Back

ⓘ వికీపీడియా                                               

వికీపీడియా

వికీపీడియా, వివిధ భాషల్లో లభించే ఒక స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వం. దీన్ని లాభాపేక్ష రహిత సంస్థ వికీమీడియా ఫౌండేషన్ నిర్వహిస్తుంది. వికీ అనగా అనేక మంది సభ్యుల సమష్టి కృషితో సులభంగా వెబ్ సైటును సృష్టించగల ఒక సాంకేతిక పరిజ్ఞానం. ఎన్‌సైక్లోపీడియా అనగా సర్వ విజ్ఞాన సర్వస్వం. వికీపీడియా అనేపదం ఈ రెండు పదాల నుంచి ఉద్భవించింది. ఇది 2001లో జిమ్మీ వేల్స్, లారీ సాంగర్లచే ప్రారంభించబడింది. అప్పటి నుంచి అత్యంత వేగంగా ఎదుగుతూ, ఇంటర్నెట్లో అతి పెద్ద వెబ్ సైట్లలో ఒకటిగా ప్రాచుర్యం పొందింది.

                                               

ఆంగ్ల వికీపీడియా

ఇంగ్లీష్ వికీపీడియా లేదా ఆంగ్ల వికీపీడియా అనగా ఉచిత ఆన్లైన్ ఎన్సైక్లోపీడియా వికీపీడియా యొక్క ఆంగ్ల ఎడిషన్. ఇది 2001 జనవరి 15 న స్థాపించబడింది, జూలై 2012 నాటికి నాలుగు మిలియన్ల వ్యాసాలకు చేరుకుంది, ఇది వికీపీడియా మొదటి సంచిక, సెప్టెంబరు 2014 నాటికి అత్యధిక వ్యాసాలు కలిగినదిగా ఉంది నవంబరు 2014 నాటికి అన్ని వికీపీడియా వ్యాసాలలో దాదాపు 13.7% ఆంగ్ల ఎడిషన్ కు చెందినవి. ఈ వాటా క్రమంగా, ఇతర భాషలలో వికీపీడియా అభివృద్ధి చెందడం వలన 2003లో 50% కంటే ఎక్కువ పడిపోయింది. 04-11-2014 నాటికి ఇందులో 46.38.806 వ్యాసాలు ఉన్నాయి. డిసెంబరు 2012లో ఇంగ్లీషు వికీపీడియాలోని వ్యాసాలలోని టెక్స్ట్ అంతా కలిపి సుమారు 9.7 ...

                                               

వికీపీడియా స్మారకచిహ్నం

వికీపీడియా స్మారకచిహ్నం వికీపీడియా గుర్తింపుగా పోలాండ్ లోని, సూబిస్‌లో ఉన్న స్మారకచిహ్నం. వికీపీడియా రచయితల కృషికి గుర్తింపుగా అర్మేనియన్ శిల్పి మిహ్రాన్ హకోబియాన్ ఈ విగ్రహాన్ని రూపొందించాడు. 2014, అక్టోబరు 22న ఫ్రాంక్‌ఫర్ట్ స్క్వేర్ లో స్థానిక వికీమీడియా ఛాప్టర్, వికీమీడియా ఫౌండేషన్ సంస్థల ప్రతినిధుల సమక్షంలో ఈ విగ్రహం ఆవిష్కరించబడింది.

                                               

వికీపీడియా చరిత్ర

వికీపీడియా మొదటగా న్యూపీడియా అనే ఆంగ్లభాషా విజ్ఞాన సర్వస్వం ప్రాజెక్టుకు సహాయ ప్రాజెక్టుగా ప్రారంభమైంది. న్యూపీడియాలో ఆయా రంగాలలోని నిపుణులు వ్యాసాలు రాసేవారు. వాటిని ఒక పద్ధతి ప్రకారం రివ్యూ చేసిన పిదప విజ్ఞాన సర్వస్వంలోకి చేరుస్తారు. న్యూపీడియా మొట్ట మొదటగా బోమిస్ అనే వెబ్ కంపెనీ ఆధ్వర్యంలో 2000 మార్చి 9 సంవత్సరంలో ఆరంభమైంది. బోమిస్ సిఈఓ పేరు జిమ్మీ వేల్సు, దాని ముఖ్య సంపాదకుడు లారీ సాంగర్. తరువాత వికీపీడియాకు కూడా వీరే అదే పదవుల్లో కొనసాగుతున్నారు. మొదటగా ఇది న్యూపీడీయా ఓపెన్ కంటెంట్ లైసెన్స్ అనే లైసెన్స్ కలిగి ఉండేది. కానీ వికీపీడీయా ఏర్పడిన తరువాత ఫ్రీ సాఫ్టువేర్ ఫౌండేషన్ ఉద్యమ రూపశిల ...

                                               

చైనీస్ వికీపీడియా

చైనీస్ వికీపీడియా అనేది వికీపీడియా యొక్క చైనీస్ భాష ఎడిషన్. ఈ ఎడిషన్ అక్టోబర్ 24, 2002 లో ప్రారంభమైంది. చైనీస్ వికీపీడియా సరళీకృత చైనీస్, సాంప్రదాయ చైనీస్ స్క్రిప్ట్ రెండింటిలో అనేక విభిన్న స్క్రిప్ట్ లలో అదే వ్యాసం చూపవచ్చు. ఇది వ్యాసాల యొక్క గణాంకాల ఆధారంగా 15 వ అతిపెద్ద ఎడిషన్. 2016 జూలై 14 నాటికి, ఇది 8.89.003 వ్యాసాలను కలిగివున్నది.

                                               

వికీపీడియా బాట్‌లు

వికీపీడియా బాట్లు, వికీపీడియాలో నిర్వాహణ పనులు నిర్వర్తించే ఇంటర్నెట్ బాట్‌లు. ఈ బాట్‌ల ద్వారా వివిధ భాషా వికీపీడియాల్లో మిలియన్ల వ్యాసాలను సృష్టించవచ్చు. సాధారణ అక్షరదోషాలు, శైలీ లోపాలను సరిదిద్దడం, గణాంకాల డేటా అందించడం వంటి పనులు చేయడానికి బాట్‌లు అని పిలువబడే కంప్యూటర్ ప్రోగ్రామ్‌లు తరచుగా ఉపయోగించబడుతున్నాయి. వాడుకులు సాధారణ సవరణ లోపాలు చేసినప్పుడు స్వయంచాలకంగా తెలియజేయడానికి రూపొందించిన బాట్లు కూడా ఉన్నాయి. కొందరు అజ్ఞాత వాడుకరులు విధ్వంసక చర్యలను చేసినప్పుడు వాటిని త్వరగా గుర్తించి, తిరిగి మార్చడానికి యాంటీ వాండల్ బాట్ ప్రోగ్రామ్ చేయబడింది. ఇవి పనిచేయడానికి ముందు వికీపీడియాలో బాట్‌ల ...

                                               

వికీపీడియా నిర్వాహకులు

వికీపీడియా నిర్వాహకులు, అనగా వికీపీడియాలో నిర్వాహక విధులు నిర్వర్తిస్తున్న వాడుకరులు. చాలాకాలం నుండి వికీపీడియాలో వ్యాసాలు రాస్తున్న విశ్వసనీయ వాడుకరులను నిర్వాహకులుగా నియమిస్తారు. వీరిని నిర్వాహకులు, సిసోప్స్, కాపలాదారులు అని కూడా పిలుస్తారు. 2021, జనవరి నాటికి తెలుగు వికీపీడియాలో 12 మంది నిర్వాహకులు ఉన్నారు. ఇతర వాడుకరులతో పోలిస్తే, నిర్వాహకులకు అదనపు సాంకేతిక అధికారాలు ఉంటాయి. వికీపీడియాలో నిర్వాహకుడిగా మారడాన్ని "తుడుపుకర్రను ఇవ్వడం తీసుకోవడం" అని పిలుస్తారు. ఈ పదం మరికొన్నింటిలో కూడా ఉపయోగించబడుతుంది. 2006లో వికీపీడియాలో 1.000 మంది నిర్వాహకులు ఉన్నారని ది న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. ...

                                               

జిమ్మీ వేల్స్

జిమ్మీ వేల్స్ అమెరికన్ ఇంటర్నెట్ ఆంట్రప్రెన్యువర్. వికీపీడియాను స్థాపించడమే కాకుండా ఇతర వికీ-సంబంధమైన ప్రాజెక్టులు ప్రారంభించారు. లాభము ఆశించని ఛారిటబుల్ సంస్థ వికీ మీడియా ఫౌండేషన్, ను వికీయాను కూడా నడుపుతున్నారు.

                                               

ప్రణయ్‌రాజ్ వంగరి

ప్రణయ్‌రాజ్ వంగరి తెలుగు నాటక రంగ పరిశోధకుడు., తెలుగు వికీపీడియా నిర్వాహకుడు. వినూత్న నాటకాలతో జనం దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తోన్న "పాప్ కార్న్ థియేటర్"కు ప్రధాన కార్యదర్శి. వికీవత్సరం అనే కాన్సెప్ట్‌తో వరుసగా 365రోజులు - 365 వ్యాసాలు రాసి, ప్రపంచం మొత్తంలో ఈ ఘనత సాధించిన మొదటి వికీపీడియన్‌గా చరిత్ర సృష్టించాడు. ఆ ఛాలెంజ్‌ను అలాగే కొనసాగిస్తూ 2019, జూన్ 4న 1000 రోజులు - 1000 వ్యాసాలు పూర్తిచేశాడు. 2020, అక్టోబర్ 17 నాటికి 1500 రోజులు - 1500 వ్యాసాలు పూర్తిచేశాడు.

                                               

వికీమీడియా ఫౌండేషన్

వికీమీడియా ఫౌండేషన్ అమెరికాలో స్థాపించబడిన లాభాపేక్షలేని స్వచ్ఛంద సంస్థ. ఇది వికీపీడియా, ఇతర సోదర ప్రాజెక్టుల పురోగతికి కృషిచేస్తుంది. ఇది 2005 లో స్థాపించబడింది. విజ్ఞానాన్ని అందరికి అందుబాటులోకి తేవటానికి వివిధ దేశాలలో కల వికీపీడియా సంఘాలతో కలసిపనిచేస్తుంది. అంతేకాకుండా కొన్ని ప్రపంచంలోని దక్షిణాది దేశాలలో నేరుగా కార్యాలయాలను నెలకొల్పి ఉద్యోగులద్వారా వికీమీడియా ప్రాజెక్టుల త్వరిత పురోగతికి తోడ్పడుతుంది. భారతదేశంలో 2011 జనవరిలో పని ప్రారంభించింది. తరువాత నేరు పని విరమించి, సి.ఐ.ఎస్. ద్వారా కృషి కొనసాగిస్తున్నది.

                                               

WP:STATS

తెలుగు వికీపిడియా నెలవారీ గణాంకాలు - పట్టికలు తెలుగు వికీపీడియా గణాంకాలు క్లుప్తంగా

                                               

మార్చి 25

1655: శని గ్రహం యొక్క అతిపెద్ద ఉపగ్రహం అయిన టైటాన్ ను క్రిస్టియాన్ హైగెన్స్ కనుగొన్నాడు. 2008: పాకిస్థాన్ కొత్త ప్రధానమంత్రిగా సయ్యద్ యూసఫ్ రజా గిలానీ ప్రమాణస్వీకారం చేసి బాధ్యతలు చేపట్టాడు. 1992: మిర్ అంతరిక్ష కేంద్రములో 10 నెలలు గడిపిన ఖగోళ శాస్త్రవేత్త సెర్జీ క్రికాలేవ్ భూమి పైకి చేరారు.

                                               

లారీ సాంగర్

ఇంటర్నెట్ విజ్ఞాన సర్వస్వము అయిన వికీపీడియాకు సంపాదకుడు లారీ సాంగర్. లారెన్స్ మార్క్ "లారీ" సాన్గెర్ జూలై 16, 1968 న జన్మించారు ఒక అమెరికన్, ఒక మాజీ వేదాంతం లెక్చరర్ / అసిస్టెంట్ ప్రొఫెసర్, వికీపీడియా యొక్క సహ వ్యవస్థాపకుడు, సిటిజెన్డియం స్థాపకుడు.యాంకెరేజ్, అలాస్క లో పెరిగిన ఆయనకు వేదాంతంలో చిన్న వయస్సు నుండి ఆసక్తి ఉంది. సాన్గెర్ 1991 లో రీడ్ కాలేజ్ నుంచి తత్వశాస్త్రంలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్, 2000 లో ఒహియో స్టేట్ యూనివర్శిటీ నుంచి డాక్టరెట్ అందుకొనారు. అతని తాత్విక అధిక పని దృష్టి సారించిన జ్ఞానమీమాంస, విజ్ఞాన సిద్ధాంతం. ఆయన వివిధ ఆన్లైన్ ఎన్సైక్లోపీడియా ప్రాజెక్టుల అభివృద్ధిలో పాల్గొనార ...

                                               

వార్డ్ కన్నింగ్‌హమ్

హోవార్డ్ జి. వార్డ్ కన్నింగ్‌హం అమెరికన్ ప్రోగ్రామర్. అతను మొదటి వికీపీడియాను అభివృద్ధి చేశాడు. ఎజైల్ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ కార్యాచరణ పత్రానికి సహ రచయిత. డిజైన్ నమూనాలు, ఎక్స్‌ట్రీమ్ ప్రోగ్రామింగ్ రెండింటిలోనూ మార్గదర్శకునిగా అతను 1994 లో వికీవికివెబ్‌ను కోడింగ్ చేయడం ప్రారంభించాడు. అతను తన భార్య, కరెన్, కన్నింగ్‌హం & కన్నింగ్‌హం తో ప్రారంభించిన సాఫ్ట్‌వేర్ కన్సల్టెన్సీ వెబ్‌సైట్‌లో 1995 మార్చి 25 న పోర్ట్‌లాండ్ పాటర్న్ రిపోజిటరీకి అనుబంధంగా ఇన్‌స్టాల్ చేశాడు. వికీ పరిశోధన, అభ్యాసంపై వికీసిమ్ కాన్ఫరెన్స్ సిరీస్ మొదటి మూడు సందర్భాలలో కన్నింగ్‌హం ముఖ్య వక్త. అతను వికీమీడియా డెవలపర్ సమ్మిట ...

                                               

వికీ రాబిట్ హోల్

వికీ రాబిట్ హోల్, అనేది వికీపీడియా, ఇతర వికీలను బ్రౌజ్ చేస్తున్నప్పుడు నావిగేట్ చేయడం ద్వారా పాఠకుడిని ఒక టాపిక్ నుండి మరొక టాపిక్ కు తీసుకువెళ్ళే విధానం. దీనికి వికీ కాల రంధ్రం, వికీహోల్ అనే ఇతర పేర్లు కూడా ఉన్నాయి. ఈ హోల్ అనే పదం ఆలిస్ అడ్వెంచర్స్ ఇన్ వండర్ల్యాండ్ నుండి వచ్చింది. దీనిలో ఆలిస్ తెల్ల కుందేలును తన బొరియలోకి అనుసరించడం ద్వారా ఒక సాహసయాత్రను ప్రారంభిస్తాడు. ఏదైనా ఒక వీడియోను కానీ, ఒక సమాచారాన్ని కానీ చూసినప్పుడు, చాలామంది ప్రజలు తాము చూసిన దాని గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి వికీపీడియాకు వస్తారు. వికీలోకి వారు వచ్చిన తరువాత ఆ వ్యాసం నుండి మరిన్ని వ్యాసాలు చూడడంకోసం విక ...

                                               

వికీవాండ్

వికీవాండ్ అనేది ఒక సాఫ్ట్‌వేర్ ఇంటర్‌ఫేస్. వికీపీడియా వ్యాసాలను చూడడంకోసం ఈ ఇంటర్‌ఫేస్ అభివృద్ధి చేయబడింది. అనేక ఇతర ముఖ్యమైన వెబ్ బ్రౌజర్‌లకు ఉచిత బ్రౌజర్ గా, మొబైల్ యాప్ గా కూడా ఈ ఇంటర్‌ఫేస్ అందుబాటులో ఉంది. ఇది ప్రాయోజిత కథనాలు, ప్రకటనలు అనుకూలమైన నావిగేషన్ తో కూడిన ఇంటర్‌ఫేస్‌ను అందిస్తోంది.

                                               

వెన్న నాగార్జున

తెలుగు వికీపీడియాకు శ్రీకారం చుట్టింది వెన్న నాగార్జున. బోస్టన్ నగరంలో సమాచార సాంకేతిక నిపుణుడిగా పనిచేస్తున్నపుడు రూపొందించిన పద్మ అనే లిప్యాంతరీకరణ పరికరం నెట్ లో తెలుగు సమాచార అభివృద్ధికి ఒక మైలురాయి. క్రమంగా తెలుగు భాషాభిమానులను ఇది విశేషంగా ఆకర్షించింది. పద్మ అనే లిప్యాంతరీకరణ పరికరం సృష్టితో వెలుగులోకి వచ్చిన నాగార్జునకి వికీ నిర్వాహకులలో ఒకరైన విలియంసన్ పంపిన విద్యుల్లేఖ తెలుగు వీకీపీడియా ఆవిర్భావానికి నాంది పలికింది. ఆసక్తి ఉండి నిర్వహిస్తామని నమ్మకం ఉంటే తెలుగు వికీపీడియాను రూపొందించి ఇస్తామని దాని సారాంశం. దానిని సవాలుగా తీసుకొని నాగార్జున అనుకూలంగా స్పందించి అంగీకారాన్ని తెలిపాడ ...

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →