Back

ⓘ ప్రకృతి వైద్యము                                               

స్వలింగ సంపర్కం

స్వలింగ సంపర్కము అనగా ఇద్దరు పురుషుల మధ్య లేదా ఇద్దరు స్త్రీల మధ్య ఉండే లైంగిక సంబంధము. ఈ లైంగిక సంబంధము సృష్టి విరుద్ధమని అందరూ భావిస్తారు. కానీ, ఇది సృష్టికి విరుద్ధమేమీ కాదని, ప్రాకృతికమేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ తేల్చి చెప్పింది. వైద్య శాస్తం ప్రకారం కూడా స్వలింగ సంపర్కము ఒక మానసిక వ్యాధియో, లేక జన్యుపరమైన లోపమో కాదని, లైంగికతలో ఒక భిన్నమైన కోణంగా దీనిని పరిగణించాలని American Psychological Association, American Psychiatric Association, American Academy of Pediatrics మొదలగు ప్రపంచ ప్రఖ్యాత సంస్థలు నిర్ధారించాయి. ఇటీవల దీనిని Indian Psychiatric Society కూడా ఆమోదించింది. భారతీయ శిక్షాస్మృతి ...

                                               

యోగా

యోగా అంటే వ్యాయామ సాధనల సమాహారాల ఆధ్యాత్మిక రూపం. ఇది హిందూత్వ అధ్యాత్మిక సాధనలలో ఒక భాగం. మోక్షసాధనలో భాగమైన ధ్యానం అంతఃదృష్టి, పరమానంద ప్రాప్తి లాంటి అధ్యాత్మిక పరమైన సాధనలకు పునాది. దీనిని సాధన చేసే వాళ్ళను యోగులు అంటారు. వీరు సాధారణ సంఘ జీవితానికి దూరంగా మునులు సన్యాసులవలె అడవులలో ఆశ్రమ జీవితం గడుపుతూ సాధన శిక్షణ లాంటివి నిర్వహిస్తుంటారు. ధ్యానయోగం ఆధ్యాత్మిక సాధనకు మానసిక ఆరోగ్యానికి చక్కగా తోడ్పడుతుంది. హఠయోగములో భాగమైన శారీరకమైన ఆసనాలు శరీరారోగ్యానికి తోడ్పడి ఔషధాల వాడకాన్ని తగ్గించి దేహధారుడ్యాన్ని, ముఖ వర్చస్సుని ఇనుమడింప చేస్తుంది. బుద్ధమతం, జైనమతం, సిక్కుమతం మొదలైన ధార్మిక మతాలల ...

                                               

గసగసాలు

పండ్లు, కాయగూరలు, గింజలు, పప్పులు, కందమూలాలు, సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రకృతి ప్రసాదించిన అపురూపమైన వరము.ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలుగా తెలుసును. అన్నంతో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు, కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారంగా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి. ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు, శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్క ...

                                               

హోమియోపతీ వైద్య విధానం

హోమియోపతీ ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యంలో ఉన్న ఒక వైద్య పద్ధతి; ముఖ్యంగా భారత దేశంలో దీనికి లభిస్తున్న ప్రజాదరణ, ఆ కారణంగా అది పొందే ప్రభుత్వాదరణ, ప్రపంచంలో మరెక్కడా అది పొందుటలేదనుట అతిశయోక్తి కాదు. ఈ పద్ధతి దరిదాపు రెండు వందల ఏళ్ళనుంచి వాడుకలో ఉన్నప్పటికీ, దీనికి శాస్త్రీయమైన పునాదులు లేవనే నింద ఒక చెరగని మచ్చలా ఉండిపోయింది. ఆధునిక శాస్త్రీయ దృక్పధంతో చూస్తే ఈ నిందారోపణ సబబయినదే అనిపించవచ్చు. కాని హోమియోపతీ వైద్యం వల్ల వ్యాధి నయమైన వారు ముందుకు వచ్చి ఇచ్చే సాక్ష్యం సంగతి ఏమిటని ప్రతి సవాలు చేసేవారూ ఉన్నారు. హానిమన్ హోమియోపతీ వైద్యం ముఖ్యం గా మూడు అంశాలు పై ఆధారపడి ఉంది. అవి 1. ఆర్గనాన్ హోమ ...

                                               

సుగంధతైలచికిత్స

సువాసనలు మనసును ఉత్తేజభతం చేయడామే కాక మనసు వత్తిడి తగ్గిస్తాయి. సువాసన తైలాల మర్ధన ఒక వైద్య విధానంగా ఆఅధునిక కాలంలో ఉపయోగపడుతోంది. దీనిని ఆంగ్లభాషలో అరోమాథెరఫీ అంటారు. నిజానికి ఇది వ్యాధిని నిజంగా నయం చెయ్యదు. ఈ వైద్యం మనసుకు ఆనందం కలిగించే ఎండార్ఫిన్లు అనే రసాయనాలు విడుదల చేస్తుంది. తత్ఫలితంగా వ్యాధి నిరోధకాన్ని కలిగించి, అనేక వ్యాధులకు మూలకారణమౌతున్న ప్రీ రాడికల్స్ పెరగకుండా చేస్తుంది. వ్యాధి నిరోధకమైన ఏంటీ ఆక్సి డెంట్లను విడుదల చేయడానికి సహకరిస్తుంది.

                                     

ⓘ ప్రకృతి వైద్యము

ఆరోగ్య జీవన విధానమే ప్రకృతి వైద్యము. మనము ఎలా జీవించాలి, ఏమి తినాలి అనేది తెలుపుతుంది. దీని ముఖ్యోద్ధేశం ప్రజలలో అరోగ్యకరమైన జీవన అలవాట్లని పెంపొందించడమే.

దీని ప్రకారం, మానవ శరీరం పంచ భూతాలు అనగా భూమి, గాలి, నీరు, అగ్ని, ఆకాశంతో ఎర్పడింది. భూమి శరీరంలోని ఘన భాగాలు అనగా ఎముకలను సూచిస్తుంది. నీరు ద్రవరూపంలోని రక్తం మరి ఇతర రసాలను సూచిస్తుంది. గాలి శ్వాసకి ఆధారం. అగ్ని శక్తిని, ఆకాశం ఆత్మని సూచిస్తుంది. వీటిలో సమతూలనం లేకపోతే అనారోగ్యం కలుగుతుంది.

పకృతి అత్యుత్తమ వైద్యుడు. శరీరానికి రోగాన్ని నిరోధించడం, రోగం నుండి విముక్తి కలిగించే శక్తి ఉంది. ఒక అవయవానికి లేక రోగానికి చికిత్స కాకుండా మనిషి యొక్క పూర్తి ఆరోగ్యం దృష్టి ఈ పద్ధతిలో ఉంది. ఆహారం, పంచభూతాల చికిత్స తప్ప ఇంక వేరే మందులు వుండవు.

                                     

1. మూల సూత్రం

ప్రకృతివైద్య సిద్ధాంతాలు "ప్రకృతికి గల నివారణశక్తిని" నమ్ముతూ సహజంగా ఉండే, తక్కువ ఇబ్బందికర పద్ధతుల పైన దృష్టిసారిస్తాయి. "సంయోజిత" ఔషధం, అణుధార్మికత, పెద్ద శస్త్రచికిత్సల వంటి చికిత్సలు ఉండవు, జీవ ఔషధాల మరియు ఆధునికశాస్త్ర పద్ధతులని వదిలివేసి దేహం,ప్రకృతిల వైవిధ్యమైన కలయికని ప్రోత్సహిస్తారు. ఒత్తిడి నివారణ,ఆరోగ్యకరమైన ఆహారపుటలవాట్లు మరియు జీవనవిధానం ద్వారా నివారణ కలిగించడాన్ని ఉద్ఘాటిస్తారు. ప్రకృతివైద్య అభ్యాస తత్వం ఆరు మూలాంశ విలువల ద్వారా వివరించవచ్చు. ప్రకృతివైద్యుని ప్రమాణంలో భిన్నవిధాలు మనుగడలో ఉన్నాయి, వివిధ కళాశాలల లేదా ప్రొఫెషనల్ సంఘాల ద్వారా ప్రచురించబడిన అనేక మిషన్ స్టేట్మెంట్స్,క్రమశిక్షణ సంఘాల ద్వారా ప్రచురితమైన నీతి నడవడికకు సంబంధించిన సూచనలు వీటిలో ఉన్నాయి.

మొదట హాని చెయ్యవద్దు; అత్యంత ప్రభావవంతమైన అతి తక్కువ నష్టాన్ని కలిగించగల ఆరోగ్య చికిత్సలను అందించాలి ప్రతి మనిషిలో అనువంశికంగా ఉన్న ప్రకృతి యొక్క స్వయం నివారణ శక్తిని గుర్తించు,గౌరవించు,ప్రోత్సహించు. లక్షణాలని అణచివేసి,తొలగించే కంటే రోగం యొక్క కారణాన్ని గుర్తించి తొలగించాలి. హేతుబద్ధమైన ఆశని నేర్పించి స్ఫూర్తినివ్వాలి,ఆరోగ్యానికి సంబంధించి స్వయం బాధ్యతని ప్రోత్సహించాలి. ప్రతివ్యక్తిని అతని వ్యక్తిగత ఆరోగ్య కారణాలని,ప్రభావాలని దృష్టిలో ఉంచుకొని చికిత్స చెయ్యాలి. ఆరోగ్య పరిస్థితిని ఉద్ఘాటించి ఆరోగ్యంగా ఉండేలా ప్రోత్సహించి ప్రతి వ్యక్తి,సమూహం,మన ప్రపంచపు వ్యాధులని నివారించాలి.

                                     

2. మర్ధన

ఇది మనస్సుకి శరీరానికి వరం. రక్త ప్రవాహం పెంచి శరీరం రంగు మెరుగు చేస్తుంది. నొప్పిని తగ్గించటానికి, కొవ్వు కరిగించటానికి, కండరాలకు బలం చేకూర్చడానికి ఇది తోడ్పడుతుంది.

                                     

3. నీటి చికిత్స

నీటిని, వివిధ ఒత్తిడి లేక వేడితో వాడి చికిత్స చేస్తారు. రకరకాల స్నానాలు, నీటితో ఎనీమా వివిధ రకాలు.

                                     

4. మన్ను చికిత్స

మన్ను శరీరంనుండి విష పదార్ధాలను గ్రహించి, చల్ల దనము కలుగచేస్తుంది. మన్నుతో స్నానం, మన్ను సంచి దీనిలో రకాలు. కొన్ని సూక్ష్మ జీవులకు చంపే శక్తి కూడా మన్నుకి ఉంది. చర్మ వ్యాధులు, జీర్ణ వ్యాధులు, అలెర్జీలకు బాగా పనిచేస్తుంది.

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →