Back

ⓘ సురభి నాటక సమాజం                                               

సురభి జమునా రాయలు

జమునా రాయలు రంగస్థల నటి కళాకారిణి. సురభి నాటక సమాజం ప్రదర్శించిన అనేక నాటకాల్లో, ఇతర నాటక సమాజాల నాటకాల్లో నటించింది. టీవీ, సినిమాల్లో కూడా నటించింది.

                                               

సురభి (చక్రాయపేట మండలం)

సురభి, వైఎస్‌ఆర్ జిల్లా, చక్రాయపేట మండలానికి చెందిన గ్రామం.సురభి నాటక సమాజం ఈ ఊరిలోనే స్థాపించబడింది. ఈ ఊరి పేరువలనే ఆ సమాజానికి ఆ పేరు ఏర్పడింది. ఇది మండల కేంద్రమైన చక్రాయపేట నుండి 7 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన కడప నుండి 65 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1462 ఇళ్లతో, 5610 జనాభాతో 3427 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 2829, ఆడవారి సంఖ్య 2781. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 498 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 22. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 593476.పిన్ కోడ్: 516259.

                                               

తూము రామదాసు

తూము రామదాసు తెలంగాణ తొలి నాటక రచయిత. 1897లో ‘కాళిదాసు’ నాటకాన్ని రచించి సురభి నాటక సమాజం ద్వారా ప్రదర్శింపచేసి తెలంగాణలో తొలి నాటక చరిత్రను లిఖితం చేశాడు.

                                               

నాటక సంస్థలు

తెలుగు నాటకరంగం ప్రారంభం నుండి ఇప్పటివరకు ఎన్నో నాటక సంస్థలు వచ్చాయి. ఇంకా వస్తూనే ఉన్నాయి. వీటిలో కొన్ని ఆదరణ లేకనో, ఆర్థిక భారం వల్లనో కనుమరుగయ్యాయి. కొన్ని మాత్రం ప్రభుత్వం, ప్రైవేటు సంస్థలనుండి ఆర్థిక సహాయం పొందుతూ నడుస్తున్నాయి. తెలంగాణా ప్రాంతంలో అంతగా ప్రాచుర్యం లేని తెలుగు పౌరాణిక పద్యనాటకాలకు గుర్తింపు తీసుకొనిరావాలనే ఉద్దేశంతో తెలుగు పద్యాన్ని బ్రతికించండి - పద్యనాటక మనుగడకు సహకరించండి అనే నినాదంతో 1998వ సం.లో వరంగల్ నగరంలో ఈ సంస్థ పందిళ్ళ శేఖర్ బాబు చే స్థాపించబడింది. రిజిష్టర్ నెం.2312/2000.ఈ సంస్థ కొన్ని ముఖ్య కార్యక్రమాలు చేపట్టింది.

                                               

పాతాళ భైరవి (నాటకం)

ఉజ్జయిని నగర మహారాజు కుమార్తె ఇందుమతిని, ఉద్యానవన తోటమాలి శాంతమ్మ కొడుకు తోటరాముడు ప్రేమిస్తాడు. మహారాజు తోటరాముని బంధిస్తాడు. కుమార్తె ఇందుమతి విడిచి పెట్టమని కోరగా, తన స్థాయికి తగిన వాడుగా ధనవంతుడవై వస్తే వివాహం చేస్తానని షరత్తు విధిస్తాడు. సమస్త భూమండల సార్వభౌమత్వం కోసం క్షుద్రశక్తులను ఆశ్రయించిన నేపాళ మాంత్రికుడు, తారసిల్లిడం, తోటరాముడు, మాంత్రికుని మోసబుద్ధిని తెలుసుకొని యక్షిణ చెప్పిన ఉపాయం ప్రకారం మాంత్రికుని బలి ఇచ్చి పాతాళభైరవి అనుగ్రహంతో రాజ్యానికి చేరుకుని మహారాజుకు కనిపిస్తాడు. తన కుమార్తెను తోటరామునికిచ్చి వివాహం చేయడానికి అంగీకరిస్తాడు. రాజకుమారిని వివాహం చేసుకున్న తోటరాముడు ...

                                               

మొలుగు బంగ్లా హనుమంతరావు

మొలుగు బంగ్లా హనుమంతరావు తెలంగాణ తొలితరం నాటకకర్త. తెలంగాణలో తొలిసారిగా 1939లో సురభి నాటక సమాజంను వేలూరు గ్రామానికి రప్పించి ప్రదర్శనలు ఇప్పించాడు.

                                               

ఆవేటి నాగేశ్వరరావు

ఆవేటి నాగేశ్వరరావు రంగస్థల నటుడు, దర్శకుడు, ఆంధ్ర ప్రదేశ్ సంగీత నాటక అకాడమీ సభ్యుడు, వదాన్యుడు, నటరాజేంద్ర, నాట్య కళాధురీణ బిరుదాంకితుడు.

                                               

మాయాబజార్ (నాటకం)

మల్లాది వెంకట కృష్ణ శర్మ రచించిన నాటకం మాయాబజార్. సురభి బాబ్జీ దర్శకత్వం వహించారు. శశిరేఖా పరిణయం నేపథ్యంగా సాగే ఈ కథ ఆద్యంతం ఆహ్లాదంగా సాగుతుంది. సురభి నాటక సమాజం లోని శ్రీ వెంకటేశ్వర నాట్య మండలి ద్వారా ఈ నాటర ప్రదర్శన జరుగుతుంది.

                                               

కొండపేట కమాల్

కొండపేట కమాల్ రంగస్థల నటుడు. ఇతడు వైఎస్ఆర్ జిల్లా కొండపేట వాస్తవ్యుడు. చిన్నతనంలో తురిమెల్ల నాటక కంపెనీలో చేరి కృష్ణుడు, కనకసేనుడు, ప్రహ్లాదుడు మొదలైన పాత్రలను ధరించాడు. ఇతడు డి.వి.నరసింహారావు శిక్షణలో సత్యభామ పాత్రకు కొత్తగా రూపురేఖలు దిద్దుకున్నాడు. ఇతడు "రాయలసీమ స్థానం" అనే బిరుదు గడించాడు. తాడిపత్రిలో స్థానం నరసింహారావు ఎదుట సత్యభామ వేషాన్ని ధరించి అతడి ప్రశంసలను అందుకున్నాడు. ఇంకా ఇతడు చిత్రాంగి, చింతామణి పాత్రలలో రాణించాడు. పద్యం చదవడంలో భావం వ్యక్తం చేయడంలో మంది గుర్తింపు పొందాడు.

సురభి నాటక సమాజం
                                     

ⓘ సురభి నాటక సమాజం

ప్రపంచ ప్రఖ్యాత సురభి నాటక సమాజం 1885లో వైఎస్ఆర్ జిల్లా సురభి గ్రామంలో కీచక వధనాటక ప్రదర్శనతో మొదలయ్యింది. ఈ సమాజ వ్యవస్థాపకుడు వనారస గోవిందరావు.

1885లో వనారస సోదరులు వనారస గోవిందరావు, వనారస చిన్నరామయ్య కలిసి వైఎస్ఆర్ జిల్లా చక్రాయపేట మండలములోని సురభి రెడ్డివారిపల్లెలో శ్రీ శారదా వినోదిని నాటక సభను ప్రారంభించారు. సురభిలో ప్రారంభమైన ఈ నాటక సభ కాలక్రమేణ సురభి నాటక సంఘముగా ప్రసిద్ధి చెందినది. రంగస్థలముపై స్త్రీ పాత్రలను స్త్రీలచే ధరింపచేసిన తొలి నాటక బృందము సురభినే. నాటకములోని పాత్రధారులందరూ ఒకే కుటుంబములోని సభ్యులవడము చేత స్త్రీలకు చెడ్డపేరు వస్తుందనే భయము ఉండేది కాదు. బృందములోని సభ్యులకు రంగస్థలమే జీవితముగా సాగేది.

స్థాపించిన కొద్దిరోజులలోనే ఈ సమాజము త్వరితగతిన విస్తరించి 50 వేర్వేరు బృందములుగా వృద్ధిచెందినది. ప్రతి బృందము దాదాపు 30 మందికి పైగా సభ్యులతో స్వయము సమృద్ధిగా ఉండేవి. వనారస గోవింద రావుకు ముగ్గురు కుమారులు పదిమంది కుమార్తెలు. వీరి కుటుంబము వ్యాపించిన కొలది బృందములు కూడా వ్యాపించినవి. సినిమా, టీవీల ఆగమనముతో 1974 కల్లా బృందముల సంఖ్య 16కు క్షీణించింది. 1982 నాటికి కేవలము నాలుగు సురభి నాటక బృందాలు మాత్రమే మనుగడలో ఉన్నాయి. ప్రస్తుతము ఆంధ్ర దేశములో సురభి నాటక కళాసంఘము ఆధ్వర్యములో ఐదు నాటక బృందములు పనిచేస్తున్నవి.

వీరి నాటకాలలో అత్యంత ప్రజాదరణ పొందిన నాటకం మాయాబజార్. ఆభిమన్యుడు, శశిరేఖ వివాహానికి ఘటోత్కచుడు అనే రాక్షసుడు భీమ, హిడింబ కుమారుడు తన మాయాజాలంతో జరిగేటట్లు చేయడం ప్రేక్షకులని కడుపుబ్బ నవ్విస్తుంది. కళాకారులు పెద్దగా చదువుకోకపోయిన, సినిమాలో లాగా, సెట్టింగులతో యుధ్ధం జరిగినపుడు, మంటలు సృష్టించటం ఆతరువాత వాన కురిపించడం, అలాగే ఒకే సమయంలో రంగస్థలంపై, అభిమన్యుడు, శశిరేఖ వేరు వేరు సెట్టింగులలో విరహ గీతం పాడటం చాలా ఆకర్షణగా వుంటుంది.

ఇలాంటి నాటక సమాజం ప్రపంచంలో ఇంకెక్కడా లేదు. తొలితెలుగు సినీనటీమణి సురభి కమలాబాయి సురభి కళాకారుల కుటుంబములో పుట్టి పెరిగినదే.

                                     

1.1. సురభి నాటక సమాజాలు శ్రీ వెంకటేశ్వర నాట్య మండలి

సురభి నాటక సమాజాలన్నింటికంటే పెద్దదైన శ్రీ వెంకటేశ్వర నాట్య మండలి 1937లో వనారస గోవిందరావు ఐదవ కూతురు సుభద్రమ్మ, ఆమె భర్త ఆర్. వెంకట్రావు చే స్థాపించబడింది. ప్రస్తుతము ఆ బృందములో వీరి కుమారులు భోజరాజు, సురభి బాబ్జీ నాగేశ్వరరావు, గణపతిరావులు, వారి కుటుంబములు అంతా కలిపి 62 మంది సభ్యులు కలరు. ఇది ఇప్పటికీ ప్రేక్షకులను రంజింప చేస్తుంది. 60మంది సురభి కళాకారులతో ప్రతి శుక్ర, శని, ఆదివారాలలో హైదరాబాద్‌ పబ్లిక్‌ గార్డెన్స్‌లో నాలుకాలను ప్రదర్శిస్తూనే ఉంది. పబ్లిక్‌ గార్డెన్స్‌లో ప్రభుత్వం వీరికి కొంత స్థలం కేటాయించింది. అందులోనే రేకులతో షెడ్లు వేసుకుని జీవిస్తున్నారు.

శ్రీ వెంకటేశ్శర నాట్య మండలి సురభి కార్యదర్శి ఆర్‌. నాగేశ్వరరావు బాబ్జి. నాగేశ్వరరావుకు కేంద్ర సంగీత నాటక అకాడమీ జాతీయ స్థాయిలో ధియేటర్‌ సంబంధంగా 2011కు అవార్డు ప్రకటించింది. 30 సంవత్సరాల తర్వాత నాటక రంగానికి దక్కిన తొలి జాతీయ గుర్తింపు ఇదే.

ఫ్రాన్స్‌లో 2013 మే 4 వ తేదీ నుంచి 18 వరకు జరిగిన అంతర్జాతీయ ఉత్సవాలలో 44 మందితో కూడిన శ్రీవెంకటేశ్వర నాట్య మండలి మాయాబజార్, భక్తప్రహ్లాద, శ్రీకృష్ణలీలలు, పాతాళ భైరవి నాటక ప్రదర్శనలు ఇచ్చింది. తెలుగులో ప్రదర్శించనున్న ఈ నాటకాన్ని ముందుగా ఇంగ్లీస్‌లోకి, ఆ తర్వాత ఫ్రెంచ్‌లోకి తర్జుమా చేసి డిస్‌ప్లేల ద్వారా చదువుకునే వీలు కల్పించారు. ఫ్రాన్స్‌లో 35 రోజుల పాటు ఈ బృందం మొత్తం 18 నాటకాలను ప్రదర్శించారు.

                                     

2. సప్తతి స్వర్ణోత్సవం

సురభి నాటక సమాజం సుప్రసిద్ధి పొంది, తరతరాలుగా కొనసాగుతున్న కుటుంబ నాటక సంస్థ. ఈ సంస్థలో కుటుంబసభ్యులందరూ విధిగా నాటక ప్రదర్శన, రంగాలంకరణ, దర్శకత్వం మొదలైన కళలలో అరితేరి ప్రదర్శనలు ఇస్తూంటారు. వారు తరతరాలుగా కుటుంబంబంతా నాటకాలనే వృత్తిగా చేసుకున్నారు. భార్యా భర్తలిద్దరూ నాటకాల్లో ప్రదర్శనలు చేయడం వల్ల స్త్రీలతో ప్రదర్శనలు ఇప్పించిన తొలితరం నాటి నాటక సంస్థగా పేరొందింది. సురభి నాటక సమాజం 18వ శతాబ్ది చివరి దశకాల్లో వైఎస్ఆర్ జిల్లా సురభి గ్రామంలో కీచక వధనాటక ప్రదర్శనతో మొదలయ్యింది. ఈ సమాజ వ్యవస్థాపకుడు వనారస గోవిందరావు. సురభి రెడ్డి వారి పల్లెలో ప్రారంభమైన ఈ నాటక సంస్థ సురభి నాటక సంస్థగా పేరొందింది. ఆ సంస్థ 70 ఏళ్ళు నిండిన సందర్భంగా చేసిన ఉత్సవాలలో సంస్థకు, నాటకాలకు సంబంధించిన వివిధ విషయాలతో రూపొందించిన సావనీర్ ఇది.

                                     

3. బయటి లింకులు

  • 10టివి వెబ్ లో వ్యాసం
  • కడప.ఇన్ఫోలో సురభి నాటక సమాజం పై వ్యాసము
  • ది హిందూ, బెంగుళూరు,నవంబరు,21, 2008 లో సురభి పై వ్యాసం ఇంగ్లీషులో
  • ఇండియా పర్స్పెక్టివ్ ఆగష్టు 2001 సంచికలో సురభి కళాకారుల పై వ్యాసము
  • డెక్కన్ హెరాల్డ్ లో సురభి పై వ్యాసము
                                               

సురభి

సురభి పేరుతో అనేక విషయాలు ఉన్నాయి. సురభి కమలాబాయి సురభి బాబ్జీ సురభి నాటక సమాజం సురభి బాలసరస్వతి సురభి పెద్ద బాలశిక్ష సురభి నటి సాహిత్య సురభి సురభి చక్రాయపేట మండలం, వైఎస్ఆర్ జిల్లా గ్రామం

                                               

వనారస

వనారస సోదరులు: వనారస గోవిందరావు, వనారస చిన్నరామయ్య కలిసి వైఎస్ఆర్ జిల్లా చక్రాయపేట మండలములోని సురభి రెడ్డివారిపల్లెలో సురభి నాటక సమాజం స్థాపించారు. వనారస కమలమ్మ

                                               

గోవిందరావు

జ్యోతీరావ్ ఫులే లేదా జ్యోతీబా గోవిందరావ్ ఫులే, మహారాష్ట్రకు చెందిన సంఘ సంస్కర్త. వనారస గోవిందరావు, సురభి నాటక సమాజం ఈ సమాజ వ్యవస్థాపకుడు. గోవిందరావుపేట, వరంగల్ జిల్లాకు చెందిన ఒక మండలం.

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →