Back

ⓘ ఖరియా ప్రజలు                                               

కురుఖు ప్రజలు

ఒరాను లేదా కురుఖు, యురాను లేదా ఓరం అని కూడా పిలుస్తారు, జార్ఖండు, ఒరిస్సా, ఛత్తీసుగఢు రాష్ట్రాలలో నివసించే ఒక జాతి సమూహానికి చెందిన వారు ప్రధానంగా వారి మాతృభాష కురుఖు భాష. ఇవి ద్రవిడ భాషల కుటుంబానికి చెందినవి. సాంప్రదాయకంగా ఒరాన్సు వారి కర్మ, ఆర్థిక జీవనోపాధి కోసం అటవీ, పొలాల మీద ఆధారపడ్డారు. అయితే ఇటీవలి కాలంలో వారిలో కొందరు ప్రధానంగా స్థిరపడిన వ్యవసాయవేత్తలుగా మారారు. చాలా మంది ఒరాను అస్సాం, పశ్చిమ బెంగాలు టీ గార్డెన్కు వలస వచ్చారు. భారతదేశ రిజర్వేషన్ వ్యవస్థ ప్రయోజనం కోసం వారు షెడ్యూల్డు తెగగా జాబితా చేయబడ్డారు. గయానా, ట్రినిడాడు సురినాం లోని చాలా మంది భారతీయులు ఒరాను మూలానికి చెందినవారు.

                                               

సుందర్ఘర్

ఒడిషా రాష్ట్ర 30 జిల్లాలలో సుందర్ఘర్ జిల్లా ఒకటి. జిల్లా పశ్చిమ సరిహద్దులో చత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన రాయగడ జిల్లా, వాయవ్య సరిహద్దులో చత్తీస్‌గఢ్ రాష్ట్రానికి జాష్పూర్ జిల్లా, ఉత్తర సరిహద్దులో జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన సిండెగ జిల్లా, తూర్పు సరిహద్దులో జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన పశ్చిం సింగ్‌భుం, దక్షిణ సరిహద్దులో కెందుజహర్ జిల్లా, జర్స్‌ర్గుడా, దేవ్‌గర్, అంగుల్ జిల్లాలు ఉన్నాయి. జిల్లా కేంద్రంగా సుందర్ఘర్ పట్టణం ఉంది.

                                               

అండమాన్ నికోబార్ దీవులు

భారతదేశంలోని కేంద్రపాలిత ప్రాంతమైన అండమాన్ నికోబార్ దీవులు 572 ద్వీపాల సమూహం. వీటిలో 37 దీవుల్లో ప్రజలు నివసిస్తున్నారు. బంగాళాఖాతం, అండమాన్ సముద్రం కలిసే వద్ద ఈ ద్వీపాల సమూహం ఉంది. భూభాగం విస్తీర్ణం సుమారు 150 చ.కి.మీ.ఇండోనేషియాలోని ఆషేకు ఉత్తరంగా ఉంది. ఈ దీవులను థాయిలాండ్, మయన్మార్ నుండి అండమాన్ సముద్రం వేరు చేస్తోంది. ఇందులో రెండు ద్వీప సమూహాలున్నాయి - అండమాన్ దీవులు, నికోబార్ దీవులు, వీటిని 150 కిలోమీటర్ల వెడల్పు గల టెన్ డిగ్రీ ఛానల్ వేరుచేస్తోంది. ఈ అక్షాంశానికి ఉత్తరాన అండమాన్లు, దక్షిణాన నికోబార్లు ఉన్నాయి. ఈ దీవులకు తూర్పున అండమాన్ సముద్రం, పశ్చిమాన బంగాళాఖాతం ఉంది. ఈ కేంద్రపాలిత ప ...

                                               

పాలీ జిల్లా

కుషాను యుగంలో రాజు కనిష్కుడు సా.శ. 120 లో పాలి జిల్లాలో భాగమైన రోహత్, జైతరన్ ప్రాంతాలను స్వాధీనం చేసుకున్నాడు. సా.శ. 7వ శతాబ్దం చివరి వరకు ఈ ప్రాంతాన్ని రాజస్థాన్ రాష్ట్రంలో ఉన్న ఇతర ప్రాంతాలతో సహా చాళుక్య రాజు హర్షవర్థనుడు పాలించాడు. 10 నుండి 15 వ శతాబ్దం వరకు పాలి సరిహద్దులు ప్రక్కనే ఉన్న మేవార్, గాడ్వాడ్, మార్వార్ వరకు విస్తరించాయి. నాడోలు చౌహానుల రాజధానిగా ఉండేది. రాజపుత్ర పాలకులందరూ విదేశీ ఆక్రమణదారులను ప్రతిఘటించారు. వ్యక్తిగతంగా వారిలో, ఒకరికు ఒకరు భూభాగం మీద ఆధిపత్యం, నాయకత్వం కోసం పోరాడారు. మహమ్మద్ గౌరీ చేతిలో పృథ్వీరాజ్ చౌహాన్ ఓటమి తరువాత ఈ ప్రాంతంలో రాజపుత్ర శక్తి విచ్ఛిన్నమైంది ...

                                               

హిందుస్తానీ భాష

హిందుస్తానీ: భారత దేశంలో మెజారిటీ ప్రజల భాష హిందుస్తానీ. అది లిపుల్ని బట్టి హిందీ ఉర్దూ భాషలుగా చీలింది. హిందీ, సంస్కృతము, పర్షియన్, అరబిక్, టర్కిష్ పదాలు కలిసి ఉర్దూ భాష ఇండియా లోనే పుట్టింది. హిందీ ఉర్దూ ప్రజలిద్దరికీ వాడుక భాష మటుకు ఒకటే హిందుస్తానీ. హిందీ సినిమాలలో ఈ హిందుస్తానీ భాషే రాజ్యమేలుతోంది. హిందీ, ఉర్దూ ఒకటే భాష. కొందరు పండితులు వారి వారి మతాల ప్రత్యేకగుర్తింపు కోసం హిందుస్తానీకి సంస్కృతపదాలు ఎక్కువ కలిపితే హిందీ గానూ, ఫారశీ పదాలు ఎక్కువగా కలిపితే ఉర్దూ గానూ మారుతుంది. ఈ రెండు భాషలకూ సొంత లిపులు లేవు. అరువుతెచ్చుకున్న దేవనాగరి పర్షియన్ లిపుల్లో వ్రాస్తారు. ఈ రెంటినీ ఇంగ్లీషు ల ...

ఖరియా ప్రజలు
                                     

ⓘ ఖరియా ప్రజలు

ఖరియా మధ్య భారతదేశానికి చెందిన ఆస్ట్రోయాసియాటికు గిరిజన జాతి సమూహం. వారు మొదట ఖారియా భాషను మాట్లాడేవారు. వీరు ఆస్ట్రోయాసియాటికు భాషలకు చెందిన ప్రజలు. వారిని హిల్ ఖరియా, డెల్కి ఖరియా, దూధ్ ఖరియా అని మూడు సమూహాలుగా విభజించారు. వారిలో ఒకరైన దూధ్ ఖరియా భారతదేశంలో అత్యంత అభివృద్ధి చెందిన, విద్యావంతులైన జాతి సమాజాలలో ఒకటిగా గుర్తించబడుతుంది.

                                     

1. చరిత్ర

భాషా శాస్త్రవేత్త పాల్ సిడ్వెలు అభిప్రాయం ఆధారంగా 4000-3500 సంవత్సరాల క్రితం ఆగ్నేయాసియా నుండి ముండా భాషలు ఒరిస్సా తీరానికి వచ్చాయి. ఆస్ట్రోయాసియాటికు భాషావాడుకరులు ఆగ్నేయాసియా నుండి ఇక్కడకు వ్యాపించింది. స్థానిక భారతీయ జనాభాతో విస్తృతంగా కలిసింది.

                                     

2. సాంఘిక విభజన

ఖరియాలో మూడు తెగలు ఉన్నాయి. దుధ్ ఖరియా, ధెల్కి ఖరియా, హిల్ ఖరియా. మొదటి ఇద్దరు ఖారియా అనే ఆస్ట్రోయాసియాటికు భాష మాట్లాడతారు. కాని హిల్ ఖరియా ఇండో-ఆర్యన్ భాష అయిన ఖరియా థారుకు మారిపోయింది. ఖరియా థారు కోసం భాషా అభివృద్ధి ప్రయత్నాలు జరగలేదు.

దుధ్ ఖరియా, ధెల్కి ఖరియా కలిసి ఒక సమైఖ్య తెగను ఏర్పాటు చేశాయి. ఈ ఖరియా ప్రజలను అహిరు అధిపతి మీద దాడి చేసి ఆపై చోటా నాగ్పూరు పీఠభూమికి తరలివెళ్ళారు.

ఒరిస్సాలో హిల్ ఖరియా ప్రధానంగా ప్రజలు మయూరభంజు జిల్లాలోని జాషిపూరు, కరంజియా బ్లాకులు అధికంగా కనిపిస్తారు. అదనంగా మొరాడా బ్లాకులో కొన్ని గ్రామాలు కూడా ఉన్నాయి. జార్ఖండులో తూర్పు సింగుభూం, గుమ్లా, సిందేగా జిల్లాల్లో వీరు కేంద్రీకృతమై ఉన్నారు. ఈ జిల్లాలో విస్తృతంగా కనిపించినప్పటికీ ముసాబని, డుమారియా, చాకులియా బ్లాక్సు వారు పెద్ద సంఖ్యలో నివస్తారు. పశ్చిమ బెంగాలులో, వారు పశ్చిమ మిడ్నాపూరు, బంకురా, పురులియా జిల్లాలలో ఉన్నారు. అత్యధికంగా పురులియాలో ఉన్నారు.

కొండ ఖరియాను పహారీ "కొండ" అని అర్ధం ఖారియా, సవారా సబరు, ఖేరియా, ఎరేంగా, లేదా పహారు అని కూడా పిలుస్తారు. ఇతరత్రా బయటి వ్యక్తులు వారిని ఖరియా అని పిలుస్తారు. కాని వారు తమను సబరు అని పేర్కొంటరు. వారు అడవి మధ్యలో నివసిస్తున్నారు. అటవీ ఉత్పత్తి మీద ఆధారపడటం వలన వారిని "పహారీ కొండ ఖరియా" అని పిలుస్తారు.

కొండ ఖరియాలో గొల్గో, భూనియా, శాండి, గిడి, డెహూరి, పిచ్రియా, నాగో, టోలాంగు, సుయా, ధారు, తేసా, కోటలు, ఖార్మోయి, దిగరు, లాహా, సద్దారు, సికారి, రాయి, డుంగ్డంగు వంటి అనేక గోత్రాలు వంశాలు ఉన్నాయి. బిలుంగు, కిరో, కెర్కెటా, సోరెంగు, కులు, బా, టేటు, డోలై, సాలు, అల్కోసి, ఖిలాడి. గొల్గో ప్రబలంగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి గ్రామంలో వారి వంశాలు అడిగినప్పుడల్లా ఆ వంశం మొదట ఉచ్చరించబడుతుంది.

                                     

3. వితరణ

వారు ప్రధానంగా బీహారు, మధ్యప్రదేశు, ఒరిస్సా, పశ్చిమ బెంగాలు, మహారాష్ట్రలలో, త్రిపురలో నివసిస్తున్నారు. అస్సాం, అండమాను దీవులలో కొన్ని కుటుంబాలు కనిపిస్తాయి. 1981 జనాభా లెక్కల ఆధారంగా బీహారులో వారి జనాభా 1.41.771, ఒడిశాలో ఇది 144.178, మధ్యప్రదేశ్‌లో 6892.

                                     

4.1. సంస్కృతి జీవనవిధానం

బ్రిటిషు పాలనలో వారు జమీందారులుగా ఉన్నారు. ఇప్పుడు స్వతంత్ర భారతదేశంలో భూమిని కలిగి ఉన్న రైతులుగా ఉన్నారు. అన్ని ఖరియా వారి సాంప్రదాయ మాండలికాన్ని మాట్లాడుతుంది. వారు మాట్లాడే భాష ఆండ్రోసియాటికు భాషలలో భాగమైన ముండా భాషలలో ఒక భాగం వారికి వాడుకభాషగా ఉంది. వారు తెగ స్వభావానికి చాలా దగ్గరగా ఉన్నారు. వారి సంస్కృతి దాని పొరుగు సంస్కృతులు, పర్యావరణంతో ప్రభావితమవుతుంది.

                                     

4.2. సంస్కృతి దుస్తులు

కొండ ఖరియా వారి సాంప్రదాయ దుస్తుల నమూనాను సంరక్షించింది. మిగిలిన ఖరియా ప్రజలను ఆధునిక సంప్రదాయ పరిచయాలు ప్రభావితం చేసారు. వారి వస్త్రధారణ శైలిని మార్చింది. సాంప్రదాయకంగా వారు భగవాను అని పిలువబడే ధోతిని ధరిస్తారు. మహిళలు చీలమండల వరకు పడే చీర ధరిస్తారు. చీరలో ఒక భాగం వారి చాతిభాగాన్ని కప్పివేస్తుంది. సాంప్రదాయ దుస్తులు ఈ రోజులలో వాడుకలో లేవు. పురుషులు, మహిళలు ఇద్దరూ సాధారణంగా ఇత్తడి, నికెలు, అల్యూమినియం, వెండి, అరుదుగా బంగారంతో చేసిన ఆభరణాలను ధరిస్తారు. దుధ్ ఖరియా మహిళలు బంగారు ఆభరణాలను ఇష్టపడతారు.

                                     

4.3. సంస్కృతి ఆర్ధికం

ఖరియా మధ్య సెక్షనలు ప్రాతిపదికన వివిధ స్థాయిల ఆర్థిక పరిణామాలు ఉన్నాయి. కొండ ఖరియా ఆహార సేకరణ, వేట, కార్మికుల సంఘం ఆధారిత ఆర్ధిక విధానం అనుసరిస్తున్నారు. ధెల్కిలు వ్యవసాయ కూలీలు, వ్యవసాయదారులు, దుధ్ ఖరియా ప్రాధమిక ఆర్థిక వ్యవస్థ వ్యవసాయం.

ఖరియా ప్రజలు కుటీర పరిశ్రమలలో నైపుణ్యం కలిగి ఉన్నారు.

                                     

4.4. సంస్కృతి నృత్యాలు

ఖరీయా గొప్ప నృత్యకారులుగా పసిద్ధిచెందారు. యువతీ యువకులు కలిసి నృత్యం చేస్తారు. కొన్నిసార్లు వారు మగ, ఆడవారిలో రెండు సమూహాలను ఏర్పరుస్తారు. ఒకదాని తరువాత ఒకటి పాడతారు. ఇది పాట రూపంలో బాలురు, బాలికల మధ్య మార్పిడి జరుగుతోంది. ఈ క్రింది నృత్య నమూనాలు ఖరీయాలు- హరియో, కిన్భారు, హల్కా, కుడింగు, జాధురాలలో ప్రబలంగా ఉన్నాయి.

                                     

5. అద్నపు అధ్యయనాలు

  • Dash, J. 1998. Human ecology of foragers: a study of the Kharia Savara, Ujia Savara, and Birhor in Similipāl hills. New Delhi: Commonwealth. ISBN 81-7169-551-5
  • Sinha, D. 1984. The hill Kharia of Purulia: a study on the impact of poverty on a hunting and gathering tribe. Calcutta: Anthropological Survey of India, Govt. of India.
  • Mukhopadhyay, C. 1998. Kharia: the victim of social stigma. Calcutta: K.P. Bagchi & Co. ISBN 81-7074-203-X
  • Sinha, A. P. 1989. Religious life in tribal India: a case-study of Dudh Kharia. New Delhi: Classical Pub. Co. ISBN 81-7054-079-8
  • Doongdoong, A. 1981. The Kherias of Chotanagpur: a source book.
  • Banerjee, G. C. 1982. Introduction to the Khariā language. New Delhi: Bahri Publications.
Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →