Back

ⓘ జయగోపాల్                                               

రంగనాయకమ్మ

రంగనాయకమ్మ సుప్రసిద్ధ మార్కిస్టు, స్త్రీవాద రచయిత్రి. ఈమె రచనల్లో రామాయణాన్ని మార్క్సిస్టు దృక్పధంతో విమర్శిస్తూ రాసిన రామాయణ విషవృక్షం ఒకటి. స్త్రీవాద రచయిత కావడం వల్ల పురుష వ్యతిరేకిగానూ, రామాయణ విషవృక్షం రాయడం వల్ల బ్రాహ్మణ వ్యతిరేకి గానూ ఈమెకి పేరు. ఆమె వ్రాసిన నవల స్వీట్ హోం.

                                               

ఆంధ్రప్రదేశ్ హేతువాద మానవవాద ఉద్యమాల చరిత్ర

ఆంధ్ర ప్రదేశ్ లో హేతువాద మానవవాద ఉద్యమాల చరిత్ర అనేది రావిపూడి వెంకటాద్రి, పెన్మెత్స సుబ్బరాజు రాసిన పుస్తకం. దీనిని తెలుగు అకాడమీ 2003 లో ప్రచురించింది. ఈ పుస్తకంలోని 9 అధ్యాయాలనుండి స్థూలంగా సమాచారం:

                                               

నాస్తికత్వం

భగవంతుడు ఉన్నాడనే వాదాన్ని ప్రశ్నించేవాళ్లను లేదా ఖండించేవాళ్లను నాస్తికులు అని పిలుస్తారు. చాలా మంది నాస్తికత్వాన్ని, ఏ మతాన్నీ ఆచరించకుండా ఉండడంతో సమానంగా చూస్తారు, అయితే కొన్ని సార్లు నాస్తికత్వాన్ని ఆస్తికత్వాన్ని పాటించని వాళ్లుగా చూడొచ్చు. ఉదాహరణకు బౌద్ధమతంలో దేవుడున్నాడనే భావనకు విలువలేదు, కాబట్టి ఆ మతాన్ని ఆచరించే వారందరినీ నాస్తికులుగానే చూడొచ్చు. కమ్యూనిస్టులు ప్రాథమికంగా నాస్తికులై ఉండాలి. ఆస్తికవాదం ఎంత ప్రాచీనమో నాస్తిక వాదం కూడా అంతే ప్రాచీనం. ఈశ్వరవాదం, నిరీశ్వరవాదం, నాస్తికత్వం. ఇలా అనేక అంశాలమీద శతాబ్దాలుగా చర్చ, వాదోపవాదాలు నడుస్తూనే ఉన్నాయి.

                                               

జానకి విముక్తి

జానకి విముక్తి రంగనాయకమ్మ చే రచింపబడ్డ నవల. ఈ నవల మొదట ఒక ప్రముఖ తెలుగు వారపత్రికలో సీరియల్ గా ప్రచురితమయ్యింది. ఆ సీరియల్ వివాదాస్పదం కావడంతో ఆ సీరియల్ ని నిలిపి వేశారు. పూర్తి కథ పుస్తక రూపంలో వచ్చింది.

                                               

ఆర్.ఎన్.సుదర్శన్

రట్టి నాగేంద్ర సుదర్శన్ భారతీయ సినిమా నటుడు, నిర్మాత. ఆయన ప్రధానంగా కన్నడ సినిమాలలో తన సేవలనందించారు. ఆయన తమిళం, హిందీ, తెలుగు, మలయాళ సినిమాలలో కూడా నటించాడు. ఆయన మూడు దశాబ్దాలకు పైగా తన సినీ జీవితాన్ని కొనసాగించారు. ఆయన 250 లకు పైగా చిత్రాలలో వివిధ పాత్రలలో నటించారు.

                                               

హేతువాదులు

హేతువాదం అనే తాత్విక విధానాన్ని విశ్వసించి అనుసరించేవారిని హేతువాదులు అంటారు. హేతువు అంటే కారణం అని అర్థం. ఏదైనా ఒక విషయాన్ని గుడ్డిగా విశ్వసించకుండా దానికి కారణాలను అన్వేషించడం లేదా ఆరా తీయడాన్ని హేతువాదం అంటారు. జ్ఞానానికి లేదా ఋజువుకు "హేతువు" లేదా "కారణం" అనేది మాత్రమే నమ్మదగిన ఆధారం అని భావించే తాత్విక ధోరణిని హేతువాదం అంటారు. ఆస్తిక హేతువాదులు: మతంలో ఉంటూనే అహేతుక విషయాలను ప్రశ్నిస్తూ ఉంటారు. మూఢాచారాలను సంస్కరించాలని చూస్తారు. నాస్తిక హేతువాదులు: దేవుడిని పూర్తిగా ఒప్పుకోరు. ప్రతి దానికీ కారణం ఉంటుందని నమ్ముతారు.

                                               

బెంగుళూరు లత

బెంగళూరు లత దక్షిణభారత చలనచిత్ర నేపథ్య గాయని. ఈమె కన్నడ, తెలుగు భాషాచిత్రాలలో పాటలు పాడింది. ఈమె జి.కె.వెంకటేష్, సుసర్ల దక్షిణామూర్తి, సాలూరు హనుమంతరావు, కె.వి.మహదేవన్, టి.వి.రాజు, సత్యం, ఎం.రంగారావు, టి.జి.లింగప్ప, విజయభాస్కర్ మొదలైన సంగీత దర్శకుల చిత్రాలలో పనిచేసింది. మంగళంపల్లి బాలమురళీకృష్ణ, ఘంటసాల, పి.బి.శ్రీనివాస్, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, రాజ్‌కుమార్, ఎస్.జానకి వంటి గాయకులతో కలిసి పాడింది. సముద్రాల సీనియర్, దాశరథి, ఆరుద్ర, వడ్డాది, ఆర్.ఎన్.జయగోపాల్, ఉదయశంకర్, జి.వి.అయ్యర్ వంటి రచయితల పాటలకు తన గాత్రాన్ని అందించింది.

                                               

నాయకుడు (సినిమా)

ప్రధానపాత్రలు వీరయ్య నాయుడు లేదా వీర్నాయుడు గా కమల్ హాసన్ రాజమ్మ గా కార్తీక నీల గా శరణ్య సహాయ పాత్రలు వీర్నాయుడి సాయం కోరే పోలీస్ కమిషనర్ గా ఎ.ఆర్.శ్రీనివాసన్ సూర్య గా నిలగళ్ రవి చెట్టియార్ సోదరులు గా ఆర్.ఎన్.సుదర్శన్, ఆర్.ఎన్.జయగోపాల్ షకీలా గా తార హుస్సేన్ భాయ్ గా ఎం.వి.వాసుదేవరావు అయ్యర్ గా ఢిల్లీ గణేష్ రాజమ్మ భర్త, అసిస్టెంట్ కమిషనర్ గా నాజర్ ఇన్స్పెక్టర్ కేల్కర్ గా ప్రదీప్ శక్తి

                                     

ⓘ జయగోపాల్

డా. జయగోపాల్ నాస్తిక యుగం పత్రిక సంపాదకుడు, భారత నాస్తిక సమాజం స్థాపకుడు. ఇతడు విశాఖపట్నం నివాసి. ఇతడు ఇస్లాం మీద పెద్ద గ్రంథం రాశాడు. దేవుడు, ఆత్మలు, స్వర్గం, పునర్జన్మలు, జ్యోతిషం, వాస్తు లాంటివి నిజమని నిరూపిస్తే 5 లక్షలు బహుమతి ఇస్తామని జయగోపాల్ చాలెంజ్ చేశాడు. ఇతడు 1972లో భారత నాస్తిక సమాజం, నాస్తిక యుగం పత్రికను స్థాపించాడు.హేతువాది నాస్తికుడు.

                                     

1. నాస్తిక యుగం పత్రిక

నాస్తిక యుగం పత్రిక 1972లో డా.జయగోపాల్ చే స్థాపించబడినది. ఈ పత్రిక విశాఖపట్నం నుంచి ప్రచురితమవుతోంది. ఈ పత్రికలో హిందూ, ఇస్లాం, క్రైస్తవ మతాల పైన తీవ్ర విమర్శలు ప్రచురించారు. గ్రామాలలో చేతబడి పేరుతో జరిగే హత్యలు, మానభంగాల పై కూడా వార్తలు ప్రచురించారు.

                                     

2. భారత నాస్తిక సమాజం

భారత నాస్తిక సమాజం వారు మతతత్వానికి వ్యతిరేకంగా సభలు పెడుతున్నారు. మతతత్వ సంస్థలకి వ్యతిరేకంగా పాటలు కూడ సంకలనం చేస్తున్నారు. "ఓరోరి మతోన్మాది, నీకు కడతాం గోరీ" వంటి పాటలు మతతత్వ రాజకీయ పార్టీలని భయపెట్టేలా ఉంటాయి. గ్రామాలలో మంత్ర గాళ్ళు దెయ్యాలు తిరుగుతున్నాయని పుకార్లు సృష్టించి ప్రజలని భయపెట్టి వాటిని శాంతి చెయ్యిస్తామని చెప్పి డబ్బులు లాగుతున్నారు. ఆ సందర్భాలలో భారత నాస్తిక సమాజం వారు గ్రామాలకి వెళ్ళి భయాల్ని పోగొట్టే ప్రయత్నాలు చేస్తుంటారు. భారత నాస్తిక సమాజం ఆధ్వర్యంలో జయగోపాల్ విశాఖపట్నంలో గొడ్డుమాంసం, పందిమాంసం విందు నిర్వహించాడు. బహిరంగంగా మతగ్రంథాలను తగులబెట్టాడు. రాజకీయాలకు అతీతంగా హేతువాద దృష్టితో అనేక సాహవంతమైన కార్యక్రమాలను నిర్వహించాడు. అయితే నిజాన్ని తెలుసుకోవటానికి కాక కేవలం అస్తిత్వవాదంపై గుడ్డి ద్వేషంతో హిందూ ముస్లింల సునిశిత భావాలకు ఖేదం కలిగించడానికే ఇటువంటి కార్యక్రమాలను చేపట్టాడని విమర్శకులు ఖండించారు.

                                     

3. సవాళ్ళు

దేవుడు, ఆత్మలు, స్వర్గం, పునర్జన్మలు, జ్యోతిషం, వాస్తు లాంటివి నిజమని నిరూపిస్తే 5 లక్షలు బహుమతి ఇస్తామని జయగోపాల్ చాలెంజ్ చేశాడు. విశాఖపట్నంలోనే ఇతనికి పోటీగా పాస్టర్ పొట్లూరి దేవ సుందర రావు అనే వ్యక్తి తనని తాను అంతర్జాతీయ చాలెంజర్ గా ప్రకటించుకున్నాడు. అతను బైబిల్ ఓపెన్ యూనివర్శిటీ నిర్వాహకుడు. అతనికి bibleverdict.org పేరుతో వెబ్ సైట్ కూడా ఉంది, భూతలక్రిందులు అనే పేరుతో పత్రిక కూడా ఉంది. విశాఖపట్నంలోని గోడల మీద, బోర్డుల మీద పెయింటింగులు వెయ్యించి తాను ప్రపంచంలో ఎవరినయినా చాలెంజ్ చెయ్యగలనని ప్రకటించుకుంటుంటాడు. డా విన్సీ కోడ్ విషయంలో కూడా సుందర రావు సవాల్ విసిరాడు. ఆ సవాల్ ని అంగీకరిస్తూ జయగోపాల్ అతన్ని బహిరంగ చర్చకి రమ్మన్నాడు. క్రైస్తవులు తొక్కిపెట్టిన ఫిలిప్ సువార్త గురించి జయగోపాల్ ప్రస్తావిస్తారనే భయంతో అతను జయగోపాల్ పిలిచిన వేదికకి రాలేదు. క్రైస్తవ మతవాదులని సవాల్ చేస్తూ జయగోపాల్ క్రీస్తు చారిత్రక పురుషుడా? అనే టైటిల్ తో గ్రంథం కూడా వ్రాసాడు.

                                               

సర్కస్ కిలాడీలు

సర్కస్ కిలాడిలు 1978 ఫిబ్రవరి 11న విడుదలైన తెలుగు సినిమా. లోకమాత ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్ పై కె. అప్పారావు, ఎన్.సత్తిరెడ్డి లు నిర్మించిన ఈ సినిమాకు ఆర్.ఎస్. జయగోపాల్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకు కె.వి.జి.కృష్ణ సమర్పించగా బి.గోపాల్ సంగీతాన్నందించాడు.

ఉదయచంద్రిక
                                               

ఉదయచంద్రిక

ఉదయచంద్రిక 1966లో విడుదలైన కఠారి వీర అనే కన్నడ సినిమాతో నటించడం ప్రారంభించింది. ఈ సినిమాలో రాజ్‌కుమార్ సరసన నటించింది. అది మొదలు 1985 వరకు ఈమె పలు చిత్రాలలో వివిధ పాత్రలను ధరించింది. ఈమె రాజ్‌కుమార్, కళ్యాణకుమార్, ఉదయ్ కుమార్, రాజేష్, విష్ణువర్ధన్, శ్రీనాథ్,రజనీకాంత్, ఎం.జి.రామచంద్రన్, ప్రేమ్‌ నజీర్, ఘట్టమనేని కృష్ణ వంటి ఆ కాలపు హీరోలందరితో కలిసి నటించింది. ఈమె చంద్రిక ఫిలిమ్స్ బ్యానర్‌పై రెండు చిత్రాలను కూడా నిర్మించింది.

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →