Back

ⓘ తెలుగు విజ్ఞాన సర్వస్వము                                               

విజ్ఞాన సర్వస్వం

విజ్ఞాన సర్వస్వం లేదా విజ్ఞాన కోశం అనగా అన్ని విషయాల గురించి లేదా ఒక రంగానికి సంబంధించిన పరిజ్ఞానాన్ని ఒక చోట చేర్చిన వ్రాతప్రతుల సముదాయం. ఇందులో సమాచారం వ్యాసాలుగా విభజిస్తారు. దీన్ని ఉపయోగించడానికి అనువుగా కొన్ని విభాగాలుగా వర్గీకరిస్తారు.

                                               

ఎస్.బి.రఘునాథాచార్య

అతను 1944 జనవరి 1న గుంటూరు జిల్లాలో జన్మించాదు. అతను రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠానికి 1994-1999 మధ్యకాలంలో ఉపకులపతిగా పనిచేశాడు. తరువాత అతను శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం, తిరుపతిలో సంస్కృత విభాగానికి ప్రొఫెసరుగా పనిచేసాడు. అతను సంస్కృత సలహా బోర్డు సభ్యుడు, సాహిత్య అకాడమీ జనరల్ కౌన్సిల్ సభ్యుడు. అనేక అవార్డులు అందుకున్నాడు. అతను 100 కి పైగా రచనలను చేసాడు. ఇంగ్లీష్, సంస్కృతం, తెలుగు భాషలలో 30 పుస్తకాలను ప్రచురించాడు. అతను అకాడమీ అర్ధ-వార్షిక పత్రిక సంస్కృత ప్రతిభా సంస్కృతం ను కూడా సవరిస్తున్నాడు.

                                               

శ్రీపాద గోపాలకృష్ణమూర్తి

శ్రీపాద గోపాలకృష్ణమూర్తి 1901లో జన్మించాడు. మద్రాసు విశ్వవిద్యాలయం నుండి 1932లో ఎం.ఎ., 1936లో డాక్టరేట్ ఇన్ సైన్స్ చదివాడు. లండన్‌లో పి.హెచ్.డి. చేశాడు. మద్రాసులోని ప్రెసిడెన్సీ కళాశాలలో ఫిజిక్సులో లెక్చరర్‌గా ఒక దశాబ్దం పనిచేశాడు. తరువాత బాపట్ల ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలకు ప్రిన్సిపాల్‌గా కూడా పనిచేశాడు. పరిశోధనా తత్వంగల శ్రీపాద, వరంగల్లు ప్రాంతంలో దేవాలయాలు పరిశీలించాడు. బౌద్ధ ఆరామాలను హిందూ దేవాలయాలుగా మారిన తీరుపై వ్రాశాడు. తిరుపతిలో వెంకటేశ్వర విగ్రహం స్త్రీ రూపంలో వుంటుందన్నాడు. ఈయన రచనలు రాష్ట్ర ఆర్కియిలాజికల్ శాఖ ప్రచురించింది. గోపాలకృష్ణమూర్తి కవితా ధోరణులపై పత్రికలో వ్రాశాడు. ఆయన ...

                                               

పెద్ద బాలశిక్ష

పెద్ద బాలశిక్ష అనే పుస్తకం తెలుగులో ఎన్సైక్లోపెడియా అనవచ్చు. బ్రిటీషువారు భారతదేశాన్ని పరిపాలించు కాలంలో ఆంధ్రదేశములోని పాఠశాలల్లో పిల్లలకు పెద్దబాలశిక్ష సిలబస్ గా ఉండేది. పిల్లలు మొట్టమొదట తమ విద్యాభ్యాసాన్ని పెద్ద బాలశిక్షతోనే ప్రారంభించేవారు.

                                               

ఆంధ్ర విజ్ఞానము

విజ్ఞాన కోశము లేదా విజ్ఞాన సర్వస్వము అనగా అన్ని విషయాల గురించి లేదా ఒక రంగానికి సంబంధించిన పరిజ్ఞానాన్ని ఒక చోట చేర్చిన వ్రాతప్రతుల సముదాయం. ఇందులో సమాచారం వ్యాసాలుగా విభజిస్తారు. దీన్ని ఉపయోగించడానికి అనువుగా కొన్ని విభాగాలుగా వర్గీకరిస్తారు. ఇది తెలుగులోని తొలినాళ్ల విజ్ఞాన సర్వస్వాలలో ఒకటి. దీన్ని దేవిడి జమీందార్ ప్రసాద భూపాలుడు సంకలనం చేసి, 1940 దశాబ్దంలో ముద్రించారు.

                                               

పరవస్తు వెంకట రంగాచార్యులు

పరవస్తు వెంకట రంగాచార్యులు సంస్కృతాంధ్ర పండితుడు, ప్రముఖ తత్వవేత్త, చెప్పుకోదగిన తెలుగు కవి. తర్కము, వ్యాకరణాలలో నిష్ణాతుడు.

                                               

అమళ్ళదిన్నె గోపీనాథ్

ఇతడు అనంతపురం జిల్లా, బత్తలపల్లె మండలం అప్పరాశ్చెరువు గ్రామంలో 1932వ సంవత్సరంలో జన్మించాడు. బి.ఎ. చదివాడు. గ్రంథాలయశాఖలో శిక్షణ పొంది పౌరగ్రంథాలయ శాఖలో పనిచేసి గ్రేడ్-1 లైబ్రరీయన్‌గా 1990లో పదవీ విరమణ చేశాడు. 1944లో ఎరుకలసాని వేషంతో కళారంగ ప్రవేశం చేశాడు. ఆనాటి నుండి కళారంగానికి అంకితమయ్యాడు. జానపద కళలో ఎక్కువ కృషి చేశాడు. రాయలసీమలోని ప్రతిపల్లెలో ప్రతిధ్వనించే పాట కాదరయ్య పాటను జనబాహుళ్యం లోనికి తెచ్చింది ఇతడే. అనేక జానపద, పౌరాణిక, చారిత్రక, సాంఘిక నాటకాలలో విభిన్నమైన పాత్రలు ధరించి నటుడిగా పేరు గడించాడు. హాస్య రసపోషణలో ఇతడు పలువురి మెప్పుపొందాడు. ఇతడు మంచి వక్త. ఆకాశవాణి కడప, అనంతపురం కే ...

                                               

నాళం కృష్ణారావు

నాళం కృష్ణారావు బాల సాహిత్యబ్రహ్మ, మధుర కవి. తెలుగు వైతాళికుడు. సంఘ సంస్కర్త. గౌతమీ గ్రంథాలయం స్థాపకుడు."మానవసేవ" పత్రిక సంపాదకులు. స్వాతంత్ర్య సమర యోధుడు, భాషావేత్త.

                                               

కాశీనాథుని నాగేశ్వరరావు

కాశీనాథుని నాగేశ్వరరావు పాత్రికేయుడు, వ్యాపారవేత్త, స్వాతంత్ర్య సమర యోధుడు, రాజకీయ నాయకుడు, గ్రంథాలయాల విస్తరణకు కృషి చేసిన విద్యా వేత్త, దానశీలి, ఖాదీ ఉద్యమాన్ని ప్రోత్సహించాడు. అతనును నాగేశ్వరరావు పంతులు అనేవారు. దేశోధ్ధారక, విశ్వదాత అని అతనును అంతా గౌరవించేవారు. 1935లో ఆంధ్ర విశ్వవిద్యాలయం అతనును కళాప్రపూర్ణ బిరుదుతో సత్కరించింది. ఆయనకి ఆంధ్ర మహాసభ వారు దేశోధ్ధారక అని బిరుదు ఇచ్చారు. నాగేశ్వరరావు పెద్ద చదువులు చదవలేదు. పదవులు ఆశించలేదు. ఆంధ్ర పత్రిక, అమృతాంజనం సంస్థలను అతను స్థాపించాడు. ఆంధ్రపత్రిక, భారతి, ఆంధ్ర గ్రంథాలయాల ద్వారా తెలుగు సాహిత్యానికి ఎనలేని సేవ చేసేడు. అతను స్వయంగా రచయిత ...

                                               

ప్రబంధము

ప్రబంధమంటే కావ్యమనే అర్థంలో తిక్కన తాను రచించిన 15 పర్వాలను ప్రబంధమండలి అన్నాడు. ఎర్రనకు ప్రబంధ పరమేశ్వరుడు అనే బిరుదు ఉంది. అయితే ఈ ప్రబంధ శబ్దానికి ప్రక్రియపరమైన ప్రబంధ శబ్దానికి భేదం ఉంది. నన్నెచోడుడు అష్టాదశ వర్ణనలను పేర్కొనడమే కాక కుమార సంభవంలో అనేక వర్ణనలు చేశాడు. శ్రీనాథుడు, పిల్లలమర్రి పినవీరభద్రుడు అష్టాదశ వర్ణనల్లో కొన్నింటిని రసరమ్యంగా నిర్వహించారు. కొన్ని ప్రబంధ ప్రక్రియా లక్షణాలు లేకపోవడం వల్ల ఇవి ప్రబంధాలు కాలేకపోయాయి. అల్లసాని పెద్దన మనుచరిత్ర రచనతో ప్రబంధ ప్రక్రియకు అంకురార్పణ జరిగింది. పెద్దన రాసిన మనుచరిత్ర బహుళ ఆదరణ సంపాదించి ప్రక్రియగా ప్రబంధానికి రాజాదరణ సాధించిపెట్టిం ...

                                               

బి.ఎన్. శాస్త్రి

బి.ఎన్. శాస్త్రి తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రసిద్ధ చరిత్రకారుడు. కొమర్రాజు వెంకట లక్ష్మణరావు, మల్లంపల్లి సోమశేఖరశర్మ ల తరువాత అంతగా పరిశోధనావాఙ్మయాన్ని అందించిన విద్వాంసుడు. మూసీ మాసపత్రిక ప్రతిక వ్యవస్థాపకులు, మూసీ పబ్లికేషన్స్ ప్రచురణ సంస్థను 1980 స్థాపించారు

                                     

ⓘ తెలుగు విజ్ఞాన సర్వస్వము

విజ్ఞాన సర్వస్వం, అనగా మానవాళికి తెలిసిన జ్ఞానాన్ని ఒకచోట పొందుపరచిన పుస్తకాలు లేక మాధ్యమాలు. సాధారణంగా విద్యావేత్తలు విజ్ఞాన సర్వస్వ రచనలో పాలు పంచుకుంటారు. ప్రాచీన కాలంలో ఒక్క పండితుడు విజ్ఞాన సర్వస్వం రాయకలిగినా, తరువాతికాలంలో జ్ఞానం విపరీతంగా అభివృద్ధి కావడంతో, ఒక్కరే ఈ పనిచేయటం కష్టసాధ్యం.

తెలుగు భాషలో పెద్ద బాలశిక్ష మొట్టమొదటి విజ్ఞాన సర్వస్వం. ఆ తరువాత కొమర్రాజు లక్ష్మణరావు ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం, తెలుగు భాషా సమితి వారి విజ్ఞాన సర్వస్వం ప్రచురణ అయ్యాయి. తెలుగు వికీపీడియా ఆధునిక అంతర్జాల యుగంలో ప్రతిఒక్కరు పాల్గొనగల విజ్ఞాన సర్వస్వం. 2004 తరువాత పెద్దబాలశిక్షపేరుతో చాలా పుస్తకాలు ప్రచురించబడ్డాయి. వాటిలో గాజుల సత్యన్నారాయణ సంకలనంచేసిన తెలుగువారి సంపూర్ణ పెద్దబాలశిక్ష ప్రజాదరణ పొందింది.

                                     

1. పెద్ద బాలశిక్ష

ప్రధాన వ్యాసం: పెద్ద బాలశిక్ష

1832 లో మేస్తర్ క్లూలో Clu Low అనే తెల్లదొర, తన ఆశ్రితుడైన పుదూరు చదలవాడ సీతారామశాస్త్రి చేత బాలశిక్ష అనే గ్రంథాన్ని రచింపచేశాడు. ఇతని రచనా ప్రణాళికను చాలా జాగ్రత్తగా కుర్రవాళ్ళ గ్రహణశక్తిని దృష్టిలో వుంచుకొని రూపొందించాడు. ఇటువంటి పుస్తకం కోసమే ఆవురావురమంటూ ఎదురు చూస్తున్మన దేశం దీనిని రెండు చేతులా ఆహ్వానించింది. 1856లో అంటే మొదటి ముద్రణకు రెండు పుష్కరాల తర్వాత వెలువడిన బాలశిక్షలోని పుటల సంఖ్య 78. డెమ్మీ ఆక్టావో సైజు. 1865లో అంటే రమారమి పదేళ్ళ తర్వాత ముద్రణలో పుటల సంఖ్య 90. అంటే పన్నెండు పేజీలు పెరిగాయన్నమాట. పాత ముద్రణలో లేని సాహిత్య విషయాలను, ఛందస్సు, సంస్కృత శ్లోకాలు, భౌగోళిక విషయాలను యిందులో చేర్చారు. దానిని బాల వివేకకల్పతరువుగా రూపొందించారు. అందుకనే అప్పటిదాకా బాలశిక్షగా ప్రచారంలోవున్న పుస్తకం పెద్ద బాలశిక్షగా కొత్త పేరును దాల్చింది. ఈ పెద్ద బాలశిక్ష ఇందులో విషయపరిజ్ఞానికి - అంటే భాషాసంస్కృతులకు కావాల్సిన పునాదిరాళ్ళనదగిన భాషా విషయాలు - అక్షరాలు, గుణింతాలు వత్తులు, సరళమైన పదాలు- రెండు మూడు నాలుగు అక్షరాలతో కూడిన మాటలు, తేలిక వాక్యాలు - నీతి వాక్యాలు, ప్రాస వాక్యాలు, సంప్రదాయ సంస్కృతికి సంబంధించినవీ, అందరూ తెలుసుకోదగ్గవీ నాటికి తెలిసిన చారిత్రక, భౌగోళిక, విజ్ఞాన సంబంధ విషయాలను రూఢి వాచకాలను ఈ పుస్తకం ఆది స్వరూపంలోనే ఆనాడు పూదూరువారు పొందుపరచారు.

                                     

2. ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం

లక్ష్మణరావు సాహితీ జీవితంలో మిగిలినవన్నీ ఒకయెత్తు, విజ్ఞాన సర్వస్వం ఒక్కటీ ఒకయెత్తు. ప్రపంచ విజ్ఞానాన్ని తెలుగువారందరికీ పంచిపెట్టాలని ఆయన తపించిపోయాడు. బ్రిటిష్ ఎన్సైక్లోపీడియా తరహాలో ఆంధ్ర విజ్ఞాన సర్వస్వాన్ని వెలువరించాలనేది ఆయన ప్రబల వాంఛ. 1912-13 కాలంలో ఈ బృహత్కార్యానికి పూనుకొన్నాడు. తాను ప్రధాన సంపాదకునిగానే కాదు, ప్రధాన రచయితగా కూడా పనిచేశాడు. లక్ష్మణరావుకు అనేక శాస్త్ర విషయాలలో ప్రవేశం ఉండేది. స్వయంగా పండితుడే గాక నిష్పాక్షిక పరిశోధన, సమతుల్యత ఆయన స్వభావాలు. ఎందరెందరో మహనీయులు ఆయనకు తోడుగా శ్రమించినా, లక్ష్మణరావు రాసినన్ని వ్యాసాలు ఇంకెవరూ రాయలేదు. ఏ విధమైన సంపదా, ధన సహాయమూ, ప్రభుత్వాదరణా లేకుండానే అంత బ్రహ్మాండమైన ప్రయత్నాన్ని తలకెత్తుకొన్నాడు.

గాడిచర్ల హరిసర్వోత్తమరావు, ఆచంట లక్ష్మీపతి, మల్లంపల్లి సోమశేఖర శర్మ, రాయప్రోలు సుబ్బారావు వంటివారు ఆయనకు తోడు నిలిచారు. ఒక్కరోజు కూడా విడవకుండా లక్ష్మణరావు, హరిసర్వోత్తమరావు మద్రాసు కన్నెమెరా గ్రంథాలయానికి వెళ్ళి, అది మూసేంతవరకు ఉండి, కుప్పలు తెప్పలుగా ఉన్న పుస్తకాలనుండి సమాచారం సేకరించేవారు.

అలాగని వారి రచనలు అనువాదాలకు పరిమితం కాలేదు. లక్ష్మణరావే ఒక విజ్ఞాన సర్వస్వం. ప్రతివిషయాన్ని కూలంకషంగా పరిశోధించి, సమగ్రమైన స్వతంత్ర వ్యాసంగా వ్రాసేవాడు. మొదట అకారాదిగా నెలకు నూరు పేజీల చొప్పున దీనిని వెలువరించారు. రేయింబవళ్ళు శ్రమించి, మూడు సంపుటములు ప్రచురించారు. ఇందులో సైన్సు, భాష, ఖగోళశాస్త్రము, చరిత్ర, కళ వంటి వివిధ విషయాలపై ఉన్న నూరు వ్యాసాలలో ఆయన స్వయంగా 40 వ్యాసాలను కూర్చాడు. అధర్వవేదం, అద్వైతం, అభిజ్ఞాన శాకుంతలం, అలంకారాలు, అష్టాదశ మహాపురాణాలు, అట్ట బైండు, అష్టాధ్యాయి వంటి ఎన్నో వైవిధ్యమైన విషయాలపై ఆయన వ్యాసాలు రాశాడు.

"అ"కారంతో మూడు సంపుటాలు పూర్తిచేసిన తరువాత "ఆంధ్ర" సంపుటాన్ని తయారుచేయడం కోసం పూనుకొన్నాడు. తెలుగువారి గురించి అప్పటికి జరిగిన పరిశోధన అత్యల్పం. కనుక మౌలిక పరిశోధన అవుసరమైంది. లక్ష్మణరావు రాత్రింబవళ్ళు శిలాశాసనాలు, ఇతర గ్రంథాలు పరిశోధనలో గడిపాడు. ఆ సమయంలో ఆయనకు ఉబ్బసం వ్యాధి ఉధృతమైంది. మదనపల్లెలో కొంతకాలం విశ్రాంతి తీసుకొని మళ్ళీ మద్రాసు వచ్చాడు. ఆంధ్ర సంపుటం రాయడానికి శాసనాలు పరిశీలిస్తూనే 1923 జూలై 12న లక్ష్మణరావు మరణించాడు.

అలా ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం "అ"కారం మూడు సంపుటాలతో ఆగిపోయింది. ఆ రోజుల్లో విజ్ఞాన సర్వస్వం అంత చక్కని ముద్రణ, అంత చక్కని కాగితం, చిత్రాలు, పటాలు భారతదేశంలో ఏ ప్రచురిత గ్రంథాలోను కనిపించలేదట. చేసిన ప్రతిపనిని పరిపూర్ణంగా చేయడం ఆయన అలవాటు. తర్వాత కాశీనాధుని నాగేశ్వరరావు మరింత మంది పండితుల సహకారంతో తిరిగి అకార పరంపరనే రెండు ముచ్చటైన సంపుటాలలో ప్రచురించాడు.

                                     

3. తెలుగు భాషా సమితి వారి విజ్ఞాన సర్వస్వం

1947లో చెన్నయిలో ప్రారంభమైన తెలుగు భాషా సమితి బెజవాడ గోపాలరెడ్డి అధ్యక్షతన ఆంధ్రవిజ్ఞాన సర్వస్వము కార్యక్రమాన్ని కొనసాగించి, అకారాది క్రమంలో కాక విషయానుక్రమంగా రూపకల్పన చేసింది. ఆ తరువాత హైదరాబాదునుండి పనిచేసి 14 కోశాల విజ్ఞాన సర్వస్వమును ప్రచురించింది. 1986 అక్టోబరు 15 లో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయములో భాగమై ఇప్పుడు కొమర్రాజు వెంకట లక్ష్మణరావు విజ్ఞాన సర్వస్వ కేంద్రము అని పిలవబడుతున్నది. క్రింద ఇవ్వబడిన శీర్షికలకు, దగ్గరి సంబంధమున్నతెలుగు వికీపీడియా వ్యాసాల లింకులు ఇవ్వబడినవి.

 • విశ్వసాహితి
 • లలిత కళలు
 • భారత భారతీ
 • అభియాంత్రికత, సాంకేతికం? Engineering and Technology
 • సాంఘిక శాస్త్రములు
 • తెలుగు సంస్కృతి సంపుటి-II
 • తెలుగు సంస్కృతి సంపుటి-I
 • జీవ శాస్త్రములు
 • గణిత ఖగోళ శాస్త్రంలు
 • న్యాయ పరిపాలనా శాస్త్రంలు
 • మతములు- దర్శనములు
                                     

4. తెలుగు వికీపీడియా

ప్రధాన వ్యాసం: తెలుగు వికీపీడియా

2001 లో మొట్టమొదటగా ఆంగ్ల భాషలో వికీపీడియాను జిమ్మీ వేల్స్, లారీ సాంగెర్ ఆరంభించారు. దీని ముఖ్య ఊహ, స్వచ్ఛందంగా ఎవరికి వారు తమకు తెలిసిన సమాచారాన్ని ఒక చోట చేర్చగలగటం మరియుమార్చగలగటం. పలువురి ఆదరాభిమానాన్ని చూరగొని విజయవంతంగా నడక సాగించి, ప్రజాదరణ పొందిన వెబ్సైటులలో 7 వ స్థానంలోకి వచ్చింది. ప్రపంచ నలుమూలల నుండి సమాచారం సేకరించడం భద్రపరచడం సాధ్యమైన కార్యమేనని రుజువు కావడంతో తరువాతి దశలలో ప్రపంచ భాషలన్నిటిలో ఆయా భాషాభిమానుల కృషితో వికీపీడియా అనే విజ్ఞాన సర్వస్వం అభివృద్ధి పధంలో నడవటం మొదలైంది. దానిలో ఒక భాగమే తెలుగు వికీపీడియా ఆవిర్భావం. వెన్న నాగార్జున ద్వారా తెవికీ 2003 డిసెంబర్ 9న ఆవిర్భవించింది. నిరంతర కృషి వలన తెవికీ దినదిన ప్రవర్థమానమవుతూ వచ్చింది. ప్రస్తుతం తెలుగు వికీపీడియా ప్రస్తుత సభ్యుల సంఖ్య 1.03.921, వ్యాసాల సంఖ్య 70.793. ప్రధాన వర్గాలు:ఆంధ్ర ప్రదేశ్, భాష, సంస్కృతి, భారత దేశము, ప్రపంచము, విజ్ఞానము, మరియుసాంకేతికం

                                     

5. తెలుగువారి సంపూర్ణ పెద్దబాలశిక్ష

గాజుల సత్యన్నారాయణ రాసిన "తెలుగువారి సంపూర్ణ పెద్దబాలశిక్ష" మొదటిసారిగా జనవరి 2004లో అన్నపూర్ణ పబ్లిషర్స్ విడుదల చేశారు. ఇది అత్యంత ప్రజాదరణ పొందింది. కేవలం 116 రూపాయలు విలువతో భాష విజ్ఞానము, సంస్కృతి సంప్రదాయం, బాలానందం, శతక, నీతికథా, సంఖ్య శాస్త్రము, ఆధ్యాత్మిక, కంప్యూటర్, గణిత శాస్త్ర, విజ్ఞాన, వాస్తు, పంచాంగమ, మహిళ, ఆరోగ్యం, క్రీడారంగము, ఆంధ్రప్రదేశ్, భారతదేశం, ప్రపంచం అనే 18 పర్వాలతో 1000 పైగా పేజీలతో ఒకే ఒక కోశంగా ముద్రితమైంది.

                                               

సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము

సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము తెలుగు భాషలో ప్రచురించబడిన విజ్ఞాన సర్వస్వము. దీనిని సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశ సమితి, హైదరాబాదు ప్రచురించినది. దీని సంపాదకవర్గానికి అధ్యక్షులుగా ప్రముఖ విద్యావేత్త మామిడిపూడి వెంకటరంగయ్య గారు వ్యవహరించారు. మూడవ సంపుటము ఆరవ సంపుటము 723 పేజీలు: 1969. నాలుగవ సంపుటము 784 పేజీలు: 1964. మొదటి సంపుటము అ-ఆర్ష 906 పేజీలు: 1958. అయిదవ సంపుటము 758 పేజీలు: 1966. రెండవ సంపుటము 887 పేజీలు: 1960.

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →