Back

ⓘ విక్షనరీ                                               

మాస్కో

మాస్కో రష్యా దేశపు రాజధాని, ఆ దేశపు ముఖ్య వనరులకు కేంద్రము. మొస్కావా నదిని ఆనుకొని ఉంది. ఒక కోటి నాలుగు లక్షల మంది ప్రజలతో ఐరోపా ఖండములోనే అతి పెద్ద జనాభా గల నగరము, 7 శాతం రష్యా దేశపు జనాభాకు నివాస స్థలము. పూర్వపు సోవియట్ యూనియన్కు రాజధాని.

                                               

టెన్నిసు

టెన్నిస్ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన క్రీడ. దీనిని సాధారణంగా ఇద్దరు ఆటగాళ్ళు ఆడుతారు. కానీ కొన్ని పోటీలలో ఇద్దరు ఆటగాళ్ళు ఒక జట్టుగా కూడా ఆడుతారు.

                                               

జుడాయిజం

యూదియా మతము లేదా యూదు మతము హిబ్రూ: יהודה) యెహూదా, "యూదా"; హిబ్రూ భాషలో: יַהֲדוּת, యహెదుత్) ఇది యూదుల మతము, దీనికి మూలం హిబ్రూ బైబిల్. 2007 నాటికి ప్రపంచంలో యూదుల జనాభా 1 కోటి 32 లక్షలు. ఈ జనాభాలో 41% ఇస్రాయెల్ లోనూ 59% ప్రపంచమంతటా వ్యాపించియున్నారు. అతి పురాతన మతములలొ యూదు మతము కూడా ఒకటి. విగ్రహారాధనని నిషిధ్దము చేసిన మతములలో యూదు మతము ఒకటి.వీరి పవిత్ర గ్రంథం తోరాహ్. వీరి మత స్తాపకుడు మూసా ప్రవక్త. యూదుల ప్రార్థనా మందిరాన్ని సినగాగ్ అంటారు.

                                               

బీజింగ్

బీజింగ్ పూర్వపు పేరు పెకింగ్ చైనా లోని ఒక మెట్రోపాలిటన్ నగరం, రాజధాని. చైనా నాలుగు ప్రాచీన చైనా రాజధానులులలో బీజింగ్ ఒకటి. బీజింగ్, చైనాలో షాంఘై తరువాత రెండవ పెద్ద నగరం.

                                               

కైరో

కైరో, దీనర్థం విజయుడు. ఇది ఈజిప్టు రాజధాని. ఈజిప్టులో ఇదే పెద్ద నగరం. అరబ్ ప్రపంచంలోనే అతి పెద్ద నగరం. ఈజిప్టుకు అధికారిక నామం అల్-మస్ర్ లేదా అల్-మిస్ర్. ఫాతిమిద్ ఖలీఫాలు దీనిని తమ రాజధానిగా వుంచారు.

                                               

ఇస్తాంబుల్

ఇస్తాంబుల్ ; యూరప్ లోని అధిక జనసాంద్రత గల నగరం, ప్రపంచంలో 4 నాలుగవ అత్యధిక జనాభా గల నగరం. టర్కీ యొక్క అతి పెద్ద నగరం, సాంస్కృతిక, వాణిజ్య కేంద్రం. ఇస్తాంబుల్ రాష్ట్రం కూడా, ఇందులో 27 జిల్లాలు ఉన్నాయి. టర్కీకు వాయ్యువ్యదిశలో, ఇది బోస్ఫొరస్ జలసంధి లోగల ప్రకృతిసిధ్ధమైన ఓడరేవు, దీనిని గోల్డన్ హార్న్ అని కూడా అంటారు. యూరప్, ఆసియా ఖండాల మధ్య గల నగరం, ఇదో విశేషం. దీని సుదీర్ఘ చరిత్రలో 330-395 వరకు రోమన్ సామ్రాజ్యపు రాజధానిగాను, 395-1204 వరకు బైజాంటియన్ సామ్రాజ్యపు రాజధానిగాను, 1204-1261 వరకు లాటిన్ సామ్రాజ్యపు రాజధానిగాను, 1453-1922 వరకు ఉస్మానియా సామ్రాజ్యపు రాజధాని గాను వుండినది. ఈ నగరం 2010 కొ ...

                                               

క్రియేటివ్ కామన్స్

క్రియేటివ్ కామన్స్ అమెరికాకు చెందిన ఒక లాభాపేక్షలేని సంస్థ. సృజనాత్మక రచనలను ప్రోత్సహించి వాటిని మరింతమందికి చేరేలా చట్టబద్ధమైన వెసులుబాటు కల్పించడం ఈ సంస్థ చేస్తున్న ముఖ్యమైన పని. ఈ సంస్థ పలు కాపీరైట్ సంబంధిత లైసెన్సులను జనసామాన్యానికి ఉచితంగా అందుబాటులో తెచ్చింది. ఈ లైసెన్సులను వాడి రచయితలు వారి కృతులపై కొన్ని హక్కులను సడలించి సాధారణ జనాలకు అందుబాటులోకి తేవచ్చును. ఏ హక్కులను సాధారణ ప్రజలకోసం సడలిస్తున్నారో, ఏ హక్కులను తమ వద్దనే ఉంచేసుకుంటున్నారో వేరు వేరుగా తెలపవచ్చు. ఈ విషయాలను తెలిపేందుకు విశేష చిహ్నాలతో కూడిన బొమ్మలు లేదా ఆయా హక్కులను తెలిపే పొడి అక్షరాలను వాడవచ్చు. క్రియేటివ్ కామన్స్ ...

                                               

లాహోర్

లాహోర్ Lahore మాట్లాడుతారు. 2006 లో ఈ నగర జనాభా ఒక కోటిని దాటింది. దక్షిణాసియాలో ఐదవ పెద్ద నగరంగానూ, ప్రపంచంలో 23వ నగరం గానూ స్థానం పొందింది. "సారే జహాఁ సే అచ్ఛా హిందూస్తాఁ హమారా" గేయ రచయిత ఇక్బాల్ లాహోర్ కు చెందిన వాడే.

                                               

ఢాకా

ఢాకా (బెంగాలీ: ঢাকা, బంగ్లాదేశ్ రాజధాని, ఢాకా జిల్లా ప్రధాన నగరం. ఢాకా ఒక మహా నగరం, దక్షిణాసియా లోని పెద్ద నగరాలలో ఒకటి. బురిగంగా నది ఒడ్డున గలదు, ఈ నగర జనాభా కోటీ ఇరవై లక్షలు, బంగ్లాదేశ్‌లో అత్యంత జనాభాగల నగరం. దీని సాంస్కృతిక చరిత్రను చూసి, దీనికి "మసీదుల నగరం" అని పిలుస్తారు. ఇక్కడ తయారయ్యే ముస్లిన్ బట్టలు వీటి నాణ్యతకు ప్రఖ్యాతి గాంచినవి. 17వ శతాబ్దంమొఘల్ సామ్రాజ్యం కాలంలో, ఈ నగరానికి జహాంగీర్ నగర్ అని పేరు, ఇది ఒక ప్రాంతీయ రాజధాని, ప్రపంచవ్యాప్తంగా మస్లిన్ వర్తక కేంద్రం. 19వ శతాబ్దం బ్రిటిష్ కాలంలో నేటి నగరం అభివృద్ధి చెందినది. బెంగాల్ లో కోల్కతా తరువాత రెండవ అతిపెద్ద నగరంగా అభివృద్ధి ...

                                               

నెప్ట్యూన్

నెప్ట్యూన్ Neptune సౌరమండలములో సూర్యుని నుండి 8వ దూరమైన గ్రహం. ప్రస్తుతానికి ఇదే ఆఖరు గ్రహమని అనవచ్చును. సౌరమండలములో వ్యాసం ప్రకారం చూస్తే నాలుగవ పెద్ద గ్రహం, బరువులో చూస్తే 3వ అతిపెద్ద గ్రహం. ఇది భూమికంటే 17 రెట్లు బరువెక్కువ, యురేనస్ కన్నా కొద్ది బరువెక్కువ. రోమన్ సముద్ర దేవతైన నెప్చూన్ పేరు దీనికి పెట్టారు. దీనిని సెప్టెంబరు 23, 1846న, కనుగొన్నారు. నెప్ట్యూన్ ను అంతరిక్ష నౌక వోయెజర్ 2 ఆగస్టు 25, 1989 న సందర్శించింది.

                                               

బిస్మార్క్

Otto Eduard Leopold von Bismarck. బిస్మార్క్ జర్మనీ ఏకీకరణలో ప్రముఖ పాత్ర పోషించిన ప్రముఖ కూలీన వర్గానికి చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు. ఇతను స్వతంత్ర జర్మనీకి మొట్టమొదటి చాన్సలర్ గా ఎన్నికైనాడు. 1862 to 1890 వరకు ప్రష్యా ప్రధాన మంత్రిగా కొనసాగాడు. బిస్మార్క్ ప్రజాస్వామ్య వ్యవస్థను కాకుండా రాజరిక ప్రభుత్వమే సరైన పాలనని భావించేవాడు. ఇతను జర్మనీని ఏకీకరణ చేసి ప్రష్యాను మరింత బలమైన రాజ్యంగా ఏర్పరచాలని భావించేవాడు. అతని కాలంలో సామ్యవాద శక్తులు చేసే ఉద్యమాలను నియంత్రించి కాథలిక్ చర్చి యొక్క తగ్గించాలని భావించాడు. తన హయాంలో ప్రజల కొరకు ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టాడు. ప్రజా ఆరోగ్య, ప్రమాద భీ ...

                                               

వికీ

వికీ అనేది ఒక రకమైన వెబ్‌సైట్. వికీలో ఎవరైనా దాని యొక్క పేజీలను సృష్టించవచ్చు మార్చవచ్చు. వికీ అనే పదం వికీవికీవెబ్ అనే పదానికి ఉపయోగించే సంక్షిప్త పదం. వికీవికీ అనేది హవాయి భాష నుండి వచ్చిన పదం, దీని అర్థం "ఫాస్ట్" లేదా "స్పీడ్". వికీలకు ఉదాహరణలు వికీపీడియా, విక్షనరీ, వికీబుక్, సిటిజెండియం కన్జర్వేపీడియా. ప్రతి వికీని వికీలో ఖాతా ఉన్న ఎవరైనా మార్చవచ్చు లేదా సవరించవచ్చు లేదా వికీ అనుమతించినట్లయితే ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ చేయవచ్చు. కొన్ని ముఖ్యమైన పేజీలను కొంతమంది వినియోగదారులు మాత్రమే మార్చగలరు. వికీలు మనమందరం సమాచారాన్ని పంచుకోగల కేంద్ర ప్రదేశాలు, ప్రజలు క్రొత్త సమాచారాన్ని జోడించవచ్చు, ...

విక్షనరీ
                                     

ⓘ విక్షనరీ

విక్షనరీ, వికీపీడియా యొక్క సోదర వెబ్ సైట్. ఈ పదం వికి, డిక్షనరి పదాలను కలుపగా తయారయ్యినది. ఇది తెలుగు పదాలను వివిధమైన వ్యాకరణ, వాడుక, నానార్ధ, వ్యతిరేఖార్థ లాంటి వివరణలతో నిక్షిప్తం చేసే మాధ్యమము. అయితే పుస్తక రూపంలో వుండే నిఘంటువులు మహా అయితే మూడు భాషలలో వుంటాయి. దీనిలో తెలుగు-తెలుగు, ఇంగ్లీషు-తెలుగుతో పాటు ఇతర విక్షనరీలోని సమాన అర్థం గల పదాలకు లింకులుండటంవలన, మీకు ప్రపంచంలోని వికీ భాషలన్నిటిలో సమాన అర్థంగల పదాలను తెలుసుకునే వీలుండటంతో, దీనిని బహుభాష నిఘంటువుగా పేర్కొనవచ్చు. తెలుగు వికీపీడియాలో లాగా, ఇందులో ఎవరైనా తెలుగు పదాలకు పేజీలను సృష్టించవచ్చు లేక మార్పులు చేయవచ్చు.

జులై 2005 లో ప్రారంభమైన తెలుగు విక్షనరీ, 34.751 పదాల పేజీలకు 2010 సెప్టెంబరు 17 న విస్తరించింది. ఆగస్టు-అక్టోబరు 2007 మధ్యకాలంలోలో మాకినేని ప్రదీప్ కృషితో బ్రౌణ్య నిఘంటువుని సుమారు 32.000 పదాలు చేర్చుకొంది.

                                     

1. విక్షనరీలో పనిచేసే విధానం

పద ప్రయోగాలు

ఇక్కడ పదాన్ని వాక్యాలలో, పద్య పాదాలలో, పాదాలలో, జానపదాలతో, సామెతలతో ప్రయోగిస్తూ ఉదహరించాలి.

వర్గాలు

పదం ఏ వర్గంలో చేరుతుందో వ్రాయాలి. ఉదా: కంప్యూటర్, మీట లాంటి పదాలను సమాచార సాంకేతిక పదాలు వర్గంలో చేర్చితే, సమాచార సాంకేతిక పదకోశం తయారీలో సహాయంగా వుంటుంది.

                                     

1.1. విక్షనరీలో పనిచేసే విధానం వ్యాకరణ విశేషాలు

దీనిలో భాషా భాగం, వ్యుత్పత్తి, వచనం వుంటాయి. వ్యాకరణ ఉప విభాగంలో పదం విభక్తి లేక లింగము లేక నామవాచకమో విశేషణం లేక ఇలా ఆపదం ఏ వ్యాకరణ విభాగానికి చెందినదో వ్రాయాలి. వ్యుత్పత్తి ఉప విభాగంలో పదం యొక్క మూల రూపము దాని మార్పులు ఇవ్వాలి. సాధారణంగా మాతృ భాషా పదాలకు మూలాలు భాషా పండితులు కానివారికి మూలాలు అంత సులభంగా తెలియవు. సరైన వనరులు భాషా పుస్తకాలు సంప్రదించి రాయవచ్చు. బహువచనము లేఏక వచనము అనే విభాగంలో ఆ పదము యొక్క వచన రూపం వ్రాయాలి.

                                     

1.2. విక్షనరీలో పనిచేసే విధానం పదాలు

దీనిలో నానార్ధాలు, సంబంధిత పదాలు, వ్యతిరేక పదాలు ఉంటాయి. నానా అర్ధాలులో పదానికి ఉండే ఇతర అర్ధాలు సమాన అర్ధాలు వ్రాయాలి. సంబంధిత పదాలులో ఆ పదానికి సంబంధించిన పదాలు వ్రాయాలి. వ్యతిరేక పదానికి ఆ పదానికి ఉండే వ్యతిరేక పదం వ్రాయాలి. నానార్ధాలు ఉపవిభాగంలో ఇతర సమానార్ధాలు వ్రాయాలి. ఇందులో ప్రాంతీయ, మాండలికాల భిన్న రూప పదాలు వ్రాయ వచ్చు. కూడా వ్రాయవచ్చు. ఉదా;- కోస్తా ప్రాంతంలో ప్రాంతంలో చిన్న బిడ్డ, పసి బిడ్డ అనేది కొంచం పడమట తెలుగు ప్రదేశాలలో సన్న బిడ్డ అంటారు. అలాంటివి నానార్ధాలులో పేర్కొన వచ్చు. అలాగే పదానికి వివిధ విభక్తి రూపాలు, వివిధ విశేషణ రూపాలు పేర్కొన వచ్చు. ఉదా: రాముడు, రాముడితో, రాముని, రాముడి వలన, రాముడే, రాముడి వంటి, రామునిలా, రాముడేనా, రాముడా ఇలా ఒకే పదం విభక్తి కారణంగా వివిధ రూపాలు మారుతుంటాయి. వాటిని సంబంధిత పద విభాగంలో పేర్కొన వచ్చు. అలాగే విశేషణం వలన మారే రూపాలు.

                                     

1.3. విక్షనరీలో పనిచేసే విధానం పద ప్రయోగాలు

ఇక్కడ పదాన్ని వాక్యాలలో, పద్య పాదాలలో, పాదాలలో, జానపదాలతో, సామెతలతో ప్రయోగిస్తూ ఉదహరించాలి.

                                     

1.4. విక్షనరీలో పనిచేసే విధానం అనువాదాలు

ఇది సమగ్రంగా తయారైతే ఎక్కువ ఉపయోగంగా వుండే విభాగం. ఇందులో ఆ పదానికి ఇతర భాషలో అర్ధాలు తెలిసిన వారు వాటిని చేర్చ వచ్చు. అర్ధాల ప్రక్కన బ్రాకెట్ లో ఇతర భాషా ఉచ్ఛారణ తెలుగులో వ్రాయాలి. ఇక్కడ దిద్దుబాటులో ఆ భాషలకు లింకులు ముందే తయారుగా ఉంటాయి. వాటి మధ్య ఆ భాషా పదాన్ని వ్రాసినప్పుడు అది నేరుగా అయా భాషలలో ఆ పదం ఉన్న పేజీకి తీసుకు వెళుతుంది. అంతర వికీలు లింకులు బాట్లతో కూడా సృష్టించవచ్చి కాబట్టి ఈ విషయం చర్చ కొనసాగించాల్సి ఉంది.

                                     

1.5. విక్షనరీలో పనిచేసే విధానం మూలాలు వనరులు

ఇక మూలాలు, వనరులు అనగా మీకు ఎక్కడ ఆ పదం అర్ధంతో తారసపడింది తెలపండి. ఉదా: నకలు హక్కులు తీరిపోయిన నిఘంటువులలో, లేక అనుమతి పొందిన తరువాత ఇతర నిఘంటువులలోని వివరాలు చేర్చేటప్పుడు ఆ నిఘంటువు వివరాలను వనరులలో వ్రాయండి.

                                     

1.6. విక్షనరీలో పనిచేసే విధానం వర్గాలు

పదం ఏ వర్గంలో చేరుతుందో వ్రాయాలి. ఉదా: కంప్యూటర్, మీట లాంటి పదాలను సమాచార సాంకేతిక పదాలు వర్గంలో చేర్చితే, సమాచార సాంకేతిక పదకోశం తయారీలో సహాయంగా వుంటుంది.

                                     

1.7. విక్షనరీలో పనిచేసే విధానం ఇతరాలు

చివరిగా ఎడిట్ పేజీలో మీకు అందుబాటులో ఉన్న సాంకేతిక సహాయంతో ఆ పదానికి చిత్రాన్ని చేర్చగలిగితే భాష తెలియని వారికి కూడా పదమేమిటో అర్ధం ఔతుంది. ఇది చాలా ఉపయోగకరం. చిత్రాలు ఇప్పటికే లేక పోతే మీరే వికీలో ప్రవేశ పెట్టి అప్లోడ్ పేజీలో చేర్చ వచ్చు. ఇతర వీకీల నుండి చేర్చ వచ్చు. అయితే సభ్యులు తమకు తెలిసిన ఏ విభాగంలోఅయినా వ్రాయ వచ్చు పూర్తిగా వ్రాయాలన్న నియమం ఏమీ లేదు.

                                     

2. పద సేకరణ

విక్షనరీలో సాధారణంగా నిత్య జీవితంలో మన వాడే పదాలను చేర్చాలి. ప్రస్తుతం వాడుకలో లేని పదాలు మన ఇళ్ళల్లో పెద్ద వారు వాడుతుంటారు వాటిని చేర్చి అర్ధాలను వివరిస్తే మరుగున పడుతున్న పదాలు వెలుగులోకి వస్తాయి. జానపదులలో, పల్లె సీమల్లో కొన్ని చిత్రమైన పదాలు వాడుకలో ఉంటాయి. వాటిని కూడా ఇక్కడ చేర్చ వచ్చు. పల్లె సీమల్లో విభిన్నతలు అధికంగా ఉంటాయి. వాటిని చిత్రాలతో ఉదహరిస్తే బాగుంటుంది. పల్లె పదాల్లో అమాయకత్వం, సహజత్వం ఎక్కువ అటువంటి పదాలను చేర్చ వచ్చు. కుల పరంగా కొన్ని ప్రత్యేక పదాలు ఉంటాయి. వాటిని కూడా చేర్చ వచ్చు. సంస్కృతి, సంప్రదాయాల పరంగా కొన్ని ప్రత్యేక పదాలు ఉంటాయి. వాటినీ చేర్చ వచ్చు. వ్యవసాయానికి సంబంధించి అనేక పదాలు ఉంటాయి వాటినీ చేర్చ వచ్చు. ఇలా విభిన్న పదాలను చేర్చ వచ్చు.వార్తా పత్రికలు, అంతర్జాల అభివృద్ధి వలన కొన్ని కొత్త పదాలు సృష్టింపబడతాయి. వాటిని కూడా పేర్కొన వచ్చు. ఇలా మన పరిసరాలను గమనిస్తే అనేకానేక పదాలు వినిపిస్తాయి. వాటన్నింటినీ ఇక్కడ నిక్షిప్తం చేయవచ్చు.

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →