Back

ⓘ రోహింగ్యా ప్రజలు                                               

2016–17 ఉత్తర రఖినె రాష్ట్ర సంఘర్షణలు

2016 అక్టోబర్ 9న ఎ.ఆర్.ఎస్.ఎ. తిరుగుబాటుదారులు బంగ్లాదేశ్-మయన్మార్ సరిహద్దు వెంబడి బర్మీస్ సరిహద్దు దళాల స్థావరాలపై దాడిచేయడంతో హింస ప్రారంభం అయింది. 520 సాయుధులు, 2.000 మందికి పైగా సాధారణ ప్రజలు మరణించినట్టు అంచనా. 23 వేలమంది ప్రజలు అంతర్గతంగా నిర్వాసితులయ్యారు. అక్టోబర్ 2016 దాడి తర్వాత రోహింగ్యా తిరుగుబాటుదారులుగా అనుమానితులైన సాధారణ ప్రజల మీద బర్మీస్ భద్రతా దళాలు దాడులు చేస్తున్నాయంటూ మానవ హక్కుల ఉల్లంఘనలు జరిగాయని పేర్కొంటూ పలు రిపోర్టులు వెలువడ్డాయి. 2017 ఆగస్టు 25న ప్రారంభమైన తర్వాత హింస అనంతరం 2 వారాల్లో కనీసం 2.70.000 మంది రోహింగ్యాలు వలసపోయారు.

                                               

బంగ్లాదేశ్

బంగ్లాదేశ్, అధికారికంగా బంగ్లాదేశ్ ప్రజా గణతంత్ర రాజ్యము దక్షిణాసియాలో, భారతదేశ సరిహద్దుల్లోని ఒక దేశము. ఇది సారవంతమైన గంగా-బ్రహ్మపుత్ర మైదాన ప్రాంతంలో ఉన్న దేశము. చారిత్రకంగా బెంగాల్ భాషా ప్రాంతంలోని భాగము. దీనికి దక్షిణాన బంగాళాఖాతము, ఉత్తర, తూర్పు, పడమరల భారతదేశము, ఆగ్నేయాన బర్మా సరిహద్దులుగా ఉన్నాయి. హిమాలయ దేశాలైన నేపాల్, భూటాన్ లను భారతదేశ సిల్గురి కారిడార్ వేరు చేస్తుంది. ప్రాదేశికంగా చైనాకు దగ్గరగా ఉంది.

                                               

అంగ్ సాన్ సూకీ

ఆంగ్ సాన్ సూకీ 1945 జూన్ మాసంలో జన్మించింది. ఆమె బర్మాదేశ ప్రతిపక్షనాయకురాలు. ఆమె బర్మాలో ప్రముఖ రాజకీయవాది, "నేషనల్ లీగ్ ఫర్ డెమాక్రసీ చైర్ పర్సన్. 1990 జనరల్ ఎన్నికలలో ఎన్ ఎల్ డి 59% ఓట్లను, 81% పార్లమెంట్ స్థానాలను గెలుచుకుంది. అయినప్పటికీ ఆమెను ఎన్నికలకు ముందే బర్మా ప్రభుత్వం గృహనిర్బంధంలో ఉంచింది. ఆమె 1987 నుండి 2010లో విడుదల అయ్యేవరకూ దాదాపు 15 సంవత్సరాలకాలం గృహనిర్బంధంలోనే ఉంచబడింది. ఆమె ప్రపంచంలో ప్రముఖ రాజకీయఖైదీగా గుర్తించబడింది. సూకీ 1990లో స్వతంత్ర భావాల కొరకు రాఫ్టో, షాఖ్రోవ్ పురస్కారం అందుకున్నది. 1991లో నోబుల్ బహుమతి అందుకున్నది. భారత ప్రభుత్వం అంతర్జాతీయ అవగాహన కొరకు ఆమెకు ...

రోహింగ్యా ప్రజలు
                                     

ⓘ రోహింగ్యా ప్రజలు

రోహింగ్యా ప్రజలు లేదా రోహింగ్యా శరణార్థులు లేదా రోహింగ్యా ముస్లింలు.(ˈ r oʊ ɪ n dʒ ə, / ˈ r oʊ h ɪ n dʒ ə, / ˈ r oʊ ɪ ŋ j ə, or / ˈ r oʊ h ɪ ŋ j ə / ; లేదా అరకాన్ ఇండియన్స్ అనువారు మయన్మార్ లోని రఖైన్ రాష్ట్రానికి చెందిన ప్రజలు. వీరికి ఏ దేశపు పౌరసత్వం లేదు. కావున వీరిని శరణార్థులు గా పరిగణిస్తున్నారు.

                                     

1. నేపధ్యము

ముస్లింలలో ప్రత్యేక తెగకు చెందిన సుమారు 10లక్షలమంది రోహింగ్యాలు తరతరాలుగా మయన్మార్‌లో నివసిస్తున్నారు. కానీ, 1982లో మయన్మార్‌ సర్కారు తీసుకొచ్చిన పౌరసత్వం చట్టంలో 135 స్థానిక జాతులలో ఒకటిగా రోహింగ్యాలను గుర్తించలేదు.ఆ దేశం వారిని తమ పౌరులుగా గుర్తించలేదు. రోహింగ్యా బెంగాలీ పదమని, వారంతా బంగ్లాదేశ్‌ నుంచి తమ దేశానికిఅక్రమంగా వచ్చారని మయన్మార్‌ వాదిస్తోంది. తమ దేశం నుంచి వెళ్లిపోయేలా ‘పొగ’ పెడుతోంది. హింసను భరించలేక రోహింగ్యాలు ప్రాణాలకు తెగించి మరీ వలస వెళుతున్నారు. సముద్రంలో నాటు పడవల్లో ప్రయాణిస్తూ బంగ్లాదేశ్‌తోపాటు థాయ్‌లాండ్‌, మలేసియా తదితర దేశాలకు చేరుకుంటున్నారు. నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత ఆంగ్‌సాన్‌ సూకీ పార్టీ నేతృత్వంలో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడినా వారి పరిస్థితి మారకపోగా కష్టాలు మరింత పెరిగాయి. రోహింగ్యాల అణచివేత వార్తలు మీడియాలో రాకుండా ‘సెన్సార్‌’ మొదలైంది. బీబీసీ బర్మా చానల్‌ దీనిపై బహిరంగంగా నిరసన ప్రకటించింది.మయన్మార్‌లో రోహింగ్యా పదాన్ని నిషిద్ధంగా భావిస్తారు.

                                     

2. హక్కుల కోసం పోరాటం

అరాకన్‌ రోహింగ్యాల విముక్తి సేన అర్సా పేరుతో 2016లో ఒక దళం ఏర్పడింది. రోహింగ్యాల హక్కుల కోసం పోరాటం మొదలుపెట్టింది. దీనిని తీవ్రవాద సంస్థగా పరిగణించిన మయన్మార్‌ ప్రభుత్వము రోహింగ్యాలపై అణచివేతను ముమ్మరం చేసింది. దాడులతో సైన్యం వారిపై విరుచుకుపడింది. ఈ క్రమంలో రఖైన్‌లో ఉండలేక బంగ్లాదేశ్‌లోకి, ఇతర దేశాలలోకి రోహింగ్యాల వలసలు భారీగా పెరిగిపోయాయి.

                                     

3. ఐక్యరాజ్యసమితి ఖండన

మయన్మార్‌లోని రోహింగ్యా ముస్లింలపై జరుగుతున్న దాడిని జాతుల శుద్దీకరణగా ఐక్యరాజ్య సమితి 2017 సెప్టెంబరు 12 న జరిగిన సర్వసభ్య సమావేశంలో అభిప్రాయ పడింది. రోహింగ్యాలపై మయన్మార్‌లో జరుగుతును దాడులపై ఐక్యరాజ్య సమితి మానవహక్కుల సంఘం తీవ్రంగా మండిపడింది. ఒక జాతిపై కక్ష్యగట్టినట్టు జరుగుతున్న దాడులకు అందరూ సిగ్గుపడాలని సమితి మానవ హక్కుక ముఖ్య అధికారి జైదీ ఆల్‌ హసన్‌ అన్నారు. మయన్మార్‌లో యధేచ్ఛగా మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని ఆయన అన్నారు.

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →