్శీ భాషలో సింధు అని అర్థము. సింధూనది ఒడ్డున నివసించే వారిని అలా పిలిచేవారు కాని ఇప్పుడు వేదాలు, వాటికి సంబంధించిన మతాలను ఆచరించే వారినే హిందువు అని పిలుస్తున్నారు. హిందూమతం, దాని మూలాలు వేదకాలపు నాగరికతకు సంబంధించినవి. హిందూమతం ప్ ...

                                               

పెళ్ళి

పెళ్ళి లేదా వివాహం అనగా సమాజంలో ఇద్దరు భాగస్వామ్యుల మధ్య హక్కులు,బాధ్యతలను స్థాపించే ఒక చట్టబద్ధమైన ఒప్పందం. వివాహం నిర్వచనం వివిధ సంస్కృతుల ప్రకారం మారుతుంది,కానీ ప్రధానంగా వ్యక్తుల మధ్య సంబంధాలలో,సాధారణంగా సన్నిహిత, లైంగిక సంబంధాలలో సంతరించుకున్న వ్యవస్థ. కొన్ని సంస్కృతులలో వివాహం ఒక సిఫార్సు లేదా ఇద్దరు భాగస్వామ్యుల మధ్య లైంగిక సంబంధానికి ముందు తప్పనిసరిగా చేసుకొనే ఒప్పందం. విస్తారంగా వివరించుటకు వివాహం అనేది ఒక సాంస్కృతికంగా సార్వజనీనమైన కార్యం.

శివానందమూర్తి
                                     

ⓘ శివానందమూర్తి

కందుకూరి శివానంద మూర్తి మానవతావాది, ఆధ్యాత్మిక, తత్వవేత్త. భారతదేశం లోనూ, విదేశాల్లోనూ అతనుకు ఎంతో మంది శిష్యులు, అభిమానులు ఉన్నారు. విశాఖపట్నంలోని భీమునిపట్నంలో ఆనందవనం పేరిట ఉన్న ఆశ్రమంలో నివసించేవారు. సంప్రదాయం, సంస్కృతి అంశాల మీద ఎన్నో పుస్తకాలు రచించారు.

                                     

1. జీవిత విశేషాలు

అతను తల్లిదండ్రులు సర్వమంగళ, వీరబసవరాజులు శివభక్తులు, దాదాపు 200 శివాలయాలను నిర్మించారు. వీరు ఆరాధ్యబ్రాహ్మణులు. చిన్నతనం నుండి శివానందమూర్తి ఆధ్యాత్మిక విషయాల పట్ల, ముఖ్యంగా యోగశాస్త్రం పట్ల ఎంతో ఆసక్తి కనబర్చేవారు. 1949 లో సైన్సు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి సబ్ ఆర్డినేట్ సర్వీస్ లో చేరారు. పోలీసు డిపార్టుమెంటులో హన్మకొండలో పనిచేస్తున్నప్పుడు కూడా ఆర్తులకు, పేదవారికి సేవ చేయడం పట్ల, హిందూ ధర్మ బోధన పట్ల ఎక్కువ సమయం వెచ్చించే వారు. ఆఫీసరుగా స్వచ్ఛంద పదవీ విరమణ చేసి సేవాకార్యక్రమాల పట్ల, సాంస్కృతిక సేవ పట్ల దృష్టి సారించారు.

సమున్నతమైన భారతదేశం, సనాతన ధర్మాల వేళ్లూనుకున్న ప్రాచీన సంస్కృతి పట్ల అతనుకు అమితప్రేమ. సన్యాసులతో సహా అందరూ ప్రజాసంక్షేమానికి ట్రస్టీలుగా, సంరక్షకలుగా తమ వంతు కర్తవ్యం నిర్వర్తించాలని తన ప్రసంగాల్లో తరుచూ చెబుతుంటారు. హిందు ధర్మం, దాని చరిత్ర, సంగీత సాహిత్యాలు, నాట్యనాటకాల విషయాల్లో అతను ఒక విజ్ఞాన సర్వస్వం.

రాజకీయ, సాంస్కృతిక ఆధ్యాత్మిక చరిత్ర మీద అతను రాసిన వ్యాసాలు ఒక తెలుగు డైలీలో ప్రచురితమై తరువాత భారతీయత పేరిట రెండు సంపుటాలుగా ముద్రితమయ్యాయి. కఠోపనిషత్ మీద అతను రాసిన కఠయోగ అన్న పుస్తకం బహథా ప్రశంసలు అందుకని, కంచి పీఠం పరమాచార్య, శృంగేరీ శంకరాచార్యుల మన్ననలను చూరగొంది. ఈ పుస్తకానికి ముందు మాట రాసిన డేవిడ్ ఫ్రాలీ "అద్వైతం, జ్ఞానం, యోగం, దాని అంతర్వాహినుల గురించి తెలిసిన విశిష్ఠమైన వ్యక్తి శివానంద మూర్తి" అన్నారు. హిందూ వివాహ వ్యవస్థ 2006, మహర్షుల చరిత్ర 2007, గౌతమబుద్ధ 2008 అతను ఇతర రచనల్లో ముఖ్యమైనవి. సరైన జీవన విధానం పట్ల సామాన్యుడికి స్ఫూర్తినిస్తూ ఆంధ్రభూమిలో అతను రాసిన 450 పైగా వ్యాసాలు ప్రచురితమయ్యాయి. పురాణాలు, కావ్యాలు, సాహిత్య గ్రంథాల నుంచి ఆంధ్రదేశ చరిత్రను క్రోడీకరించి మనకథ పేరిట గ్రంథస్తం చేశారు. ఇది హైదరాబాదు దూరదర్శన్ లో 13 భాగాలుగా ప్రసారమైంది.

సనాతన ధర్మ చారిటబుల్ ట్రస్టుకు అతను ప్రధాన ధర్మకర్త. లలిత కళలు, సాంకేతికం, విజ్ఞానం, వైద్యం, జర్నలిజం, మానవశాస్త్రాలు, ఇతర రంగాల్లో కృషి చేసిన వారిని ఈ ట్రస్టు ఒక వేదిక మీదకు తీసుకుని వచ్చి సన్మానిస్తూ ఉంటారు.

భారతీయ సంప్రదాయ సంగీతాన్ని, నాట్యాన్ని ప్రోత్సహించేందుకు ఆంధ్ర మ్యూజిక్ అకాడెమీని స్థాపించారు. రికార్డింగుల కోసం ఆనందవనం ఆశ్రమంలో అత్యాధునికమైన రికార్డింగ్ హాల్ ను నిర్మించారు. ఇక్క డ వర్క్ షాపులను నిర్వహిస్తుంటారు. ప్రతి ఏటా హైదరాబాదులో ఈ అకాడెమీ సంగీతోత్సవాలను నిర్వహిస్తుంది.

చెన్నైలోని శ్రీ రాజా లక్ష్మీ ఫౌండేషన్ అతనును 2000 లో శ్రీ రాజా లక్ష్మీ పురస్కారం తో, తెలుగు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ తో సన్మానించాయి.

తిరుపతినందు గల రాష్ట్రియ సంస్కృత విద్యాపీఠం మహామహోపాధ్యాయ బిరుదముతో సత్కరించింది.

అతను ప్రవచనాలు ప్రధానంగా సనాతన ధర్మం మీదనే సాగుతుంటాయి. సనాతన ధర్మాన్ని చిత్త శుద్ధితో పాటిస్తే భారతదేశానికి పునర్వైభవం సిద్ధిస్తుందని చెబుతుంటారు. సనాతన ధర్మాచారం వల్ల విలువలు ఏర్పడి ఆత్మగౌరవం ఇనుమడిస్తుందని అంటారు.

సుప్రసిద్ధ ఆధ్యాత్మకవేత్త సద్గురు శివానందమూర్తి 87 తుదిశ్వాస విడిచారు. 10.06.2015 బుధవారం తెల్లవారుజామున 2.30 గంటలప్పుడు అతను కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా ఆనారోగ్యానికి గురైన శివానందమూర్తి వరంగల్‌లోని ములుగు రోడ్డులో ఉన్న గురుధామ్‌లో శివైక్యం చెందారు. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో 1928, డిసెంబరు 21న జన్మించిన శివానందమూర్తి, భీమిలిలో ఏర్పాటు చేసిన ఆనందవనం ద్వారా ఆధ్యాత్మిక కార్యకలాపాలు నిర్వహించారు. శివానంద కల్చరల్ ట్రస్ట్, ఆంధ్రా మ్యూజిక్ అకాడెమీలను నెలకొల్పి తెలుగు రాష్ట్రాలు సహా ఎన్నో ప్రాంతాలలో సాంస్కృతిక, కళారంగాలకు విశిష్ట సేవలందించారు. శివానంద అనారోగ్యంతో ఉన్నప్పుడు ప్రధానమంత్రి నరేంద్రమోదీ అతను కుమారుడికి ఫోన్ చేసి సద్గురు యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.

సద్గురు శ్రీ శివానందమూర్తి కళలను, సాహిత్యాన్ని సనాతన ధర్మ స్ఫూర్తికి అనుగుణంగా పునరుజ్జీవింపజేస్తూ ఒక మణిసేతువును నిర్మించారు. ఆధ్యాత్మిక స్థాయిలో తత్వ రహస్యాలను ఉపదేశించి సాధు మార్గంలో నడిపిస్తున్నారు.

గురు తత్వాన్ని గురించి సంగ్రహంగా క్రింది నాలుగు పద్యాలు తెలియజేస్తున్నాయి.

  • గురువు ఈశ్వర లీలా రథ శిఖర వైజయంతి

గురువు ఆత్మారోహ గిరిశిఖరం మీది జ్యోతి

గురువు జిజ్ఞాసువుల దాహం తీర్చే ప్రపాశాల

గురువు సుషుమ్నాద్వారం, గురువు శివుని మారు రూపు

  • సంసిద్ధమైన బ్రతుకులో తానై వచ్చే వినూత్తాతిథి

అతీత జీవానుభూతుల రహస్యాల భాండాగారం

సనాతన పరంపరా తేజస్సును మన దాకా మోసుకువచ్చి

ఈ హృదయంలో ప్రతిష్ఠించి తాను మరుగయ్యే దివ్య తీర్థం

  • అతి మనస్సులోనుంచి జలపాతమై దూకే కవిత

సమష్టి మనస్సులో నుంచి ప్రాకివచ్చే ప్రాగ్రూపం

ధ్యాన వేళ అభీప్సను ఊర్థ్వంగా మోసుకుపోయే జ్వలదగ్ని

పంచభూతాల సమష్టిని మనకోసం దయతో గ్రహించిన ఈశ్వరుడు

  • ఆశ్రయం లభించితే చాలు అభ్యాసి తొలి ఘట్టం దాటినట్లే

గురు తేజస్సు హృదయంలో చేరి వృత్తులను నియమిస్తుంది.

ప్రలోభపెట్టే దృశ్యాలను, సిద్ధులను కట్టడి చేస్తుంది

గురుభావం భుజం మీద నిలుపుకొని చివరిదాకా తీసుకుని వెళుతుంది

                                     

2. అనుగ్రహభాషణం

"ఈ జగత్తు అంతా ఒక గ్రంథం. దాని గ్రంధకర్త ఆ ఈశ్వరుడే. ఈ జగత్తులో ఏ ఘటన చోటుచేసుకున్నా ఆ గ్రంథంలో వ్రాసి ఉన్నందునే సంభవిస్తోంది. వేలమంది పండితుల అనుభవాలను వ్రాసినా ఆ జగత్ గ్రంధకర్త అనుభవసారం అంతుచిక్కదు. జీవితంలో కష్టాలు, సుఖాలు, చరిత్ర, సనాతన సంప్రదాయం వంటి చెడు, తీపి ఘటనలన్నీ జగత్ గ్రంధకర్త వ్రాసిన గ్రంథంలోనివే. ఆ గ్రంథం మనం చదవకుండా ఉండలేం. చదివి అర్ధంచేసుకోలేం. ఎంత చదివినా పూర్తికాదు. గ్రంధకర్త వ్రాసింది సృష్టి, స్థితి, లయం అను మూడు అధ్యాయాలే. కానీ వాటి సారాన్ని తెలుసుకోవడం ఎవరికైనా గగనమే.

"అయితే గ్రంధకర్తని ధ్యానిస్తే చాలు. ఏం చేసినా ఈశ్వరునికి అర్పణ చేయాలి. అప్పుడే జీవితం ఈశ్వరునికి ఇచ్చిన హారతి అవుతుంది.

"దేనికీ ఇతరులపై ఆధారపడవద్దు. అలా ఆధారపడితే ఫలితం దక్కదు. ఎవరినుండీ ఏమీ ఆశించవద్దు. ఎదుటివారు విమర్శిస్తే ఆ మాట వినవద్దు.

"ఆత్మగౌరవంతో ఏది మంచి మార్గమో ఆలోచించి ఆ దిశగా పయనించాలి. ఆత్మవిశ్వాసం నుండి ఆత్మగౌరవం వస్తుంది.

"ఒకరి ఆమోదం కోసం యాచించవద్దు. ఒకరి నుండి కోరినది దక్కకపోతే బాధపడవద్దు.

"మన జీవితంలో ఏది చోటుచేసుకున్నా అది జగత్ గ్రంధకర్త నిర్ణయమే అని ఆమోదిస్తూ సనాతన ధర్మ మార్గంలో పయనించడం అందరి లక్ష్యం కావాలి.

"ఈశ్వరుని ఆరాధన, నామస్మరణ ఎన్నటికీ మరవకండి." Mare meru andaru chuse tarinchandi

                                     

3. పత్రికా లింకులు

  • My humble salutations to Sadguru Sivananda Murty Article by Sri.V.Sundaram in Newstoday 29 May 2007
  • The Dominating evil of Black Money, by K.Sivananda Murty, The Hindu, Sunday, Jun 07, 2009
  • Friend, Philosopher and Guide The Hindu dated 31.03.2003
                                               

కందుకూరి

కందుకూరి రుద్రకవి, సుగ్రీవ విజయం అనే తెలుగులో మొదటి యక్షగానం రచయిత. కందుకూరి రామభద్రరావు, రచయిత, కవి, అనువాదకుడు. కందుకూరి రాజ్యలక్ష్మమ్మ, సంఘ సేవకురాలు. కందుకూరి శివానందమూర్తి లేదా సద్గురు శివానందమూర్తి గా ప్రసిద్ధిచెందిన పండితులు. కందుకూరి వీరేశలింగం, గొప్ప సంఘ సంస్కర్త. కందుకూరి అనంతము, కథా రచయిత. కందుకూరి బాలసూర్య ప్రసాదరావు, పండితులు, రచయిత, విజ్ఞాన సర్వస్వ సంకలన కర్త.

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →