Back

ⓘ ఆంధ్రుల సాంఘిక చరిత్ర                                               

సురవరం ప్రతాపరెడ్డి

తెలంగాణ రాజకీయ, సాంఘిక చైతన్యం అంటే వెంటనే గుర్తుకు వచ్చే పేరు సురవరం ప్రతాపరెడ్డి. పత్రికా సంపాదకుడుగా, పరిశోధకుడుగా, పండితుడుగా, రచయితగా, ప్రేరకుడుగా, క్రియాశీల ఉద్యమకారుడుగా బహుముఖాలుగా సాగిన ప్రతాపరెడ్డి ప్రతిభ, కృషి అనన్యమైనవి. స్థానిక చరిత్రల గురించి, స్థానిక ప్రజల కడగండ్ల గురించి అతను పడిన నిరంతర తపనకు ప్రతి అక్షరం ప్రత్యక్ష సాక్ష్యం. తెలంగాణలో కవులే లేరనే నిందావ్యాఖ్యలను సవాలుగా తీసుకొని 354 కవులతో కూడిన "గోల్కొండ కవుల సంచిక" గ్రంథాన్ని కవుల జీవిత విశేషాలతో సహా ప్రచురించి గ్రంథరూపంలోనే సమాధానమిచ్చిన వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి. తెలంగాణ సాంస్కృతిక చరిత్రలో సురవరం ప్రతాపరెడ్డి ఒక ...

                                               

మట్టెలు

హిందూ స్త్రీలకు పెళ్ళి రోజున పెళ్ళి ముహుర్తానికి ముందు జరిగే నలుగు కార్యక్రమంలో మేనమామ లేక మావ వరుస అయినవారు పెళ్ళికుమార్తె కాళ్ల బొటన వ్రేలి పక్కనున్న వ్రేళ్ళకు వెండి రింగ్ లను తొడుగుతారు, వీటినే మట్టెలు లేక మెట్టెలు అంటారు. స్త్రీ ఐదోతనంలోని ఐదు అలంకారాలలో మట్టెలు ఒకటి. స్త్రీలు మట్టెలు ధరించుట తెలుగు అచారము. ఇది వైదిక సంస్కృతిలో లేదు. సాహిత్యంలో మట్టెల గురించిన తొలి ప్రస్త్రావన ఆంధ్రమహాభారతంలోని విరాట పర్వంలో ఉంది. "లలితంబులగు మట్టియల చప్పుడింపార సంచకైవడి నల్లనల్ల వచ్చి" విరాట 2-64. నన్నయ తిక్కన కాలంలో పురుషులు కూడా కాళివేళ్లకు మట్టెలు ధరించెడివారు. అరుదుగా ఈ కాలంలో కూడా అక్కడక్కడ కొందర ...

                                               

సిడిమ్రాను

విజయనగర సామ్రాజ్య కాలంలో సిడి అనే ఉత్సవం జరిగేది. భక్త్యావేశంలో తమను తాము హింసించుకుంటూ, మొక్కుబడులు చెల్లించేందుకు భక్తులు ఈ ఉత్సవం చేసేవారు. ఒక పెద్ద గడ కొనకు ఒక ఇనుప కొక్కెం కట్టేవారు. ఆ కొక్కెం గడ చుట్టూ తిరిగే ఏర్పాటు ఉండేది. భక్తులు ఆ కొండిని తమ వీపు చర్మానికి గుచ్చుకుని, వేళ్ళాడేవారు. అలా వేళ్ళాడుతుండగా గడను గిరగిరా తిప్పేవారు. పురుషులే కాక స్త్రీలు కూడా ఇలా వేళ్ళాడేవారు. ఈ సిడిని సిడిమ్రాను అని కూడా అంటారు. మ్రాను అంటే చెట్టు, కాండము, గడ అని అర్థాలున్నాయి. తెనాలి రామకృష్ణుడు తన పాండురంగ మాహాత్మ్యము కావ్యంలో సిడిని ఇలా వర్ణించాడు: అంబోధరము కింద నసియాడు, నైరావ తియుబోలె సిడి వ్రేలె తె ...

                                               

ఆంధ్ర వాజ్మయమున చారిత్రక కావ్యములు

ఆంధ్ర వాజ్మయమున చారిత్రక కావ్యములు 17వ శతాబ్దం వరకు తెలుగు భాషలో విడుదలైన చారిత్రక కావ్యముల గురించి డాక్టర్ బి. అరుణకుమారి గారి పరిశోధన గ్రంథము. దీనిని 1978 సంవత్సరంలో ఆంధ్రా యూనివర్సిటీ, వాల్తేరు ప్రచురించింది. క్రీ.పూ. 200 నుండి. క్రీ.శ. 1700 వరకు ఆంధ్రదేశము లోని రాజకీయ, మత, సాంఘిక పరిస్థితులను వాటి పరిణామములను విశదీకరించే ప్రయత్నమిది. ఇందులో భారతదేశంలో తెలుగు రాజ్యమును స్థాపించిన వల్లభుని అభ్యుదయ కథనము, చోళుల వీరగాథలు, మహోన్నతాంధ్ర సామ్రాజ్య స్థాపకులైన కాకతీయుల చరిత్ర, పలనాటి వీరుల శౌర్య ప్రతాపములు, కాటమరాజు కథ, ఆంధ్ర కర్ణాటక సార్వభౌముడగు శ్రీకృష్ణదేవరాయని సమరౌద్ధత్యము, ఆరవీటి రాజుల చరి ...

                                               

భోగరాజు నారాయణమూర్తి

ఈయన 1891, అక్టోబర్ 8 న గజపతినగరం బొండపల్లి మండలం లోని దేవుపల్లి గ్రామంలో జన్మించాడు. ఈయన తల్లిదండ్రులు బాల ప్రసాద రావు, జోగమ్మ. విజయనగరం మహారాజా ఉన్నత పాఠశాలలో తెలుగు పండితుడుగా పనిచేశాడు.

                                               

తెలుగు ప్రథమాలు

తొలి తెలుగు ద్వ్యర్థికావ్యము - రాఘవ పాండవీయము తొలి తెలుగు శతకము - వృషాధిప శతకము తొలి తెలుగు వ్యావహారిక నాటకము - కన్యాశుల్కం తొలి తెలుగు దృష్టాంతశతకము - భాస్కర శతకము శాసనాలలో తొలి తెలుగు పదం - నాగబు తొలి తెలుగు ధర్మశాస్త్రము - విజ్ఙానేశ్వరీయము తొలి తెలుగు కవి - నన్నయ తొలి తెలుగు ద్విపదకవి - పాల్కురికి సోమన తొలి తెలుగు గణిత గ్రంథము -గణితసార సంగ్రహము తొలి తెలుగు ఛందశ్శాస్త్రము - కవి జనాశ్రయము తొలి తెలుగు శృంగారకవయిత్రి - ముద్దుపళని తొలి తెలుగు నీతి శతకము - సుమతీ శతకము తొలి ఉరుదూ-తెలుగు నిఘంటువు - ఐ.కొండలరావు 1938 తొలి తెలుగు కవయిత్రి - తాళ్ళపాక తిమ్మక్క తొలి తెలుగు సాంఘిక నాటకము - నందకరాజ్యం ...

                                               

బి. ఎస్. ఎల్. హనుమంత రావు

ఆచార్య భట్టిప్రోలు శ్రీలక్ష్మీహనుమంతరావు ప్రముఖ విద్యావేత్త. చరిత్రకారుడు. ఆంగ్లంలోను, తెలుగులోను బహు గ్రంధ రచయిత. అనువాదకుడు. వీరు రాసిన గ్రంధాలలో" ఆంధ్రుల చరిత్ర” ఉత్తమ ప్రామాణిక చరిత్ర రచనగా నిలిచింది. మరో చారిత్రిక పరిశోదక గ్రంధం "రెలిజియన్ ఇన్ ఆంధ్ర" పండితలోకంలో విశేష ఖ్యాతిని పొందింది.

                                               

మూసీ పబ్లికేషన్స్

మూసీ పబ్లికేషన్స్ Musi Publications ఒక ప్రచురణ సంస్థ. దీని ప్రధాన కేంద్రం హైదరాబాద్ ఉంది. దీనిని ప్రసిద్ధ శాసన పరిశోధకులు, చరిత్రకారులు ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన బి.ఎన్. శాస్త్రి 1980 స్థాపించారు.

                                               

బెండపూడి అన్నయ మంత్రి

బెండపూడి అన్నయమంత్రి కాకతీయుల మంత్రి, సైన్యాధ్యక్షుడు అనంతరకాలంలో ముఖ్యమైన నాయకుడు. ప్రతాపరుద్రుడు మరణించి, కాకతీయ సామ్రాజ్యం పతనమైపోయాకా, తురుష్కుల పరిపాలనను ఎదిరించి మునుసూరి నాయకుల పరిపాలనకు బాటలువేసిన రాజకీయవేత్త. కాకతీయ పతనానంతరం సంధి యుగంలో అత్యంత ముఖ్యమైన వీరుడు అన్నయమంత్రి. కాకతీయుల కొలువులో తనతో పాటు పనిచేసిన కొలను రుద్రదేవుడు అనే సహ దేశాభిమానితో కలిసి అన్నయమంత్రి తిరుగుబాటుకు రూపకల్పన చేశాడు. చెదిరిపోయిన సైన్యాన్ని, నాయకులను అన్నయమంత్రి, రుద్రదేవుడు పోగుచేసి నూజివీడు ప్రాంతానికి చెందిన కాకతీయ నాయకుడైన ప్రోలయ నాయకుడిని వారికి నాయకుడిగా ఎన్నుకున్నారు. అనంతర కాలంలో ప్రోలయ నాయకుడి నా ...

                                               

పూటకూళ్ళ ఇల్లు

పూర్వం దూర ప్రయాణాలు చేసేవారు విశ్రాంతి తీసుకోవడానికి హోటల్స్ ఉండేవి కావు. గ్రామాలలో కొన్ని మధ్య తరగతి కుటుంబాల వారు బ్రతుకు తెరువు కోసం పూటకూళ్ళ ఇళ్ళు నడిపేవారు. ఈ గ్రామాల మీదుగా వెళ్ళే యాత్రికులు భోజన సమాయానికి ఈ పూటకూళ్ళ ఇళ్ళకు చేరుకునేవారు. ఇలా వచ్చిన వాళ్ళ సంఖ్యను చూసుకొని, వాళ్ళు కాలు చేతులు కడుక్కొని సేద తీరేంతలో వారికి భోజనాలు తయారుచేసి పెట్టేవారు. ఇందుకు ప్రతిఫలంగా కొంత సొమ్మును పుచ్చుకొనేవారు. ఇంకా కొన్ని ఇళ్ళలో రాత్రులు బస చేయడానికి కూడా సౌకర్యాలుండేవి. పూటకూళ్ళ ఇల్లు 18, 19 శతబ్దాలలో, అనగా బ్రిటీషువారి భారతదేశ పాలన మధ్యకాలానికి కనుమరుగయ్యాయి. ఒకవిధంగా పూర్వం ఉన్న పూటకూళ్ళ ఇళ్ళు ...

                                               

నియోగులు

నియోగులు లేక నియోగి బ్రాహ్మణులు తెలుగు బ్రాహ్మణుల్లో ఒక శాఖ. బ్రాహ్మణులై ఉండి రాజకీయ, కార్యనిర్వహణ, రెవెన్యూ వంటి రంగాల్లో వందల సంవత్సరాల నుంచి ఉద్యోగాలు చేస్తూ సాగిన వారు నియోగులు. ఒక ఉద్యోగంలో నియోగింపబడినవాడు కాబట్టి నియోగి అని

                                               

ఆంధ్రదేశము విదేశయాత్రికులు

ఆంధ్రదేశము విదేశయాత్రికులు 1926 ముద్రించబడిన తెలుగు రచన. దీనిని భావరాజు వేంకట కృష్ణారావు గారు రచించి, ఆంధ్రదేశీయేతిహాస పరిశోధకమండలి వారిద్వారా ప్రచురించారు. ఈ కృతిని తన్ ప్రియస్నేహితుడైన కోలవెన్ను రామకోటీశ్వరరావు కు అంకితమిచ్చారు. వీనిలో యుఁఆన్ చ్వాంగ్ మరియు అబ్దుర్ రజాక్ యాత్రా విశేషాలను శారద, భారతి పత్రికలలో ప్రచురించబడ్డాయి.

ఆంధ్రుల సాంఘిక చరిత్ర
                                     

ⓘ ఆంధ్రుల సాంఘిక చరిత్ర

ఆంధ్రుల సాంఘిక చరిత్ర గ్రంథాన్ని సంపాదకుడు, చరిత్ర కారుడు, రచయిత సురవరం ప్రతాపరెడ్డి సుమారు 20 సంవత్సరాల పాటు చేసిన పరిశోధన చేసి రచించాడు. రెండు వేలయేళ్ళుగా వివిధ సాహిత్య ఆకరాలను ఆధారం చేసుకుని కొంతవరకూ పురావస్తువులతో సరిచూసుకుని రచించిన సాంఘిక చరిత్ర ఇది. రాజుల చరిత్ర కాక ప్రజల చరిత్రకు ఇది ప్రాధాన్యం ఇస్తుంది.

                                     

1. రచన నేపథ్యం

దీన్ని 1949 లో మొదటిసారి ఆంధ్ర సారస్వత పరిషత్తు ప్రకటించింది. ఆ తరువాత ఈ గ్రంథాన్ని అనేక ముద్రణల తరువాత విశాలాంధ్ర తిరిగి ముద్రించింది. కేంద్ర సాహిత్య అకాడెమీ భారతీయ భాషలకు ఇచ్చే జాతీయ బహుమతిని తెలుగులో మొదటిసారి ఈ గ్రంథానికి ఇచ్చింది. ఆంధ్ర ప్రజల ఆచార వ్యవహారాలు, ఆహార విహారాలు, ఆటపాటలు మొదలైన వాటికి చోటు ఇచ్చింది. అనేక భారతీయ భాషల లోకి ఇది అనువాదమైంది. దీనిని సురవరము ప్రతాపరెడ్డి సాహిత్య వైజయంతి, హైదరాబాదు వారు 1982 సంవత్సరంలో మూడవసారి 2000 కాపీలు ముద్రించారు. ప్రతాపరెడ్డి గ్రంథానికి ముందుమాటలో తనకు పూర్వమే ఈ విషయాన్ని భావన చేసి అలాంటి ప్రయత్నాలు చేసినవారి పేర్లు ప్రస్తావించారు. చిలుకూరి వీరభద్రరావు తన ఆంధ్రుల చరిత్రము గ్రంథంలోని వెలమవీరుల చరిత్ర ప్రకరణంలో పుట అడుగున "ఆంధ్రుల సాంఘిక చరిత్ర ప్రత్యేకంగా విరచింపబడుతున్నది. కావున ఈ విషయమైవెలమాది జాతుల సంగతి అందు సవిస్తరంగా చర్చింపబడుతున్నది" అన్నారు. దాని ఆధారంగా చూస్తే వీరభద్రరావు కొంతవరకూ ఆంధ్రుల సాంఘిక చరిత్ర రాసే ప్రయత్నం ప్రారంభించి ఏవో కారణాంతరాల వల్ల నిలిపివేసి ఉండొచ్చని ప్రతాపరెడ్డి భావించారు. ఆంధ్రుల సాంఘిక చరిత్రకు సంబంధించి ప్రఖ్యాత చారిత్రికులు నేలటూరి వెంకట రమణయ్య ఆంగ్లవ్యాసం రచిస్తే, మల్లంపల్లి సోమశేఖర శర్తమ రెడ్డి రాజ్యాల చరిత్రలో సాంఘిక చరిత్రను కూడా చేర్చారు. ఇలా కొందరు చారిత్రికులు ఆ ఆలోచన ప్రతిపాదించి, మరికొందరు కొంత కృషిచేసినా పూర్తిస్థాయిలో ఆంధ్రుల సాంఘిక జీవన చరిత్ర రచనలో ఇదే మొదటి గ్రంథంగా పేర్కొంటున్నారు.

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →