Back

ⓘ సాంకేతికం                                               

వన్ ఇండియా

వన్ ఇండియా ఒక భారతీయ భాషల ‌వేదిక. దీని యజమాని గ్రేనియమ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్. ఇది వార్తామాధ్యమము. రాజేష్ జైన్ దీనిని 2006లో కొనుగోలు చేశాడు.

                                               

డా.బి.ఆర్.అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయము

డా.బి.ఆర్.అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయము ఆంధ్ర ప్రదేశ్లో 1982లో స్థాపించబడిన సార్వత్రిక విశ్వవిద్యాలయము. దూర విద్యావిధానాన్ని భారతదేశంలో మొదట ప్రవేశపెట్టిన ఘనత ఈ సంస్థదే. చదువుకోవాలనే కోరిక వుండి, ఏవైనా కారణాలవల్ల కళాశాలకు వెళ్లలేనివారికి ఉన్నత విద్యావకాశాలను అందించటానికి ఈ విశ్వవిద్యాలయము ప్రారంభించబడింది. దీనికి 218 విద్యాకేంద్రాలు ఉన్నాయి. ఇంగ్లీషు, తెలుగు మాధ్యమాలలో చదువుకొనవచ్చు. కొన్ని కోర్సులు ఇంగ్లీషు మాధ్యమంలోనే ఉన్నాయి. కొన్ని విషయాలు ఉర్దూ మాధ్యమంలో చదువుకొనవచ్చు.

                                               

తెలుగు భాషా పత్రిక

ఇది లిఖితపత్రికగా మొదలై అచ్చుపత్రికగా రూపాంతరం చెందింది. ప్రతి యేట ఉగాదికి ఒక సంచిక, దీపావళికి మరొక సంచిక వెలువడేది. ప్రవాసాంధ్రుల కోసం అమెరికాలోని అట్లాంటా నుండి ఈ పత్రికను పెమ్మరాజు వేణుగోపాలరావు నడిపేవాడు. వార్షిక చందా 1.50 డాలర్లు. మొదటి సంచిక ఏప్రిల్ 1970లో వెలువడింది. సంపాదకవర్గంలో పెమ్మరాజు వేణుగోపాలరావు, గవరసాన సత్యనారాయణ, పరిమి కృష్ణయ్య, రావిపూడి సుబ్బారావు మొదలైనవారు ఉన్నారు. మన మాతృభాషను మనము నిత్యము వాడుటకు ప్రయత్నించి మనకు తెలిసిన విజ్ఞానము మనకు తెలిసిన భాషలో వ్రాయగల స్తోమతను సాధించుటయే ఈ పత్రిక ఆదర్శము అని తొలి సంచికలో ఈ పత్రిక ధ్యేయాన్ని తెలిపారు. ఈ పత్రికలో శాస్త్రీయ వ్యాసా ...

                                               

ఎ.హెచ్.వి. సుబ్బారావు

ఎ.హెచ్.వి. సుబ్బారావు గా ప్రసిద్ధుడయిన అడిదం హనుమద్ వేంకట సుబ్బారావు ప్రముఖ పాత్రికేయులు. ఇండియన్ ఎక్స్‌ప్రెస్, ఏఎన్‍ఎస్, ఆంధ్రజ్యోతి, పి.టి.ఐ. మొదలగు ప్రముఖ వార్తా సంస్థల్లో పనిచేసారు. సినిమా, సాంకేతికం, రాజకీయం, వ్యంగ్య రచనలు చేసేవారు.

                                               

మైక్రోసాఫ్ట్ లిప్యంతరీకరణ

మైక్రోసాఫ్ట్ లిప్యంతరీకరణ ద్వారా మనకు కావలసిన తెలుగు పదాన్ని ఇంగ్లీషు అక్షరాలతో టైపు చేసి ఖాళీ పట్టీ నొక్కితే అది తెలుగులోకి మార్చబడుతుంది. తెలివిగా సరియైన పదం ఎంపిక తొలిగా చూపుతుంది.

                                               

ఓజోన్

ఆమ్లజని మరో రూపమే ఓజోన్‌. ఇది విషవాయువు. ప్రతీ ఓజోన్‌ అణువులోను మూడు ఆమ్లజని పరమాణువులున్నాయి. దీని రసాయన సాంకేతికం O3 అతినీల లోహిత వికిరణాల కారణంగా వాతావరణం పై పొరలో ఆక్సీజన్‌ అణువులు విడిపోతాయి. స్వేచ్ఛగా ఉన్న ఆక్సీజన్‌ పరమాణువు, తాడితంతో ఆక్సీజన్‌ అణువులోకి చేరి ఆక్సీజన్‌ పరమాణువులుగా మారి ఓజోన్‌ అణువవుతుంది.

                                               

ఇ-పాలన

సాధారణంగా కాగితం, కలం, ఆధారంగా ప్రభుత్వ పాలన జరుగుతుంది. దీనికి బదులు ఎలెక్ట్రానిక్ సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా ప్రభుత్వం సేవలను అందించడమే ఇ-పాలన. దీని వలన ఖర్చు తగ్గటం, సమయం ఆదా కావటం, ప్రభుత్వ పనిలో పారదర్శకత మెరుగు పడటం, అవినీతి తగ్గటం మొదలైన లాభాలాన్నో ఉన్నాయి. ఈ రకమైన పద్ధతులను సమన్వయం చేయటానికి జాతీయ ఇ-పాలన ప్రణాళిక 2006 మేలో ప్రవేశ పెట్టారు. కంప్యూటర్ ద్వారా రైల్వే రిజర్వేషన్ భారతదేశంలో ఇ-పాలనకి శ్రీకారం అని చెప్పుకోవచ్చు.

                                               

వ్యవసాయం

ఒక నిర్ధిష్టమైన పద్ధతిలో మొక్కలను, జంతువులను పెంచి, పోషించి తద్వారా ఆహారాన్ని, మేత, నార, ఇంధనాన్ని ఉత్పత్తి చేయటాన్ని వ్యవసాయం లేదా కృషి అంటారు. వ్యవసాయం యొక్క చరిత్ర మానవ చరిత్రలో అతి పెద్ద అంశము. ప్రపంచవ్యాప్త సామాజిక ఆర్థిక ప్రగతిలో వ్యవసాయభివృద్ధి ఒక కీలకాంశము. వేటాడటం ద్వారా ఆహార సముపార్జన చేసుకొనే స్థితిలో ఉన్న సంస్కృతులలో కనిపించని సంపద సమకూర్చుకోవటం,సైనిక కలాపాలవంటి ప్రత్యేకతలు వ్యవసాయం అభివృద్ధి చెందటంతోనే ప్రారంభమయ్యాయి. సమాజంలోని కొందరు రైతులు తమ కుటుంబ ఆహార అవసరాలకు మించి పండిచటం ప్రారంభించడంతో తెగ/జాతి/రాజ్యంలోని మిగిలిన వ్యక్తులకు ఇతర వ్యాపకాలను పోషించే వెసలుబాటునిచ్చింది. ప్ ...

                                               

శివానందమూర్తి

కందుకూరి శివానంద మూర్తి మానవతావాది, ఆధ్యాత్మిక, తత్వవేత్త. భారతదేశం లోనూ, విదేశాల్లోనూ అతనుకు ఎంతో మంది శిష్యులు, అభిమానులు ఉన్నారు. విశాఖపట్నంలోని భీమునిపట్నంలో ఆనందవనం పేరిట ఉన్న ఆశ్రమంలో నివసించేవారు. సంప్రదాయం, సంస్కృతి అంశాల మీద ఎన్నో పుస్తకాలు రచించారు.

                                               

ఇంటర్మీడియట్ విద్య

సెకండరీ విద్య తరువాత మొదటి మెట్టు ఇంటర్మీడియట్ విద్య. ఇది రెండు సంవత్సరాలు వుంటుంది కావున, 10+2+3 లో రెండవది. విద్యార్థులు తమ చదువుకి ఐఛ్ఛిక విషయాలను ఎంచుకొంటారు. ముందు చదువులకు, లేక ఉద్యోగాలకు ఈ స్థాయిలోని ఐఛ్ఛిక విషయాలు కీలకమైనవి. ఆంధ్రప్రదేశ్లో ఈ విద్యని, ఇంటర్మీడియట్ విద్యామండలి నిర్వహిస్తుంది. ఇంటర్మీడియట్ స్థాయిలో ఆర్ట్స్, కామర్స్, సైన్స్ లో సాంప్రదాయక కోర్సులు, ఇంజనీరింగ్, వ్యవసాయం, హోమ్ సైన్స్, హెల్త్, పారామెడికల్, బిజినెస్, కామర్స్, హ్యుమానిటీస్ లలో 34 వృత్తి విద్యా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వృత్తి విద్యా కోర్సులు 1244 జూనియర్ కళాశాలలో ఉన్నాయి.

                                               

వేమూరి ఇంగ్లీషు-తెలుగు నిఘంటువు

తెలుగు భాషకి, ఆధునిక అవసరాలకి సరిపోయే, ఒక ఇంగ్లీషు-తెలుగు నిఘంటువు dictionary, పర్యాయపద కోశం thesaurus, శైలి లక్షణ గ్రంథం style manual ఉండాలన్నది నిర్వివాదాంశం. వీటికి తోడు కాలంతో మారుతూన్న భాష స్వరూపానికి అద్దం పడుతూ ఒక ఆధునిక వ్యాకరణం కూడా ఉంటే బాగుంటుంది. మాతృభాష అబ్బినంత తేలికగా, దేశ భాషలు నేర్వగలిగినంత తేలికగా, పాశ్చాత్య భాషలలో పాండిత్యం రాదు. మేథా వర్గాలలో ఉన్న బహుకొద్ది శాతం ఇంగ్లీషు తప్పనిసరి అని ఎంతగా అనుకున్నా, ప్రజలందరినీ - పండితుల నుండి పామరుల దాకా, అందరినీ - ఇంగ్లీషు నేర్చేసుకోమంటే అది జరిగే పని కాదు. కనుక ఈ నాటి శాస్త్రం, సాంకేతికం, వైద్యం, వ్యాపారం., ఇలా ఏ రంగంలోనైనా ఆవిష్కర ...

                                               

తెలుగు విజ్ఞాన సర్వస్వము

విజ్ఞాన సర్వస్వం, అనగా మానవాళికి తెలిసిన జ్ఞానాన్ని ఒకచోట పొందుపరచిన పుస్తకాలు లేక మాధ్యమాలు. సాధారణంగా విద్యావేత్తలు విజ్ఞాన సర్వస్వ రచనలో పాలు పంచుకుంటారు. ప్రాచీన కాలంలో ఒక్క పండితుడు విజ్ఞాన సర్వస్వం రాయకలిగినా, తరువాతికాలంలో జ్ఞానం విపరీతంగా అభివృద్ధి కావడంతో, ఒక్కరే ఈ పనిచేయటం కష్టసాధ్యం. తెలుగు భాషలో పెద్ద బాలశిక్ష మొట్టమొదటి విజ్ఞాన సర్వస్వం. ఆ తరువాత కొమర్రాజు లక్ష్మణరావు ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం, తెలుగు భాషా సమితి వారి విజ్ఞాన సర్వస్వం ప్రచురణ అయ్యాయి. తెలుగు వికీపీడియా ఆధునిక అంతర్జాల యుగంలో ప్రతిఒక్కరు పాల్గొనగల విజ్ఞాన సర్వస్వం. 2004 తరువాత పెద్దబాలశిక్షపేరుతో చాలా పుస్తకాలు ప్ర ...

                                               

ఐటి

ఐటి పూర్తి పేరు ఇన్ఫొర్మేషన్ టెక్నాలజీ. దీనిని ఐసిటి అని కూడా పిలుస్తారు. ఈ రంగంలోని పొరుగు సేవలలో భారతదేశం, ప్రపంచంలో పేరుగాంచింది. ఇది మొదట సాఫ్ట్వేర్ సేవలతో, ఎగుమతి ప్రధానంగా ప్రారంభమైనా, తరువాత దీని ఆధారంగా కల బిపిఒ రంగంతో అనేక వ్యాపార రంగాలలోకి, జాతీయ/స్థానిక వ్యాపారాలలోకి విస్తరించింది. ఉద్యోగాల కల్పనలో ఈ రంగం ప్రధాన పాత్ర వహిస్తున్నది.

                                               

కంప్యూటరు

కంప్యూటరు అనేది అనేకమయిన ప్రక్రియల ద్వారా సమాచారాన్ని రకరకాలుగా వాడుకోటానికి వీలు కలుగచేసే యంత్రం. సమాచారము వివిధ రూపములలో ఉండవచ్చును: ఉదాహరణకు సంఖ్యలుగా, బొమ్మలుగా, శబ్దములుగా లేదా అక్షరములుగా ఉండవచ్చు. ఈ రోజుల్లో "కంప్యూటరు" అనేది ఒక విద్యుత్తు ఉపకరణం. ఈ ఉపకరణాన్ని కచ్చితంగా నిర్వచించాలంటే కష్టమనే చెప్పాలి. కంప్యూటరు అనే పరికరం కాలక్రమేణా ఎన్నో మార్పులు చెందటం వల్ల ఫలానా యంత్రమే కంప్యూటరు అని నిర్వచించటం కష్టమౌతుంది. ఈ క్రింది నిర్వచనాల ద్వారా గణనయంత్రము అంటే ఏమిటి అనే ప్రశ్నకు సమాధానం చెప్పవచ్చు. కన్సైజ్‌ ఆక్స్‌ఫ‌ర్డు ఆంగ్ల డిక్షనరి కంప్యూటరును "ముందుగా నిర్ధారించబడిన ఆదేశాల అనుసారం సమా ...

                                               

తెలుగు సాంకేతిక నిపుణుల విభాగం

ఈ విభాగం 2009లో తెలుగుదేశం పార్టీకి అనుభందంగా ఏర్పడింది, ఈ విభాగానికి పాలెం శ్రీకాంత్ రెడ్డి నాయకత్వం వహిస్తారు. "తెలుగు సాంకేతిక నిపుణుల విభాగం సంక్షిప్తంగా టి.యస్.యెన్.వి పిలుస్తారు. దీనిలో అన్ని వర్గాలలోని నిపుణులు సభ్యులు దీనిలో ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ నిపుణులు సంఖ్య ఎక్కువ.

                                               

బహుళమాధ్యమాలు

సమాచారాన్ని అందించడానికి ఒకటి కంటే ఎక్కువ రకాల ప్రసార మార్గాన్ని ఉపయోగించి ప్రసార మాధ్యమం బహుళ మీడియా గా ఉదాహరించవచ్చు. టెలివిజన్, టేప్ రికార్డర్, వీడియో, ఓవర్ హెడ్ ప్రొజెక్టర్లు, స్లైడ్ ప్రొజెక్టర్ మొదలైన బహుళ సాధనాల ఉపయోగం బహుళ మీడియా ఇది మల్టీమీడియాతో వ్యత్యాసాన్ని కలిగి ఉంటుంది. నిర్ధిష్ట మీడియా మరియు మెటీరియల్స్ గోల్ కు కీలకం అయితే తప్ప ఉదా. ఆయిల్స్ తో ప్రత్యేకంగా పెయింటింగ్ చేయడం నేర్చుకోవడం, కాలిగ్రఫీతో చేతితో రాయడం నేర్చుకోవడం వ్యక్తీకరణకు ప్రత్యామ్నాయ మీడియాఅందించడం ముఖ్యం. ఇటువంటి ప్రత్యామ్నాయాలు వివిధ ప్రత్యేక అవసరాలు ఉన్న అభ్యాసకుల్లో వ్యక్తీకరణకు మీడియా-నిర్దిష్ట అడ్డంకులను తగ ...

                                               

లై-ఫై

లై-ఫై అనగా కాంతి ద్వారా అంతర్జాలమును పొందు నూతన సాంకేతిక పద్ధతి. దీనిని చైనీయులు కనిపెట్టారు. ఈ సరికొత్త విప్లవాత్మకమైన విధానంలో రేడియో పౌనఃపున్యానికి బదులుగా కాంతిని వాహకంగా ఉపయోగిస్తారు. ఈ సాంకేతికతతో ఒక వాట్ సామర్థ్యము ఉన్న ఎల్‌ఇడి బల్బుతో నాలుగు కంప్యూటర్లను అంతర్జాలానికి అనుసంధానం చేయవచ్చు. మైక్రోచిప్ లను కలిగివుండే ఒక బల్బు సెకనుకు 150 మెగా బిట్ల దత్తాంశమును ప్రసారం చేయగలదు.

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →