Back

ⓘ ప్రకృతి - వికృతి                                               

తెలుగు వ్యాకరణం

తెలుగు వ్యాకరణము పై సిద్ధాంత గ్రంథము నన్నయ్య సంస్కృతంలో ఆంధ్రశబ్దచింతామణి అనే పేరుతో వ్రాశారు. ఆ తరువాత అధర్వణ, ఆహోబల సూత్రాలు, వార్తికాలు, భాష్యాలు వ్రాశారు.19వ శతాబ్దంలో చిన్నయసూరి సులభమైన తెలుగు వ్యాకరణంను బాలవ్యాకరణం అనే పేరుతో రాశారు. నన్నయ ప్రకారం నియమాలు లేని భాషను గ్రామ్యం లేక అపభ్రంశం కావున సాహిత్యానికి పనికిరాదనేవారు. కావున అప్పట్లో సాహిత్యమంతా వ్యాకరణానికి లోబడి వుండేది. అలంకారాలు తెలుగు పదాలు తెలుగు అక్షరాలు విభక్తి ప్రకృతి - వికృతి వచనములు సమాసము ఛందస్సు తెలుగు వాక్యాలు సంధి భాషాభాగాలు

                                               

వార్త (పత్రిక)

తెలుగు జాతీయ దినపత్రిక వార్త తెలుగు దినపత్రిక. దీనిని 1996లో సంపాదకులు ఎ.బి.కె.ప్రసాద్నేతృత్వంలో హైదరాబాదుకు చెందిన పారిశ్రామికవేత్త గిరీష్ సంఘీ సోదరుల యాజమాన్యంలో ప్రారంభంలోనే హైదరాబాదు, విజయవాడ, విశాఖపట్నం, కర్నూలు, కరీంనగర్, మహబూబ్ నగర్, ఖమ్మం, నెల్లూరు, నల్గొండ మొత్తం తొమ్మిది కేంద్రాలనుండి ప్రచురితమైంది. తరువాత 19కేంద్రాలకు విస్తరించింది.

                                               

సాంబారు

సంభారము అనే సంస్కృతపదం ఉన్నది. పదార్ధ సంచయము అనే అర్ధము ఉన్నది. సంబారము సంభారుకి వికృతము. సంభారము యొక్క రూపాంతరము సంబారు. సంబారము అనే మాటకే ఉప్పు చింతపండు లోనుగ వంటదినుసులు అనే అర్ధము కాక, వండిన సాదకము అనే అర్ధంలో శ్రీనాధుడు వాడినాడు: శాక పాకములలో సంబారములతోడ, పరిపక్వమగు పెసరపప్పుతోడ, ఇక్కడ సంబారము వంటవస్తువులుగాక సాంబారు వంటి కూరలు అని అర్ధం వస్తుంది. సంబారమునకు రూపాంతరమైన సాంబారుకు పప్పుపులుసు అనే అర్ధం రూఢమవుతుంది. సంభారము- ప్రకృతి సంబారము-వికృతి సంబారు- రూపాంతరము సాంబార్, సాంబారు- ప్రస్తుతపు వాడుకరూపాలు.

                                               

కేతు బుచ్చిరెడ్డి

ఇతడు కడపలో 1942, జూన్ 17వ తేదీన జన్మించాడు. వృత్తి రీత్యా అనంతపురంలో స్థిరపడ్డాడు. ఇతడు కడపలోని రామకృష్ణ హైస్కూలులోను, ప్రభుత్వ జూనియర్ కళాశాలలోను చదివాడు. పిమ్మట గుంటూరులోని వైద్యకళాశాలలో ఎం.బి.బి.యస్. చదివాడు. ఆ తర్వాత అనంతపురం పోలీస్ శిక్షణ కళాశాలలో వైద్యాధికారిగా పనిచేశాడు. ఒకవైపు వృత్తిని కొనసాగిస్తూ, ప్రవృత్తిగా రచనలు చేయసాగాడు. ఇతనికి భార్య లక్ష్మీకాంతమ్మ, ముగ్గురు కుమారులు ఉన్నారు. ఇతని కథలు, గేయాలు, కవితలు, వ్యాసాలు దాదాపు అన్ని పత్రికలలో, ఆకాశవాణి కడప కేంద్రంలో ప్రచురణ/ప్రసారం అయ్యాయి. ఇతడు తన మిత్రులతో కలిసి కొంతకాలం "కవిత" అనే పత్రికను నడిపాడు.

                                               

నిషాదం

నిషాదం ఇది ఒక తెలుగు కవితల పుస్తకం, నిషాదం అనగా ఏనుగు ఘీంకారం అని అర్దం. ఈ పుస్తకాన్ని వేగుంట మోహన్ ప్రసాద్ వ్రాసారు. మొహన్ ప్రసాద్ కలం పేరు "మో". ఈ నిషాదంలో ఇంచుమించు 70 కవితలున్నాయి. ప్రపంచీకరణ, ఆర్థిక సరళీకరణ క్రమం మొదలై రెండు దశాబ్దాలు ముగిసాయి. రెండో దశాబ్దంలో తెలుగు సమాజ సంక్షోభం మొత్తం ఈ సంపుటిలో ఉంది. ఒక దశాబ్ది కవిత్వాన్ని నిషాదంగా సంపుటీకరించాడు. గానకళకు పునాది సప్త స్వరాలు. అందులో నిషాదం సప్తమ స్వరం. ఏనుగు ఘీంకారమే నిషాదంగా జనించిందని గాన కళాబోధిని వివరిస్తోంది. కవిత్వ కళాబోధిని మనకెటూ లేదు కనుక సంగీత శాస్త్ర పరిభాషా పదాన్ని కవిత్వానికి అనవయించుకోవటం కొత్తే. సప్త స్వరాలలో రిషభ, ...

                                               

ఆకాశం

ఆరుబయటనుండి పైకి చూస్తే మనకు కనిపించే నీలిరంగు ఆవరణమే ఆకాశం. ఆకాశానికి తెలుగు భాషలో వికృతి పదము ఆకసము. భూమి ఉపరితలంపై ఉండే మేఘాలు, నీటియావిరితో కూడిన వాయు ఆవరణాలపై పడిన సూర్యకాంతి పరావర్తనం చెందడం వలన ఆకాశం మనకు నీలిరంగులో కనబడుతుంది. కాని నిజానికి ఆకాశం ఏ రంగునూ కలిగి ఉండదు. అందుకే మనకు రాత్రి సమయంలో ఆకాశం సూర్యకాంతి లేకపోవడం వలన చీకటిగా కనిపిస్తుంది. ఆ చీకటిలో అనంత దూరాలలో ఉన్న నక్షత్రాలు, గ్రహాలు చిన్న చిన్న చుక్కలుగా కనిపిస్తాయి.

                                               

తెలుగు పదాలు

తెలుగు భాషలో పదములు నాలుగు రకములు అవి: 4. అన్యదేశ్యము: ఇతర భాషలకు చెందియుండి తెలుగులో వాడబడుచున్న పదములను అన్యదేశ్యములు అంటారు. ఉదాహరణ: స్టేషను, రోడ్డు మొదలైనవి. 2. తద్భవము: సంస్కృత, ప్రాకృత పదముల నుండి కొద్ది మార్పులు చెంది ఏర్పడిన పదములను తద్భవములు అంటారు. వీటినే వికృతి అంటారు. ఉదాహరణ: యజ్ఞము - జన్నము; పంక్తి - బంతి 1. తత్సమము: సంస్కృత ప్రాకృత పదము, తెలుగు ప్రత్యయములతో కూడి వ్యవహరింపబడినచో తత్సమము అంటారు. సంస్కృత ప్రాతిపదికపై తెలుగు విభక్తి ప్రత్యయమును చేర్చుట వలన తత్సమము ఏర్పడును. వీనినే ప్రకృతి అంటారు. ఉదాహరణ: బాలః - బాలురు; పుస్తకమ్ - పుస్తకము 3. దేశ్యము: తత్సమము, తత్భవములు కాక, తెలుగ ...

                                               

సిప్రాలి

సిప్రాలి ఒక వ్యంగ్య రచనా సంపుటి మూల రచన శ్రీశ్రీ. తెలుగు సాహిత్యంలో శ్రీశ్రీ వ్రాయని సాహితీ ప్రక్రియ లేదు. ఐతే చాలా తక్కువమందికి తెలిసిన విషయం ఏమిటంటే, శ్రీశ్రీ వ్యంగ్య సాహిత్యంతో అంటే పేరడీ సాహిత్యంతో కూడా ఎన్నో రచనలు చేసి తెలుగు సాహితీ ప్రియులను ఆనందింప చేశాడు. శ్రీశ్రీ పేరడీ రచనలలో భాగంగానే ‘సిప్రాలి’ అనే శీర్షిక క్రింద ఒక గ్రంధం ప్రచురణ జరిగింది అది బహుళ ప్రాచుర్యం కూడా పొందింది. ‘సిప్రాలి’లో రమారమి అన్ని పద్యాలకు" సిరిసిరి” అనే మకుటం వొచ్చేటట్టు రచన చేసాడు. శ్రీ అనే పదం తెలుగులో ప్రకృతి ఐతే సిరి అనే పదం వికృతి కాబట్టి దీనికి మకుటం శ్రీశ్రీకి బదులు సిరిసిరి అని పెట్టి ఉంటాడు. అంటే తన గ ...

                                               

తెలుగు కథా రచయితలు

తెలుగు కథ, తెలుగులో ఒక సాహితీ ప్రక్రియ. తెలుగు అకాడమి నిఘంటువు ప్రకారం కథ అనగా కొంత సత్యాంశతో కూడిన కల్పిత గద్య గ్రంథం. ఆంధ్ర దేశంలో చిన్నపిల్లలకు నిద్రపోవడానికి తల్లిదండ్రులు చిన్న చిన్నకథలు చెప్పడం బాగా అలవాటు. పాత కాలపు కథల్లో తూర్పుదేశాల కథలు ప్రసిద్ధిపొందాయి. తెలుగులోను, ఇతర భారతీయ భాషలలో కొత్త కథ పుట్టి సుమారు నూరేళ్ళయింది. ఈ నూరేళ్ళలో సుమారు లక్షకు పైగా కథలు రచించబడినట్లుగా ఒక అంచనా. ఇవి ఎక్కువగా దిన, వార, మాస పత్రికలలో ప్రచురించబడుతున్నాయి. కొన్ని కథా సంకలనాలు ప్రత్యేకంగా ముద్రించబడుతున్నాయి. ఈ కథలు ముఖ్యంగా నీతి, ధర్మం, సాహసం, ఔదార్యం, శృంగారం వంటి విషయాలు ప్రధాన వస్తువుగా నడుస్తా ...

                                               

సంస్కృతాంధ్ర వ్యాకరణములు

ప్రపంచము పరమేశ్వరునిచే సృజింపబడిన నామ రూపాత్మకము అని అనుకొనినచో, అందు రూపవ్యవహారముకొరకు నామము ఆవశ్యకమని దానితోడనే నామము సృజింపబడినట్లు "నామరూపే వ్యాకరణాని" "సర్వాణి రూపణి విచిత్యధీరః, నామాని కృత్వా అభివదన్ యదాస్తే" అను శ్రుతి సమంవయమువలన దెలియుచున్నది. ఇట్టి నామము ధ్వని రూపమై సకల వ్యవహారములను నిర్వహింపదగియున్నది. దీనినే "భాష" అని అంటారు. భాష మొదట్లో ఏకరూపమై ప్రవర్తించుచు లోకము ఏకరూపముగా ప్రవర్తింపజేయుచు ఆయా భాషా విపరిణామ హేతువులంబట్టి వివిధముగా గాజొచ్చింది. కొంతకాలమునకు భాషను అర్ధము చేసుకొనుటకు, లోక వ్యవహారమును క్రమముగా నుంచుటకు జనులు చట్టములను ఏర్పరచిరి. దానికి కొన్ని నియమములను ఏర్పరచుకొని ...

                                               

నాగసూరి వేణుగోపాల్

నాగసూరి వేణుగోపాల్‌. జనరంజక విజ్ఞాన రచయిత, మాధ్యామాల విశ్లేషకుడు, సాహిత్యాంశాల పరిశీలకుడు, పాఠ్యాంశాల రచయిత మరియు ఆకాశవాణి ప్రయోక్త. శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం నుండి భౌతికశాస్త్రంలో ఎం.ఎస్‌.సి. ఎం.ఫిల్‌., ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజంలో పి.హెచ్‌డి గడించాడు. 1978లో ఆంధ్ర పత్రిక దినపత్రిక లో కవిత ప్రచురణతో రచనా ప్రయాణం మొదలైంది. జనరంజక విజ్ఞానం, పర్యావరణం పత్రికారంగం, టెలివిజన్‌, సాహిత్యం, సామాజికం - వంటి విభిన్న అంశాలలో సుమారు రెండువేల వ్యాసాలు రాసాడు. ముప్ఫై పుస్తకాలకు రచయితగా, ఇరవై పుస్తకాలకు పైగా సంపాదకుడిగా పనిచేశాడు. 1988 లో ఆకాశవాణి ఉద్యోగంలో చేరిన నాగసూరి వేణుగోపాల్ - ఉమ్మడ ...

                                               

తెలుగు కథ

తెలుగు కథ లేదా కత తెలుగులో ఒక సాహితీ ప్రక్రియ. తెలుగు అకాడమి నిఘంటువు ప్రకారం కథ అనగా కొంత సత్యాంశతో కూడిన కల్పిత గద్య గ్రంథం. ఆంధ్ర దేశంలో చిన్నపిల్లలకు నిద్రపోవడానికి తల్లిదండ్రులు చిన్న చిన్నకథలు చెప్పడం బాగా అలవాటు. పాత కాలపు కథల్లో తూర్పుదేశాల కథలు ప్రసిద్ధిపొందాయి. తెలుగులోను, ఇతర భారతీయ భాషలలో కొత్త కథ పుట్టి సుమారు నూరేళ్ళయింది. ఈ నూరేళ్ళలో సుమారు లక్షకు పైగా కథలు రచించబడినట్లుగా ఒక అంచనా. ఇవి ఎక్కువగా దిన, వార, మాస పత్రికలలో ప్రచురించబడుతున్నాయి. కొన్ని కథా సంకలనాలు ప్రత్యేకంగా ముద్రించబడుతున్నాయి. ఈ కథలు ముఖ్యంగా నీతి, ధర్మం, సాహసం, ఔదార్యం, శృంగారం వంటి విషయాలు ప్రధాన వస్తువుగా ...

                                     

ⓘ ప్రకృతి - వికృతి

ఎల్ల భాషలకు జనని సంస్కృతంబు - అని మన పూర్వీకుల అభిప్రాయం. సంస్కృత భాషలో నుండే ఈ ప్రపంచ భాషలు పుట్టాయని వారి నమ్మకం. సాధారణంగా మనం వాడుకునే తెలుగు మాటలు చాలావరకు సంస్కృత భాషలో నుండి స్వల్ప మార్పులతో గ్రహించినవి. అలాగే కొన్ని పదాలు ప్రాకృత భాషల నుండి వచ్చాయని వ్యాకరణ వేత్తలు తెలియచేశారు.

సంస్కృతంతో సమానమయిన పదాలను తత్సమాలని, సంస్కృత ప్రాకృతాల నుండి పుట్టినవి తద్భవాలని అన్నారు. ఇలాంటి తత్సమ తద్భవ శబ్దాలను మనం వికృతులు గాను, సంస్కృత, ప్రాకృత శబ్దాలను ప్రాకృతులు లేదా ప్రకృతులు గాను చెప్పుకుంటున్నాము. అనగా ప్రకృతి నుండి వికారం పొందినది వికృతి అంటారు. ఇలా వికారం పొందినప్పుడు ఆ ప్రకృతి శబ్దం వర్ణాగమం, వర్ణలోపం, వర్ణ వ్యత్యయం, వర్ణాధిక్యం, రూప సామ్యం, వేరొక రూపం పొందడం వంటి గుణగణాలతో ఉంటుంది.

తెలుగు భాషలో చాలా ప్రకృతి వికృతులుగా ఉన్నాయి. తెలుగు నిఘంటువులు వీటిని ఆకారాది క్రమంలో చూపిస్తాయి.karyam

తెలుగు భాషలో కొన్ని ప్రకృతి వికృతి పదాలు:

ముఖము - మొగము, మోము

రూపము - రూపు

వీధి - వీది

శాల - సాల

సందేహము - సందియము

సపత్ని - సవతి

యువతి - ఉవిద

మతి - మది

పినాకిని - పెన్న

పీఠ - పీట

పిత్తళ - ఇత్తడి

దృఢము - దిటము

దేవాలయము - దేవళము

నిజము - నిక్కము

కుమారుడు - కొమరుడు

కావ్యము - కబ్బము

కుఠారము - గొడ్డలి

  • తెలుగు వ్యాకరణము, వర్రే సాంబశివరావు, దేవీ పబ్లికేషన్స్, విజయవాడ, 1999.
Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →