Back

ⓘ త్రిపురనేని గోపీచంద్                                               

త్రిపురనేని కమల్

తెలుగు సాహితీ వేత్త అయిన త్రిపురనేని గోపీచంద్ మనవడే ఈ కమల్. తాత సాహితీ పరిశోధకుడుగా పేరొందితే మనవడు అంతరిక్ష పరిశోధకుడుగా సరికొత్త ప్రయోగాలకు శ్రీకారం చుడుతున్నాడు. ఆయన హైదరాబాదులో 1981 జనవరి 5 న జన్మించారు. బ్రిటన్ లోని మిడ్ వేల్స్ స్కూల్ లో ఉన్నత విద్యాభ్యాసం చేసారు. లండన్ విశ్వవిద్యాలయం లో మాస్టర్స్ డిగ్రీ చేసారు. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంకు చెందిన ప్రొఫెసర్ పర్యవేక్షణలో మెటీరియల్స్ కెమిస్ట్రీ గ్రూపులో పి.హెచ్.డి చేసారు.

                                               

త్రిపురనేని సాయిచంద్

త్రిపురనేని సాయిచంద్ తెలుగు చలనచిత్ర నటుడు, డాక్యుమెంటరీ సినిమాల రూపకర్త. రచయిత త్రిపురనేని గోపిచంద్ కుమారుడు. సంఘసంస్కర్త, హేతువాది అయిన కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరికి మనుమడు. తెలంగాణ సాయుధ పోరాట నేపథ్యంలో ప్రసిద్ధ దర్శకుడు గౌతమ్ ఘోష్ దర్శకత్వంలో వచ్చిన మాభూమి చిత్రంతో తెలుగు చలనచిత్రరంగంలో నటుడిగా ప్రవేశించాడు. ఆ చిత్రంలో కథానాయకుడు రామయ్య పాత్రలో మరుపురాని నటనను కనబరిచాడు. ఆ తర్వాత శివ, అంకురం మొదలగు తెలుగు సినిమాల్లో నటించాడు. శివ చిత్రంలో నటి అమలకు అన్నయ్యగా నటించాడు. నటనకు దూరమై మైత్రి కమ్యూనికేషన్స్ స్థాపించి కొన్నాళ్ళపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సందేశాత్మక డాక్యుమెంటరీల ...

                                               

ప్రియురాలు

మేకప్: మంగయ్య, భద్రయ్య ఎడిటింగ్: జి.డి.జోషి నృత్యం: హీరాలాల్ నేపథ్య గాయకులు: ఘంటసాల వేంకటేశ్వరరావు,రావు బాలసరస్వతి, జిక్కి,టి.జి.కమలాదేవి, మాధవపెద్ది సత్యం, వి.జె.వర్మ కళ: టి.వి.యస్.శర్మ శబ్ద గ్రహణం: రంగస్వామి పాటలు: అనిసెట్టి సుబ్బారావు రచన: త్రిపురనేని గోపీచంద్ సంగీతం: సాలూరు రాజేశ్వరరావు, అద్దేపల్లి రామారావు దర్శకత్వం: త్రిపురనేని గోపీచంద్

                                               

అసమర్థుని జీవయాత్ర

ప్రముఖ తెలుగు నవలా రచయిత త్రిపురనేని గోపీచంద్ కి నవలా సాహిత్యంలో సుస్థిర స్థానాన్ని సాధించి పెట్టిన అసమర్థుని జీవయాత్ర తెలుగులో మెట్టమొదటి మనో వైజ్ఞానిక నవల. ఈ నవల 1945-46లో రాశారు. ఆంధ్రప్రభ దినపత్రిక ఆదివారపు సాహిత్యానుబంధాలలో సీరియల్‌ నవలగా వెలువడింది. 1947లో రచించబడిన ఈ నవలను సాహితీ విమర్శకుడు డి.ఎస్.రావు ఆంగ్లములో ది బంగ్లర్ - ఎ జర్నీ త్రూ ద లైఫ్ The Bungler - A Journey Through Life గా అనువదించాడు.

                                               

పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా

కథానాయకుడు కేశవ మూర్తి అభ్యుదయ భావాలు గల రచయిత. ఆయన భార్య సుజాత. వారిది అన్యోన్య దాంపత్యం. విలువలు కలిగిన జీవితం గడుపుతూ ఉంటారు. సుజాత పసిపిల్లగా ఉన్నప్పుడు ఎవరో ఆమెను ఒక పాఠశాలలో వదిలేసి వెళతారు. ఆ బడిలో పనిచేసే నరసయ్య తీసుకుని వెళ్ళి కొద్ది రోజులు పెంచుతాడు. ఆ తరువాత పండిత పరమేశ్వర శాస్త్రి పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో ఆమెను చూసి పెంచుకుంటానంటాడు. అప్పటి నుంచీ ఆమె పరమేశ్వర శాస్త్రి దగ్గరే పెరుగుతుంది. ఆయన పెంపకంలో రకరకాల సాహిత్యం అభ్యసిస్తుంది. ఆమె కోరిక మేరకు పాఠశాలకు పంపించి ఆంగ్ల విద్య కూడా నేర్పిస్తాడు. ఒకానొక సందర్భంలో కేశవమూర్తి ఆమెను చూసి ప్రేమిస్తాడు. అది పరమేశ్వర శాస్త్రికి నచ్చ ...

                                               

లేఖా సాహిత్యం

బెంగాలీ రచయిత శరత్ చంధ్ర చటర్జీ లేఖల్ని తెలుగులోకి అనువదించినది పురాణరాఘవ శాస్త్రీ. గీరతం రచయితలు తిరుపతి వేంకటకవులు. పోస్ట్ చేయని ఉత్తరాలు, ఉభయకుశలోపరిలను రచించినవారు త్రిపురనేని గోపీచంద్. సాహిత్య సంస్కృతికపరమైన గౌరవాన్ని కలిగిన లేఖల్ని లేఖా సాహిత్యంగా చెపుతారు. గుడిపాటి వెంకటాచలం ఉత్తరాల పేర్లు ప్రేమలేఖలు. తెలుగులో లేఖల్ని స్వీకరించిన మొదటి వ్యక్తి చార్లెస్ పిలిప్ బ్రౌన్. లేఖలకు సంబంధించి భారతీయ సాహిత్యంలో మొట్టమొదటి ప్రస్తావన "అభిజ్ఞానశాకుంతలం"లో ఉంది. తెలుగులో లేఖా సాహిత్యంపై పి.హెచ్.డి చేసినవారు 1.మలయశ్రీ 2.సి.హెచ్.సీతాలక్ష్మీ. పోస్ట్ మ్యాన్ మీద కవితలు రాసినవారు తిలక్. నెహ్రూ లేఖల్నిత ...

                                               

త్రిపురనేని శ్రీనివాస్

అతను అజంత కలం పేరుతో సుపరిచితుడైన పీ వీ శాస్త్రి గారి కవితా సంకలనాన్ని 1993 లో "స్వప్నలిపి" అనే పుస్తకంగా కవిత్వం ప్రచురణల ద్వారా వెలుగులోకి తెచ్చాడు. ఈ కవితా సంకలనం 1997 లో సాహిత్యఅకాడమీ కవిత్వ పురస్కారం అందుకుంది. అతను ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధం ఇన్‌ఛార్జిగా కూడా పనిచేసాడు. అస్తిత్వవాద ఉద్యమాల పొద్దు పొడుపు కాలంలో ఆయన ఒక పాత్రికేయుడిగా ఎనలేని మేలు చేశాడు. దళిత, మైనారిటీ వాదాల సాహిత్య ప్రక్రియలకి పత్రికలో అత్యధిక పాధాన్యం కల్పించాడు. శ్రీనివాస్‌ కేవలం కవి మాత్రమే కాదు క్రాంతదర్శి, తిరుగుబాటుదారు కనుకనే అది సాధ్యమయింది. అతను కవిత్వమొక తీరని దాహమన్న వాక్యానికి‌ నిలువెత్తు నిదర్శనంగా జీవించ ...

                                               

కిన్నెర మాసపత్రిక

కిన్నెర ఒక తెలుగు మాసపత్రిక. ఇది 1948 సంవత్సరం నవంబరు నెలలో ప్రారంభమైనది. మద్రాసు నుండి వెలువడింది. దీనికి వ్యవస్థాపక సంపాదకులుగా పందిరి మల్లికార్జునరావు పనిచేశారు.

                                               

సెప్టెంబర్ 8

1986: పారుపల్లి కశ్యప్, భారతదేశ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు. 1879: మొక్కపాటి సుబ్బారాయుడు, పరిపాలనా దక్షుడు, పండితుడు. మ.1918 1975: స్వర్ణలతా నాయుడు, తెలుగు కవయిత్రి. మ.2016 1862: వేంకట శ్వేతాచలపతి రంగారావు, బొబ్బిలి జమీందారీకి రాజు మ1921. 1933: ఆశా భోస్లే, హిందీ సినిమా గాయని. 1933: కరుటూరి సూర్యారావు, గొప్ప వ్యవసాయ, వ్యాపార, పారిశ్రామికవేత్త. మ.2011 1936: చక్రవర్తి, సంగీత దర్శకుడు. మ.2002 1908: చెలికాని అన్నారావు, తిరుమల బాలాజీ సన్నిధిలో జీవితాన్ని చరితార్థం చేసుకున్న కార్యనిర్వహణాధికారి. 1951: మాధవపెద్ది సురేష్, తెలుగు సినీ సంగీత దర్శకుడు. 1931: తంగి సత్యనారాయణ, ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకరు. ...

                                               

1910

మే 19: నాథూరామ్ గాడ్సే, గాంధీని హత్య చేసిన వారిలో ప్రధాన పాత్రధారుడు. మ.1949 డిసెంబర్ 25: కల్లూరి తులశమ్మ, సంఘసేవకురాలు, ఖాదీ ఉద్యమ నాయకురాలు. మ.2001 సెప్టెంబర్ 8: త్రిపురనేని గోపీచంద్, సంపూర్ణ మానవతావాది, తెలుగు రచయిత, హేతువాది, సాహితీవేత్త, తెలుగు సినిమా దర్శకుడు. మ.1962 ఆగష్టు 26: మదర్ థెరీసా, రోమన్ కేథలిక్ సన్యాసిని, మానవతావాది, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత. మ.1997 జనవరి 27: విశ్వనాధ జగన్నాధ ఘనపాఠి, రాజమండ్రికి చెందిన వేద విద్వాంసుడు. ఏప్రిల్ 30: శ్రీశ్రీ, తెలుగు జాతి గర్వించే మహాకవి, ఇరవయ్యవ శతాబ్దపు తెలుగు సాహిత్యాన్ని శాసించిన మహాకవి. మ.1983 ఫిబ్రవరి 9: ఉమ్మెత్తల కేశవరావు, నిజాం విమోచ ...

త్రిపురనేని గోపీచంద్
                                     

ⓘ త్రిపురనేని గోపీచంద్

త్రిపురనేని గోపీచంద్ సంపూర్ణ మానవతావాది, తెలుగు రచయిత, హేతువాది, సాహితీవేత్త, తెలుగు సినిమా దర్శకుడు. ఈయన తండ్రి త్రిపురనేని రామస్వామి కూడా రచయిత. మొదట్లో తండ్రి నాస్తికవాదం ప్రభావం ఆయనపై పడింది. కానీ తర్వాతి కాలంలో అరబిందో ప్రభావంతో ఆస్తికుడిగా మారాడు. మొదట్లో కథా సాహిత్యంపై దృష్టి సారించిన ఆయన కొద్దికాలానికి నవలా రంగంవైపు కూడా మళ్ళారు. ఆయన రచనల్లో అసమర్ధుని జీవితయాత్ర, పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా మొదలైనవి పేరు గాంచాయి. చలనచిత్ర రంగంలో కూడా ప్రవేశించి కొన్ని సినిమాలకు రచయితగా పనిచేశాడు. దర్శక నిర్మాతగా కొన్ని చిత్రాలు నిర్మించాడు. చదువుకున్న అమ్మాయిలు, ధర్మదేవత, రైతుబిడ్డ మొదలైన చిత్రాలకు మాటలు రాశాడు. ప్రియురాలు, పేరంటాలు, లక్ష్మమ్మ మొదలైన చిత్రాలకు దర్శకత్వం వహించాడు. ఈయనకు ఐదుమంది సంతానం. ఈయన ఆఖరి కుమారుడు త్రిపురనేని సాయిచంద్ సినీ నటుడు, దర్శకుడు.

                                     

1. జననం

గోపీచంద్ 1910, సెప్టెంబర్ 8 న కృష్ణా జిల్లా అంగలూరు గ్రామములో జన్మించాడు. ఈయన తండ్రి త్రిపురనేని రామస్వామి సంఘసంస్కర్త. గోపీచంద్ తన జీవితంలో చాలా సంఘర్షణను అనుభవించాడు. అనేక వాదాలతో వివాదపడుతూ, తత్త్వాలతో దాగుడుమూతలాడుతూ, సంతృప్తిలోనూ అసంతృప్తిలోనూ ఆనందాన్నే అనుభవిస్తూ జీవయాత్ర కొనసాగించాడు. తన తండ్రినుంచి గోపీచంద్ పొందిన గొప్ప ఆయుధం, ఆస్తి, శక్తి ఎందుకు? అన్న ప్రశ్న. అది అతన్ని నిరంతరం పరిణామానికి గురిచేసిన శక్తి. అతనిలోని అరుదైన, అపురూపమైన, నిత్యనూతనమైన అన్వేషణాశీలతకి ఆధారం. ఎందుకు? అన్న ప్రశ్నే అతన్ని ఒక జిజ్ఞాసువుగా, తత్వవేత్తగా నిలబెట్టింది. ఈ క్రమంలో అతనిలో చెలరేగిన సంఘర్షణ అతని నవలలన్నింటిలోనూ ప్రతిఫలించింది.

గోపీచంద్ రచనలలో విలువల మధ్య పోరాటం ముఖ్యముగా చెప్పుకోతగినది. ఆయన వ్రాసిన అసమర్థుని జీవయాత్ర తెలుగులో మొదటి మనో వైజ్ఞానిక నవల. 1963లో పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా కు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది.

                                     

2. జీవిత క్రమం

 • హేతువాద నాస్తికత్వపు భావజాలాల వాతావరణంలో పెరిగిన గోపీచంద్ పై వాటి ప్రభావం సహజంగానే పడింది. అయితే తరువాతి కాలంలో ఆయన ఆస్తికుడిగా మారాడు.
 • 1939లో చలనచిత్ర రంగంలోకి ప్రవేశించిన గోపీచంద్ దర్శకనిర్మాతగా కొన్ని చిత్రాలను నిర్మించాడు. అయితే వాటివల్ల ఆర్థికంగా చాలా నష్టపోయారు.
 • 1932 లో వివాహం; 1933లో బి.ఎ పట్టా, ఆ తర్వాత లా డిగ్రీ. కొంతకాలం పాటు న్యాయవాదిగా ప్రాక్టీసు పెట్టినా ఆ వృత్తిలో ఇమడలేక పోయాడు. ఈ దశలో ఆయన కమ్యూనిజం మార్క్సిజం పట్ల ఆకర్షితుడయ్యాడు. కానీ అందులోని అరాచకత్వం ఆయనకు నచ్చలేదు.
 • 1957-62 వరకు ఆకాశవాణిలో పనిచేసాడు. ఈ దశలో అరవిందుని భావాల పట్ల విశ్వాసం ఏర్పడడంతో ఆధ్యాత్మికవాదం వైపుకి పయనించాడు.
 • 1928లోనే శంబుక వధ కథ ద్వారా సాహిత్యరంగంలోకి ప్రవేశించిన గోపీచంద్ 1938లో పట్టాభి గారి సోషలిజం అన్న పుస్తకాన్ని వెలువరించాడు.
 • 1962 నవంబర్ 2 నాడు గోపీచంద్ మరణించాడు.
 • 8-సెప్టెంబర్-1910 నాడు గోపీచంద్ జన్మించాడు. సుప్రసిద్ధ రచయిత, హేతువాది, సంస్కరణవాది అయిన త్రిపురనేని రామస్వామి ఆయన తండ్రి, తల్లి పున్నమాంబ.
 • ఆ తర్వాత ఎం.ఎన్.రాయ్ మానవతావాదం ఆయన పై గొప్ప ప్రభావాన్ని చూపింది. ఈ కాలంలో ఆయన ఆంధ్రా రాడికల్ డెమొక్రటిక్ పార్టీ కార్యదర్శిగా పనిచేసాడు.
 • 1953లో ఆంధ్రరాష్ట్ర సమాచార శాఖ డైరెక్టర్ గా, 1956లో ఆంధ్ర ప్రదేశ్ సమాచార శాఖ సహాయ డైరెక్టర్ గా పనిచేసాడు.
 • భారత ప్రభుత్వము 2011 సెప్టెంబరు 8న గోపీచంద్ శతజయంతి సందర్భమున తపాలా బిళ్ళ విడుదల చేసింది.
 • తొలుత కథా సాహిత్యంలో స్థిరపడ్డ గోపీచంద్ ఆ తర్వాత నవలా సాహిత్యరంగంలోకి అడుగుపెట్టాడు. ఆయన తొలి నవల పరివర్తనం 1943.

గోపీచంద్ చిన్నతనములోనే తల్లిని పోగొట్టుకున్నాడు. ఇంటి పనులతోపాటు, తండ్రి నాస్తికోద్యమము నకు సహాయము చేయటం లాంటి పనులతో అతని బాల్యం చాలా గడచి పోయింది. అటు తర్వాత, మద్రాస్ లో లా చదువుకున్నాడు. అతని మీద చాలా కాలము ఆయన నాన్న ప్రభావం ఉండేది. ఆయన మొదట వ్రాసిన చాలా నవలలో మార్క్సిస్టు భావాలు మనకు పూర్తిగా కనిపిస్తాయి.

ఆయన వ్రాసిన "మెరుపుల మరకలు" అనే గ్రంథంలో గాంధీరామయ్య అనే ఒక పాత్ర ఉంది. ఆ పాత్ర శ్రీ ఉన్నవ లక్ష్మీనారాయణ పంతులును పోలి ఉంటుందన్నది కొందరి భావన. రామస్వామి, పంతులు మంచి స్నేహితులు. రెండు భిన్న ధ్రువాలు. ఒకరు కరుడుగట్టిన నాస్తిక వాది, మరి ఒకరు పూర్తి ఆస్తికులు. ఇద్దరూ గాంధేయవాదులు. రామస్వామికి యవ్వనంలోనే భార్య గతించింది. పునర్వివాహం చేసుకోలేదు. ఒక రోజు పంతులు రామస్వామిని కలవటానికి తెనాలి వెళ్ళాడు. స్నేహితులిద్దరికి గోపీచంద్ భోజనం వడ్డిస్తున్నాడు. ఆ సందర్భములో, పంతులు "ఏమయ్యా! రామస్వామి నీవు ఉద్యమాలలో పూర్తిగా మునిగి, కుమారుడి వివాహము సంగతే మర్చిపోయావు" అని అన్నాడు. అప్పుడు, రామస్వామి, నిజమే పంతులు గారు, ఆ విషయము పూర్తిగా మరచిపోయాను. మీరే ఏదైనా మంచి అమ్మాయిని చూసి వాడికి పెళ్ళి చెయ్యండి అని అన్నాడట. అప్పుడు. పంతులు, గోపీచంద్ తో, "నీవు మద్రాస్ వెళ్ళే లోపు ఒక పది రోజుల ముందు, గుంటూరు రా." అని అన్నాడు. గోపీచంద్, సరే అనటం, అలాగే గుంటూరుకు వెళ్ళటం జరిగింది.

ఆ రోజుల్లో గుంటూరులో "శారదా నికేతన్" అనే వితంతు శరణాలయం ఉండేది. ఇప్పుడు కూడా ఉంది. దాని నిర్వహణ బాధ్యత అంతా ఆ రోజుల్లో పంతులు గారే చూసుకునే వారు. ఆ రోజుల్లో అన్నీ బాల్యవివాహాలు కావటం చేత, వధూవరులకు వయోభేదం ఉండటం చేత అక్కడ ఉన్నవారిలో కూడా చాలామంది బాలవితంతువులే! గోపీచంద్ వచ్చి పంతులుని కలసి, ఎందుకు రమ్మన్నారో చెప్పమని అడిగారు. పంతులు ఏ విషయము చెప్పకుండా, నీకు నచ్చిన ఒక క్లాసుకు వెళ్లి ఒక పది రోజులు పాఠాలు చెప్పమన్నారు. ఆ వితంతు శరణాలయాన్ని పంతులు నడుపుతున్న తీరు, బాలవితంతుల దీన పరిస్థితి గోపీచంద్ పై తీవ్ర ప్రభావం చూపాయి. ఆయన రచనలలో కొన్నింటిలో వాటి ప్రభావం కనపడుతుంది. కాలక్రమంలో గోపీచంద్ మీద ఆయన నాన్న ప్రభావం తగ్గ నారంభించింది. స్వతంత్ర భావాలను పెంచుకున్నాడు. జీవితములో పెంచి పెద్ద చేసిన నాన్న కంటే పంతులు ప్రభావం అతని మీద చాలావరకు ఉంది. అందుకే, గాంధీరామయ్య పాత్ర సజీవంగా నిలిచిపోయింది.

గోపీచంద్ నెమ్మదిగా మార్క్సిస్టు సిద్ధాంతం నుండి బయటపడి, చివరి రోజులలో తత్వవేత్తలు అనే తాత్విక గ్రంథాన్ని వ్రాయటం జరిగింది. పోస్ట్ చెయ్యని ఉత్తరాలు, అసమర్ధుని జీవయాత్ర, మెరుపుల మరకలు - ఈ గ్రంథాలలో కూడా చాలావరకు తాత్విక చింతన కనపడుతుంది. ఆయనే, ఒక చోట ఇలా అంటాడు, "మానవులు జీవనదుల లాగా ఉండాలి కానీ, చైతన్యంలేని చెట్లు, పర్వతాల లాగా ఉండకూడదు". మానవ జీవితం ఒక చైతన్య స్రవంతి. ఎన్నో మలుపులు తిరుగుంది. అలాగే మనం కూడా నిరంతర అన్వేషణలో ఉండాలి. అప్పుడే మనకు సత్యమంటే ఏమిటో తెలుస్తుంది. నిన్న మనం నమ్మింది ఈ రోజు సత్యం కాదని తెలిసిన వెంటనే దాన్నివదలి మళ్ళీ అన్వేషణ సాగించాలి. ఇదే విషయాన్ని జిడ్డు కృష్ణమూర్తి, చలం కూడా చెప్పారు. జీవితం అంటే నిరంతర అన్వేషణ. ఒక పుస్తకాన్ని ఆయన తండ్రిగారికి అంకితం ఇస్తూ- ఎందుకు అని అడగటం నేర్పిన నాన్నకి అని వ్రాసాడు. అలా నేర్చుకోబట్టే స్వతంత్ర భావాలు గల ఒక గొప్ప రచయిత స్థాయికి ఎదిగాడు.

                                     

3. రచనలు

నవలలు

 • శిధిలాలయం
 • చీకటి గదులు
 • ప్రేమోపహతులు
 • పరివర్తన
 • యమపాశం
 • గడియపడని తలుపులు
 • పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా
 • అసమర్థుని జీవయాత్ర

వాస్తవిక రచనలు

 • తత్వవేత్తలు
 • మాకూ ఉన్నాయి సొగతాలు
 • పోస్టు చేయని ఉత్తరాలు
                                     

4. తెలుగు సినిమాలు

 • రైతుబిడ్డ 1939 మాటల రచయిత
 • లక్ష్మమ్మ 1950 దర్శకుడు
 • ప్రియురాలు 1952
 • చదువుకున్న అమ్మాయిలు 1963 మాటల రచయిత
 • పేరంటాలు 1951 దర్శకుడు
 • ధర్మదేవత 1952 మాటల రచయిత
 • గృహప్రవేశం 1946 కథా రచయిత
                                     

5. బయటి లింకులు

 • ఒక అడుగు ముందుకీ…రెండడుగులు వెనక్కీ…గోపీచంద్!, నరిశెట్టి ఇన్నయ్య, సారంగ ఈ పత్రిక 2013-05-15
 • త్రిపురనేని వెబ్‌సైటు
 • గోపీచంద్ రచించిన కథలు - ధర్మవడ్డీ, ఆమె వ్యక్తిత్వం ఆంగ్లానువాదం, పనిపిల్ల ఆంగ్లానువాదం
 • ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో త్రిపురనేని గోపీచంద్ పేజీ
                                               

గోపీచంద్

పుల్లెల గోపీచంద్ - బాడ్మెంటెన్ ఆటగాడు త్రిపురనేని గోపీచంద్ - తెలుగు రచయిత, సాహితీవేత్త, తెలుగు సినిమా దర్శకుడు గోపీచంద్ మలినేని - తెలుగు సినిమా దర్శకుడు తొట్టెంపూడి గోపీచంద్ - తెలుగు సినిమా నటుడు గోపీచంద్ భార్గవ, పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి. గోపీచంద్ నారంగ్ - ఉర్దూ భాషా రచయిత.

                                               

త్రిపురనేని

త్రిపురనేని తెలుగు సమాజంలో ఒక ఇంటిపేరు. ఈ ఇంటి పేరుగల కొందరు ప్రసిద్ధ వ్యక్తులు వివరాలు ఇక్కడ తెలుసుకోవచ్చును. త్రిపురనేని హనుమాన్ చౌదరి - టెలీకం పరిశ్రమలో భీష్మ పితామహులు త్రిపురనేని శ్రీనివాస్ -కవి త్రిపురనేని కమల్ - శాస్త్రవేత్త త్రిపురనేని గోపీచంద్ - తెలుగు రచయిత, హేతువాది త్రిపురనేని మహారధి - తెలుగు సినిమా మాటల రచయిత త్రిపురనేని మధుసూదనరావు - నటుడు, రచయిత, "అరసం" కార్యకర్త తిరుపతి మావో త్రిపురనేని రామస్వామి - తెలుగు కవి, హేతువాది, సంఘసంస్కర్త

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →