Back

ⓘ తాత్విక చింతన                                               

విశ్వదర్శనం - భారతీయ చింతన

విశ్వదర్శనం - భారతీయ చింతన నండూరి రామమోహనరావు విశ్వం యొక్క పుట్టుక గురించి భారతీయ తాత్విక చింతన ఎలా సాగిందో వివరించిన పుస్తకం. ఈ పుస్తకం మొదటి సంచిక 1997 జనవరిలో విడుదల కాగా 2003లో రెండవ సంచిక విడుదలయింది. రచయిత ఈ పుస్తకాన్ని శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం మాజీ వైస్ ఛాన్సిలర్ అయిన కొత్త సచ్చిదానందమూర్తికి అంకితమిచ్చాడు.

                                               

ప్రాచీన భారతీయ భౌతికవాదులు

ప్రకృతిని, సమాజాన్ని అర్ధం చేసికోవడానికి తోడ్పడే ఆలోచనావిధానాలలో ఒకటి భౌతికవాదం. భౌతికంగా ఉనికిలో వున్న విషయాలకే ప్రాధాన్యత మిచ్చిన భౌతికవాదులు మానవాతీత శక్తులను, దైవిక శక్తులను తిరస్కరించి మానవుడినే అన్ని కార్యకలాపాలకు కేంద్రంగా ఆలోచించే తాత్వికతను ప్రోత్సాహించారు. భావవాద తత్వంలో కూరుకుపోయిన వైదిక మతం పట్ల నిరసనగా, భావవాదానికి వ్యతిరేకంగా క్రీ. పూ. 6 వ శతాబ్దంలో వైదిక సమాజంలో భౌతికవాదం తలెత్తింది. భారతదేశంలో గౌతమ బుద్ధునికి పూర్వమే భౌతికవాదులు సాంస్కృతిక తిరుగుబాటుకు ప్రేరణ కలిగిస్తూ తమ భౌతికవాదాన్ని ప్రజల్లో ప్రచారం చేస్తూ పర్యటించేవారు. వీరిలో చార్వాకులు, పూర్ణ కాశ్యపుడు, మక్ఖలి గోశాలుడ ...

                                               

రేవూరి శోభాదేవి

రేవూరి శోభాదేవి పద కవితా పితామహుడు అన్నమాచార్య జీవితం, భక్తి తత్వంపై పుస్తకాలు రచించడంతో పాటు ఆధ్యాత్మిక ప్రసంగాలు చేసిన మహిళా సాహితీవేత్త రేవూరి శోభాదేవి. భర్త రేవూరి అనంత పద్మనాభరావు మార్గదర్శకత్వం,ప్రోత్సాహంతో సారస్వత అభిరుచిని మరింత పెంచుకున్న ఆమె తిరుపతి ప్రాంతంలోని అన్నమాచార్య కళాక్షేత్రంలో సంకీర్తనల గాన శిక్షణ పొందారు. కేంద్రప్రభుత్వ నిర్వహణలోని సాంస్కృతిక శాఖ నుంచి సీనియర్ ఫెలోషిప్ సాధించారు.

                                               

ఏటుకూరి బలరామమూర్తి

ఏటుకూరి బలరామమూర్తి మార్క్సిస్టు మేధావి, చరిత్ర రచయిత, జర్నలిస్టు. ఏటుకూరి బలరామమూర్తి నిష్కళంక దేశభక్తుడు, రాష్ట్ర కమ్యూనిస్టు ఉద్యమ ప్రముఖుడు, మార్క్సిస్టు అధ్యయనవేత్త, విశాలాంధ్ర దినపత్రిక, కమ్యూనిజం మాసపత్రికల సంపాదకత్వ బాధ్యతలు నిర్వహించిన బహుముఖ ప్రజ్ఞాశాలి.

                                               

దె కార్త్

దె కార్త్ ఫ్రెంచి తత్వవేత్త. "నేను అలోచిస్తున్నాను, కనుక నేను ఉన్నాను" పాశ్చాత్యుల తత్వ శాస్త్రంలో ఇది సుప్రసిధ్ధమయిన వాక్యం. ఈ వాక్యకారుడు రెని దె కార్త్. పాశ్చాత్యుల తత్వ శాస్త్రాన్ని ఇతడు పూర్తిగా మార్చివేశాడు. కనుకనే ఇతనికి ఆధునిక తత్వశాస్త్ర జనకుడు అని పేరు వచ్చింది. దె కార్త్ రెండు వాదాలకు జనకుడు. ఒకటి - భావ వాదం, రెండు - భౌతిక వాదం. పరస్పర విరుధ్ధమయిన ఈ రెండు వాదాలకూ దె కార్త్ జనకుడు కావటం అతని ప్రత్యేకత.

                                               

కేతువు జ్యోతిషం

కేతువు రాశి చక్రంలో అపసవ్యదిశలో పయనిస్తుంటాడు. అంటే మేషం నుండి మీనానికి ఇలా పయనిస్తుంటాడు. రాశిలో ఒకటిన్నర సంవత్సరకాలం ఉంటాడు. సూర్యుడిని ప్రదిక్షిణం చేయడానికి పద్దెనిమిది సంవత్సరాల కాలం పడుతుంది. రాహువు కేతువులు ఎప్పుడూ ఒకరికి ఒకరు రాశిచక్రం లోని ఏడవ స్థానంలో సంచరిస్తుంటారు. కేతు మహర్దశాకాలం ఏడు సంవత్సరాలు. కేతువు ముక్తి కారకుడు. అశ్విని, మఖ, మూలా నక్షత్రాలకు ఆధిపత్యం వహిస్తాడు. ఈ మూడు నక్షత్రాలలో వారికి పుట్టిన ఆరంభ దశ కేతు దశ. కేతువుకు అవల, శిఖి, ధూమ, ధ్వజ, మృత్యు పుత్ర అనే ఇతర నామాలు ఉన్నాయి. కేతువు పురుష గ్రహము. గ్రహ స్వభావం పాప గ్రహం, తత్వం వైరాగ్యము, స్వభావం క్రూర స్వభావం, గుణం తమోగ ...

                                               

త్రిపురనేని గోపీచంద్

త్రిపురనేని గోపీచంద్ సంపూర్ణ మానవతావాది, తెలుగు రచయిత, హేతువాది, సాహితీవేత్త, తెలుగు సినిమా దర్శకుడు. ఈయన తండ్రి త్రిపురనేని రామస్వామి కూడా రచయిత. మొదట్లో తండ్రి నాస్తికవాదం ప్రభావం ఆయనపై పడింది. కానీ తర్వాతి కాలంలో అరబిందో ప్రభావంతో ఆస్తికుడిగా మారాడు. మొదట్లో కథా సాహిత్యంపై దృష్టి సారించిన ఆయన కొద్దికాలానికి నవలా రంగంవైపు కూడా మళ్ళారు. ఆయన రచనల్లో అసమర్ధుని జీవితయాత్ర, పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా మొదలైనవి పేరు గాంచాయి. చలనచిత్ర రంగంలో కూడా ప్రవేశించి కొన్ని సినిమాలకు రచయితగా పనిచేశాడు. దర్శక నిర్మాతగా కొన్ని చిత్రాలు నిర్మించాడు. చదువుకున్న అమ్మాయిలు, ధర్మదేవత, రైతుబిడ్డ మొదలైన చిత్ ...

                                               

సంజయ వేలట్టిపుత్త

క్రీ.పూ.6 వ శతాబ్దంలో అంటే గౌతమ బుద్దుని కాలంలోనే సాంస్కృతిక తిరుగుబాటుకు ప్రేరణ కలిగిస్తూ ప్రజలలో విలక్షణ రీతిలో ప్రచారం చేసిన దార్శనికులలో సంజయ వేలట్టిపుత్త ఒకడు. గౌతమ బుద్ధుని సమకాలికుడు. బౌద్ధ గ్రంథాలలో పేర్కొనబడ్డ ఆరుగురు ప్రసిద్ధ తీర్ధంకరులలో ఐదవ వాడు. ఇతను సంశయవాది. అజ్నేయవాదిగా కనిపిస్తాడు. మిగిలిన భౌతిక తాత్వికుల వలె దేవుడు, పరలోకం, లాంటి వైదిక మత విశ్వాసాలను ఖండించలేదు. అలా అని వాటిని సమర్ధించనూ లేదు. దేవుడు, పరలోకం, పుణ్యంల గురించి వుంది-లేదు, లేదు-వుంది అంటూ ఇదమిద్దంగా తేల్చకుండా, సూటిగా చెప్పకుండా సంశయాత్మక ధోరణిలో విలక్షణంగా బోధించాడు.

                                               

సర్వేపల్లి రాధాకృష్ణన్

డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ భారతదేశపు మొట్టమొదటి ఉపరాష్ట్రపతి, రెండవ రాష్ట్రపతి. భారతీయ తాత్వికచింతనలో పాశ్చాత్య తత్వాన్ని ప్రవేశ పెట్టారని ప్రతీతి. రెండు పర్యాయాలు ఉపరాష్ట్రపతి పదవి చేపట్టి, తరువాత రాష్ట్రపతిగా ఒక పర్యాయం పదవిని చేపట్టి, భారతదేశపు అత్యంత క్లిష్టకాలంలో ప్రధానులకు మార్గనిర్దేశం చేశారు.

                                               

పూర్ణ కాశ్యపుడు

క్రీ.పూ.6 వ శతాబ్దంలో అంటే గౌతమ బుద్దుని కాలంలోనే సాంస్కృతిక తిరుగుబాటుకు ప్రేరణ కలిగిస్తూ ప్రజలలో భౌతికవాదాన్ని ప్రచారం చేసిన భౌతిక వాద దార్శనికులలో పూర్ణ కాశ్యపుడు ఒకడు. బౌద్ద గ్రంథాలలో పేర్కొనబడ్డ ఆరుగురు ప్రసిద్ధ తీర్ధంకరులలో మొదటి వాడు. ఇతను గౌతమ బుద్ధుని సమకాలికుడు. వైదిక మత విశ్వాసాలకు వ్యతిరేకంగా భౌతిక వాదాన్ని ప్రచారం చేసిన తాత్వికుడు. ఇతను అక్రియా వాదాన్ని ప్రచారం చేసాడు.

                                               

ప్రకృథ కాత్యాయనుడు

క్రీ.పూ.6 వ శతాబ్దంలో అంటే గౌతమ బుద్దుని కాలంలోనే సాంస్కృతిక తిరుగుబాటుకు ప్రేరణ కలిగిస్తూ ప్రజలలో భౌతికవాదాన్ని ప్రచారం చేసిన భౌతిక వాద దార్శనికులలో ప్రకృథ కాత్యాయనుడు ఒకడు. బౌద్ధ గ్రంథాలలో పేర్కొనబడ్డ ఆరుగురు ప్రసిద్ధ తీర్ధంకరులలో నాల్గవ వాడు. ఇతను గౌతమ బుద్ధుని సమకాలికుడు. వైదిక మత విశ్వాసాలకు వ్యతిరేకంగా భౌతిక వాదాన్ని ప్రచారం చేసిన తాత్వికుడు.

                                               

అజీవకులు

క్రీ.పూ.6 వ శతాబ్దంలో అంటే వర్ధమాన మహావీరుడు, గౌతమ బుద్ధుని కాలంలోనే సాంస్కృతిక తిరుగుబాటుకు ప్రేరణ కలిగిస్తూ ప్రజలలో భౌతికవాదాన్ని ప్రచారం చేసిన అవైదిక మత శాఖలలో అజీవకమతం ప్రసిద్ధమైనది. భౌతికవాద దార్శనికుడైన మక్ఖలి గోశాలుడు అజీవక మతాన్ని స్థాపించాడు. అజీవక మతాన్ని అవలంబించే వారిని అజీవకులు అంటారు. బౌద్ధ గ్రంథాలలో పేర్కొనబడ్డ ఆరుగురు ప్రసిద్ధ తీర్ధంకరులలో రెండవ వాడు మక్ఖలి గోశాలుడు. ఇతను మహావీరుని, గౌతమ బుద్ధుని సమకాలికుడు. వైదిక మత విశ్వాసాలకు వ్యతిరేకంగా భౌతిక వాదాన్ని ప్రచారం చేసిన అజీవక మతాన్ని తోటి అవైదిక మతాలైన జైన, బౌద్ధ మతాలు ప్రత్యర్థి మత శాఖ గానే గుర్తించి విమర్శించాయి. జైన బౌద్ధ ...

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →