Back

ⓘ సమాజం                                               

సమాజం

సమాజం అంటే మానవులు కలిసిమెలసి పరస్పర సహకారమందించుకొంటూ సమిష్టిగా జీవిస్తుండే నిర్దిష్ట సమూహాం. సమాజం ఒకటి కంటే ఎక్కువ మంది వ్యక్తుల సంఘాలతో కూడిన నిర్దిష్ట సమూహాన్ని, అలాగే వారు సభ్యులుగా ఉన్న విస్తృత సమాజాన్ని కూడా సూచిస్తుంది. విడిగా సాధ్యమయ్యే దానికంటే సమూహంగా ఎక్కువ ప్రయోజనాలను పొందడానికి ప్రజలు సమాజాలను ఏర్పరుస్తారు. దీనిలో అందరు వ్యక్తులు మానవ కార్యకలాపాలను నిర్వహిస్తారు. మానవ కార్యకలాపాలలో ప్రవర్తన, సామాజిక భద్రత, జీవనాధార చర్యలు ఉంటాయి. సమాజం అంటే తమలో తాము ఉన్నవారి కంటే ఇతర సమూహాలతో చాలా తక్కువ పరస్పర చర్య చేసే వ్యక్తుల సమూహం. ఒక సమాజం నుండి వచ్చే ప్రజలు ఒకరికొకరు పరస్పర అనురాగం, ...

                                               

బ్రహ్మ సమాజం

బ్రహ్మ సమాజం బ్రహ్మసిద్ధాంతపు సామాజిక రూపం. నవభారతంలో తన ప్రగాఢ ప్రభావాన్ని చూపిన ఈ సమాజం, సామాజిక-ధార్మిక ఉద్యమంగా భావింపబడుతుంది. 19వ శతాబ్దంలో బెంగాల్ లో ఒక సామాజిక-ధార్మిక సంస్కరణల ఉద్యమంగా రూపుదాల్చింది. ఈ ఉద్యమం బెంగాల్ లో బయలుదేరింది కావున ఈ ఉద్యమానికి బెంగాల్ సాంస్కృతిక పునరుజ్జీవనం అనికూడా గుర్తిస్తారు. రాజారాం మోహన్ రాయ్ ఈ బెంగాల్ సాంస్కృతిక పునరుజ్జీవనానికి పితామహుడిగా పిలువబడుతాడు, ఇతడే ఈ బ్రహ్మ సమాజ స్థాపకుడు. ఈ సమాజం ప్రత్యేకంగా, హిందూ సమాజంలో మతపరమైన, విద్యాపరమైన సంస్కరణలు తీసుకురావడమే దీని ముఖ్య ఉద్దేశంగా పనిచేసింది. భారతదేశంలో ఈ ఉద్యమాన్ని చట్టపరమైన ధర్మంగా కూడా గుర్తింపు ...

                                               

సమాజం (సినిమా)

రాజసులోచన - ముత్యం గిరిజ - గౌరి కొంగర జగ్గయ్య - శంకర్ రాజబాబు రేలంగి - రమణయ్య ఆర్.నాగేశ్వరరావు - సింహాలు గుమ్మడి - డాక్టర్ నాగయ్య - వెంకటాచలం సి.యస్.ఆర్ - జమీందారు

                                               

సురభి నాటక సమాజం

ప్రపంచ ప్రఖ్యాత సురభి నాటక సమాజం 1885లో వైఎస్ఆర్ జిల్లా సురభి గ్రామంలో కీచక వధనాటక ప్రదర్శనతో మొదలయ్యింది. ఈ సమాజ వ్యవస్థాపకుడు వనారస గోవిందరావు. 1885లో వనారస సోదరులు వనారస గోవిందరావు, వనారస చిన్నరామయ్య కలిసి వైఎస్ఆర్ జిల్లా చక్రాయపేట మండలములోని సురభి రెడ్డివారిపల్లెలో శ్రీ శారదా వినోదిని నాటక సభను ప్రారంభించారు. సురభిలో ప్రారంభమైన ఈ నాటక సభ కాలక్రమేణ సురభి నాటక సంఘముగా ప్రసిద్ధి చెందినది. రంగస్థలముపై స్త్రీ పాత్రలను స్త్రీలచే ధరింపచేసిన తొలి నాటక బృందము సురభినే. నాటకములోని పాత్రధారులందరూ ఒకే కుటుంబములోని సభ్యులవడము చేత స్త్రీలకు చెడ్డపేరు వస్తుందనే భయము ఉండేది కాదు. బృందములోని సభ్యులకు రం ...

                                               

ఈ సమాజం మాకొద్దు

ఈ సమాజం మాకొద్దు 1985లో విడుదలైన తెలుగు చలనచిత్రం. పరిమళ రావ్ పిక్చర్స్ పతాకంపై జె.ఎస్.ఆర్.పరిమళరావు నిర్మించిన ఈ సినిమాకు గూడపాటి రాజ్‌కుమార్‌ దర్శకత్వం వహించాడు. రాం ప్రసాద్, షావుకారు జానకి, మనోచిత్ర ప్రధాన తారాగణంగా నటించారు.

                                               

జయగోపాల్

డా. జయగోపాల్ నాస్తిక యుగం పత్రిక సంపాదకుడు, భారత నాస్తిక సమాజం స్థాపకుడు. ఇతడు విశాఖపట్నం నివాసి. ఇతడు ఇస్లాం మీద పెద్ద గ్రంథం రాశాడు. దేవుడు, ఆత్మలు, స్వర్గం, పునర్జన్మలు, జ్యోతిషం, వాస్తు లాంటివి నిజమని నిరూపిస్తే 5 లక్షలు బహుమతి ఇస్తామని జయగోపాల్ చాలెంజ్ చేశాడు. ఇతడు 1972లో భారత నాస్తిక సమాజం, నాస్తిక యుగం పత్రికను స్థాపించాడు.హేతువాది నాస్తికుడు.

                                               

దివ్యజ్ఞాన సమాజం

దివ్యజ్ఞాన సమాజము అమెరికా లోని న్యూయార్క్ నగరంలో 1875 లో హెలీనా బ్లావట్‌స్కీ, హెన్రీ స్టీల్ ఆల్కాట్, విలియం క్వాన్ జడ్జ్, ఇతరుల చే స్థాపించబడింది. దీన్ని స్థాపించిన కొన్ని సంవత్సరాల తర్వాత బ్లావట్‌స్కీ, ఆల్కాట్ చెన్నై వచ్చి అడయార్ అనే ప్రాంతంలో ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ వారు ఆసియా దేశాలలోని ఇతర మతాలను కూడా అధ్యయనం చేయాలని భావించారు.

                                               

ప్రేమ సమాజం

విశాఖపట్నంలో ప్రేమ సమాజాన్ని 1930 లో స్థాపించారు. 1941 లో రిజిస్టర్డు చేసారు. ప్రేమ సమాజం, డాబా గార్డెన్స్, విశాఖపట్నం-530020 ఫోన్ నెంబరు 0891-2544774. ఇది ఎందరో అభాగ్యులకు జీవితాలను ఇచ్చింది. ఎందరో అనాథలను పెంచి పెద్ద చేసి, చదువు చెప్పించి, వివాహాలు చేసి, వారు కోల్పోయిన కుటుంబాలను వారికి కల్పించింది. ప్రేమ సమాజం ద్వారా జీవితాలను, కుటుంబాలను పొందిన వారు మన సమాజంలో సగర్వంగా తిరుగు తున్నారు. దివి సీమ ఉప్పెనలో వీరు చేసిన సేవ మరువలేనిది. ఆనాడు వీరు చేసిన, అనాథ శవాల సంస్కారం చాలా గొప్పది. కుష్టు రోగులకు చేసే సేవ, వృద్ధులకు చేసే సేవ గొప్పది. విశాఖ లోని పుర ప్రముఖులు ఎందరో ఈ ప్రేమ సమాజంలో సభ్యులు ...

                                               

గుంటూరు హిందూ నాటక సమాజం

కొండుభొట్ల సుబ్రహ్మణ్యశాస్త్రి తన మిత్రులైన తోలేటి అప్పారావు, పాతూరి శ్రీరాములు, పోలూరి హనుమంతరావు, ఇతర శిష్యులతో 1880-81 లలో ఈ సమాజాన్ని స్థాపించారు. దీనికంటే ముందు కందుకూరి వీరేశలింగం పంతులు 1880వ సంవత్సరం నవంబరు, డిసెంబరు నెలలో స్థాపించిన సమాజం విద్యార్థి నాటక సమాజవడం వల్ల, అది కొద్దిరోజుల్లోనే అంతరించిపోవుట వల్ల గుంటూరు హిందూ నాటక సమాజమే మొదటిది అవుతుంది. గుంటూరు అగ్రహారంలోని ఏడుగొందుల సందులో నాటకశాలను నిర్మించుకున్నారు. ఈ సమాజ ప్రదర్శన లకు తగిన ప్రదేశంలో పాకలు వేయడం, తెరలు సిద్ధంచేయడం, నాటక పాత్రలకు కావలసిన దుస్తులు, అలంకారాలు మొదలైనవి పొత్తూరు కృష్ణయ్య, భువనగిరి హనుమద్దీక్షితులు, భాగ ...

                                               

అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం

అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం లేదా ఇస్కాన్, దీనికి హరేకృష్ణ ఉద్యమం అనికూడా అంటారు. ఇస్కాన్ అనునది అంతర్జాతీయ కృష్ణ సమాజం. వీరు అంతర్జాతీయంగా భగవద్గీతా ప్రచారం, కృష్ణ తత్వములను భక్తి యోగములను ప్రచారము చేస్తుంటారు. భారతదేశమునందున ప్రతి ప్రధాన నగరములందున వీరి కృష్ణ మందిరములు ఉన్నాయి.

                                               

వర్గ సమాజం

డబ్బున్న వాళ్ళు - పేద వాళ్ళు, యజమానులు - కార్మికులు లాంటి తేడాలు ఉన్న సమాజమే వర్గ సమాజం. మార్క్స్ సూత్రీకరణ ప్రకారం ప్రస్తుత సమాజంలో వర్గాలు నాలుగు ఉన్నాయి. బూర్జువా వర్గం, పెట్టీ బూర్జువా వర్గం, ప్రోలెటేరియట్, లంపెన్ ప్రోలెటేరియట్. ఫ్రెంచ్ విప్లవ పూర్వపు భూస్వామ్య సమాజంలో మూడు ప్రధాన వర్గాలు ఉండేవి. అవి భూస్వామ్య వర్గం, కౌలు రైతుల వర్గం, వ్యాపారుల వర్గం. బానిస-యజమానుల సమాజంలో ప్రధాన వర్గాలు రెండు. అవి బానిస వర్గం, యజమాని వర్గం.

                                               

సంస్కృతి

సంస్కృతి అనేది మానవ సమాజం జీవన విధానంలో ప్రముఖమైన విషయాలను - అనగా జీవనం, ఆచారాలు, వ్యవహారాలు, ప్రమాణాలు, మతం, సంబంధాలు, పాలన - వంటివాటిని సూచించే పదం. దీనికి ఆంగ్ల పదమైన కల్చర్ లాటిన్ పదం కల్చుర లేదా కొలెరె అనేవి "పండించడం" అనగా వ్యవసాయం చేయడం నుండి ఉద్భవించాయి. ఒక సమాజంలో ముఖ్యమైన పద్ధతులు, నిర్మాణాలు, వ్యవస్థలు ఆ సమాజం యొక్క సంస్కృతిని సూచిస్తాయి. సంస్కృతిని సూచించే సంకేతాలు, నిర్మాణాలు, వ్యవస్థలు, ఆచారాలు, వ్యవహారాలు ఇదమిత్థమైన హద్దులు లేవు, అవి నిరంతరాయంగా మారుతుంటాయి. ఒకదానితో ఒకటి కలుస్తూ, విడిపోతూ పరిణామం చెందుతుంటాయి. ఒక సమాజం జీవనంలో మిళితమైన కళలు, నమ్మకాలు, సంస్థలు, తరాలలో జరిగే ...

                                               

ఆంధ్రప్రదేశ్‌లో ముస్లింలకు రిజర్వేషన్లు

ఇంతకు మునుపే బి.సి.లలో రిజర్వేషన్ పొందిన కులాలు 1.దూదేకుల 2.లద్దాఫ్ 3.నూర్ బాషా 4.పింజారి ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల 4% రిజర్వేషన్లు పొందిన ముస్లిం సముదాయాలు బి.సి ఇ. గ్రూపు కోటా పొందే కులాలు: గోసంగి ముస్లిమ్, ఫకీర్ సాయెబులు ఫకీరు, ఫకీరు బుడ్‌బుడ్కి గంటి ఫకీర్, గంట ఫకీర్లు, ఫకీర్ బుడ్‌బుడ్కి, తురక బుడ్‌బుడ్కి, దర్వేష్ ఫకీర్ దోభీ ముస్లిం, ముస్లిం దోభీ, ధోబి ముసల్మాన్, తుర్కచక్ల, తుర్క చాకల, తురుక చాకలి, తులుక్కవన్నన్, టిసకలాస్, సకలాస్, చాకలాస్, ముస్లిమ్ రజకులు గుడ్డి ఎలుగువాళ్లు, ఎలుగుబంటువాళ్లు, ముసల్మాన్ కీలుగుర్రవాళ్లు ఫకీర్ల, బోరెవాలె, దీర ఫకీర్లు, బొంతల సిద్ధి యాబ, హబ్సి, జసి ఇతర కులాలు: షై ...

                                               

కారుణ్య మరణం

కారుణ్య మరణం చికిత్స లేదని వైద్యులు పేర్కొంటున్న ఒక వ్యాధితో బాధపడుతున్న వ్యక్తి తనను చట్టబద్ధంగా చంపమంటూ చేసుకునే విన్నపం, ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు చనిపోవచ్చంటూ చట్టం అనుమతి ఇచ్చే కోర్టుతీర్పు. ముస్లిం, హిందూ, జైన, క్రైస్తవ మత నాయకులు కారుణ్య మరణంను చట్టబద్ధం చేయాలనే ఆలోచనలు, క్రైస్తవులు, జైనులు కొన్ని పరిస్థితులలో నిష్క్రియాత్మక కారుణ్య మరణం ఆమోదయోగ్యమని భావించారు. జైనులు, హిందువులు సాంప్రదాయ ఆచారాలు సంతారా ప్రయోపవేసలను కలిగి ఉన్నారు, ఇందులో ఒకరు మరణానికి ఉపవాసం ఉంటారు. సల్లెఖాన, సంతారా యొక్క జైన ప్రతిజ్ఞను జైనులు ప్రత్యేక పరిస్థితులలో మాత్రమే పాటిస్తారు. జైన గ్రంథాల మాదిరిగా రత్నకరం ...

                                               

జనరిక్ మందులు

నరేంద్ర మోడి జన ఔషధి పధకం ద్వారా దేశంలో కొత్తగా 5000 మెడికల్ షాపులను ఏర్పాటు చేసారు. ఇలా ఎంతో మందికి ఉపాధి లభించడమే కాకుండా పేదలకు మందుల ఖర్చు మిగులుతుంది.ప్రధాని ఇకపై దేశంలోని వైద్యులందరు జనరిక్ మందులనే రాయాలనీ, లేని పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆదేశించారు. దీనికి కొనసాగింపుగా ఓ కేంద్ర మంత్రి కూడా మెడికల్ కౌన్సిల్ నిబంధనల ప్రకారం వైద్యులు తమ చీటిపై జనరిక్ మందుల పేర్లనే ప్రస్ఫుటంగా పెద్దపెద్ద అక్షరాలతో రాయాలని చెప్పుకొచ్చారు. ప్రభుత్వ పరంగా ఎన్ని ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ, అధికశాతం వైద్యులు ఈ పని చేయడం లేదు. ఈ మధ్యకాలంలో నాసిరకం మందులు రాజ్యమేలుతున్నట్లు వార్తలొచ్చాయి. మార్కెట్ ...

                                               

దేశభక్తి

దేశభక్తి ప్రజలకు వారు జన్మించిన దేశం మీద గల మక్కువ. ఇది ఒక ప్రాంతం లేదా పట్టణం లేదా గ్రామం కూడా కావచ్చును. ఇలాంటి దేశభక్తులు వారి దేశం సాధించిన ప్రగతి, సంప్రదాయాలు మొదలైన వాటిని గర్వంగా భావిస్తారు. దేశభక్తి, జాతీయతా భావం ఒకటే. దేశభక్తిలో వ్యక్తికంటే దేశానికే ప్రాధాన్యత ఎక్కువ. ఇది ముఖ్యంగా జాతీయ రక్షణ వ్యవస్థలో స్పష్టంగా కనిపిస్తుంది. ప్రాణాన్ని కూడా త్యాగం చేయడాన్ని వీరు గర్వంగా భావిస్తారు.

                                               

నాగరికత

నాగరికత అనేది మానవులచే ఆవిర్భావం చెంది, పట్టణాభివృద్ధి, సామాజిక వర్గీకరణ, సామూహిక నడవడిక, కట్టుబాట్లు, సమాచార మార్పిడి, ఇతర సాంకేతిక పురోగతులచే రూపొందబడిన ఒక క్లిష్ట సమాజము. నాగరికత ఎదుగుతున్నకొద్దీ వివిధ ఆర్థిక, సామాజిక, రాజకీయ వ్యవస్థలలో ఎడబాట్లు స్పష్టమవుతాయి. కొన్ని ప్రాంతాలు కేంద్రీకరణకు గురై ఆయా చోట్ల జనసాంద్రత పెరుగుతుంది. ఉత్పాదకత, వర్తకము పెరుగుతాయి, ఏదోవొక రకమైన డబ్బు వాడుకలోకి వస్తుంది. వివిధ కళలు సర్వసాధారణం అవుతాయి, వాటిలో నేర్పరితనం పెరుగుతుంది. భాష ఏర్పడుతుంది. క్లిష్టమైన కట్టడాలు స్థాపించబడతాయి. ఆలోచనలు, సిద్ధాంతాలు పెరిగి కట్టుబాట్లు, చట్టాలు ఆచరణలోకి వస్తాయి. వేట, పశుపెంప ...

                                               

పరువు

పరువు కోసం మనుషులు ఎన్నో సాహసాలు, దానధర్మాలు చేస్తారు. కులగౌరవం వంశప్రతిష్ఠ పెద్దపేరున్న కుటుంబం అంటూ కొన్నిసార్లు చేయకూడని అమానుషమైన పనులు చేస్తారు. పరువు హత్యలు కూడా ఈ వర్గానికి చెందిన క్రూరమైన ప్రక్రియ.

                                               

ప్రియుడు

ప్రియుడు అనగా ప్రేయసి యొక్ఒక మగ భాగస్వామి, శృంగారపరంగా,/లేదా లైంగికపరంగా ఆమెతో సంబంధముండవచ్చు. ప్రియుడిని ఆంగ్లంలో బాయ్ ఫ్రెండ్ అంటారు. ఇది మగ "స్నేహితుడు" అని కూడా సూచిస్తుంది. ప్రియుడు ప్రేయసితో వివాహ సంబంధానికి కట్టుబడి ఉంటాడు, ఇతనిని తన ప్రేయసికి కాబోయే భర్త అని సాధారణంగా ఉపయోగిస్తారు. ప్రియుడిని ప్రేమికుడు, జతగాడు, కాబోయే భర్త, ఆరాధకుడు, లవర్, సహచరుడు, బాయ్ ఫ్రెండ్,ఆత్మీయుడు అని కూడా చెప్పవచ్చు.

                                               

బోయ

భారతదేశంలోని జంతు వేటను ప్రధాన వృత్తిగా కలిగియున్న అటవీతెగల్లో బోయ ఒకటి. బోయలను కన్నడబాషలో బేడర అని మలయాళములో"నాయర్"అని పిలుస్తారు.భారతీయ కులవ్యవస్థ విభాగం ప్రకారము సెంట్రల్ లిస్టులో O.B.C లుగా, తమిళ నాడు, కేరళ లలో B.C లుగా, ఆంధ్ర ప్రదేశ్ B.C-A గా,కర్ణాటకలో కేటగిరి 1 గా,అనగా వెనుకబడిన తరగతులుగా గుర్తింపబడుచున్నారు. వీరు అడవులలో నుండి వచ్చిన ట్రైబులు గా ST లుగా 1964 వరకూ భారత రాజ్యాంగములో తెలుప బడినారు.

                                               

మానవ హక్కులు

ఐక్యరాజ్యసమితి సార్వత్రిక మానవ హక్కుల ప్రకటన ను ఐక్యరాజ్యసమితి 1948 డిసెంబరు 10 ప్రకటించింది. ప్రతి సంవత్సరం డిసెంబరు 10 అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవంగా జరుపుకొంటారు.

                                               

మార్గదర్శి

మార్గదర్శి అనగా మార్గాన్ని చూపించేవాడు. మార్గదర్శిని ఆంగ్లంలో గైడ్ అంటారు. మార్గదర్శకుడు తెలియని లేదా తెలిసితెలియని ప్రదేశాలకు వచ్చిన ప్రయాణికులకు, క్రీడాకారులకు లేదా పర్యాటకులకు దారి చూపుచూ వారిని గమ్యస్థానికి చేరుస్తాడు. గైడు పర్యాటకులకు దారి చూపి గమ్యస్థానికి చేర్చినందుకు ఫీజు రూపంలో కొంత డబ్బును తీసుకుంటాడు. టూరిస్ట్ గైడులు పర్యాటక ప్రదేశాలను చూపుచూ దాని చరిత్రను కూడా తెలియజేస్తారు.

                                               

ముక్తి

పునర్జన్మ లేకపోవటం. స్వర్గప్రాప్తి కలగటం. మోక్షం.జన్మరాహిత్యం మళ్ళీ పుట్టకుండా ఉండటం.జననమరణాల పరంపరనుండి విముక్తి కలగటం. దైవసన్నిధికి చేరుకోవటం.ఈ ముక్తికోసమే కాశీలోనో కాశీయాత్రలోనో మరణించాలని శివభక్తులు కోరుకుంటారు. మక్కాయాత్రలో చనిపోతే ముక్తి కలుగుతుందని ముస్లిముల నమ్మకం. ఈ ముక్తికోసమే ముస్లిములు క్రైస్తవులు ప్రపంచంలోని వివిధ మతాల ప్రజలు దైవాన్ని వేడుకుంటారు. ఇహ లోకం పట్ల వైరాగ్యంతో దైవ సాయుజ్యం కైవల్యం భక్తులు కోరుకుంటారు. సన్యాసులు ఋషులు ముక్తికోసం తపస్సు చేస్తారు. వీరస్వర్గం అన్యాయాన్ని ఎదిరించిన హతులకు బలిపశువులుకు దొరుకుతుందిగానీ మానవత్వం కోల్పోయిన వివిధ మతాల హంతకులకు దొరకదు.ఉగ్రవాదు ...

                                               

రాజకీయవేత్త

రాజకీయ నాయకుడు లేదా రాజకీయవేత్త, అంటే పార్టీ రాజకీయాల్లో చురుకుగా పాల్గొనే వ్యక్తి, లేదా ప్రభుత్వంలో రాజకీయ పదవిని కలిగి ఉన్న లేదా కోరుకునే వ్యక్తి. రాజకీయ నాయకులు భూమి మీద ఏదైనా ప్రాంతాన్ని పరిపాలించే చట్టాలు లేదా విధానాలను ప్రతిపాదించడం, మద్దతు ఇవ్వడం, సృష్టించడం, విస్తరణ ద్వారా ప్రజలుకు మరిన్ని సౌకర్యాలు కలిగించుటలో ప్రభావితంలో పాలు పంచుకునే ఒక వ్యక్తులు అని భావన.వీరిని రాజకీయ నాయకుడను రాజకీయవేత్త. రాజనీతి నిపుణుడు,రాజనీతి కోవిదుడు అని కూడా అంటారు.స్థూలంగా చెప్పాలంటే ఏ రాజకీయ సంస్థలోనైనా రాజకీయ అధికారాన్ని సాధించడానికి ప్రయత్నించే ఎవరైనా "రాజకీయ నాయకుడు" కావటానికి అవకాశం ఉంది.నిర్ణయాలు ...

                                               

రాజకీయాలు

సమూహాలుగా నివసిస్తున్న ప్రజలు నిర్ణయాలు చేసేందుకు మార్గం రాజకీయాలు. తెగలు, నగరాలు, లేదా దేశాలుగా ప్రజలు సమూహాలుగా కలిసిమెలసి జీవించేందుకు ప్రజల మధ్య ఒప్పందాలు చేయడానికి రాజకీయాలు ఉన్నాయి. పెద్ద సమూహాలలో, దేశాల వంటి వాటిలో కొంతమంది ఇటువంటి ఒప్పందాలు చేయడానికి చాలా సమయం వెచ్చిస్తారు. వీరిని రాజకీయ నాయకులు అంటారు. రాజకీయనాయకులు, కొన్నిసార్లు ఇతర ప్రజలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటారు. విశ్వవిద్యాలయాల్లో రాజకీయాల అధ్యయనమును రాజకీయ శాస్త్రం, రాజకీయ అధ్యయనాలు, లేదా ప్రభుత్వ పరిపాలన అంటారు. రోజువారీ జీవితంలో రాజకీయాలు అనే పదం దేశాల పరిపాలన విధానాన్ని, ప్రభుత్వ నియమాలు, చట్టాల తయారీ మార్గా ...

                                               

రిజర్వేషన్లు

రిజర్వేషన్లు అనేవి ప్రజలలో కొన్ని వర్గాల అభివృద్ధికి ప్రభుత్వం వారు ఇచ్చే మినహాయింపులు, కేటాయింపులు. ఎన్నికలు, విద్య, ఉపాధికి గల అవకాశాలలో కుల, మత, ప్రాంతము, లింగం, శారీరక మానసిక బలహీనత, సైన్యమువర్గానికి చెందిన అనే రకరకాల ప్రాతిపదికలపై రిజర్వేషన్లకి సంబంధించి, రాజ్యాంగంలో, చట్టసభలు చేసిన చట్టాలున్నాయి.

                                               

వితంతువు

హిందూ సమాజంలో భర్త చనిపోయిన స్త్రీని వితంతువు అంటారు. వీరిని వ్యవహారంలో ముండమోపి, విధవ అని కూడా వ్యవహరిస్తారు. గతంలో వీరు సమాజంలో అనేక అవమానాలను ఎదుర్కొనేవారు. ఇప్పటికీ అక్కడక్కడా వీరికి ఇలాంటి అనుభవాలు ఎదురు అవుతూనే ఉంటాయి. కందుకూరి వీరేశలింగం పంతులు, రాజా రామ్మోహనరాయ్ వంటి సంఘ సంస్కర్తల కారణంగా ప్రస్తుతము వీరు గౌరవ ప్రథమైన జీవితమును గడుపుతున్నారు.

                                               

వినియోగదారుడు

వినియోగదారుడు సమాజంలో వినిమయం చేయబడే వస్తువుల లేదా సేవలను పొందే వ్యక్తి లేదా వ్యక్తులు. ఇలాంటి వ్యక్తుల హక్కుల పరిరక్షణ కోసం వినియోగదారుల రక్షణ చట్టం చేయబడింది. దీని ప్రకారం ఒక వినియోగదారుడు కొన్న వస్తువు నాణ్యత నిర్దేశించబడిన శ్రేణి కంటే తక్కువగా ఉంటే, దానివలన కలిగే ఆర్థిక, ఇతర నష్టాలను ఆ వస్తువును తయారుచేసిన సంస్థ భరించాల్సి వుంటుంది. వినియోగదారుడు అనగా వారి స్వంత ఉపయోగం కోసం వస్తువులు లేదా సేవలను కొనుగోలు చేసే వ్యక్తి".

                                               

వేలంపాట

వేలం లేదా వేలంపాట ఇది ఒక రకమైన అమ్మకం. అమ్మే వ్యక్తి సదరు వస్తువు యొక్క ప్రారంభ విలువను నిర్ణయిస్తారు. ఇష్టమైన వ్యక్తి ఎంత విలువ ఇవ్వగలరో చెప్పవలసి ఉంటుంది. మరో వ్యక్తి అంతకన్నా ఎక్కువ ఇవ్వడానికి సిద్దమవ్వవచ్చు. నిర్ణీత సమయంలోపు అత్యధికంగా ఇవ్వడానికి సిద్దమయిన వారికి సదరు వస్తువుని అమ్ముతారు. వేలంపాట అనగా వస్తువులను అమ్మేటప్పుడు అత్యధిక బిడ్ కు అమ్మడం, కొనుకోలు చేసేటప్పుడు తక్కువ బిడ్ కు కొనడం. వేలం రకాలు, వేలంలో పాల్గొనేవారి ప్రవర్తనతో వ్యవహరించే ఆర్థిక సిద్ధాంతం శాఖను వేలం సిద్ధాంతం అంటారు. విభిన్న సందర్భాల్లో వాణిజ్యం కోసం వేలం మరియు వర్తించబడుతుంది. ఈ సందర్భాలు పురాతన వస్తువులు, పెయింట ...

                                               

శీలం

శీలం ఇంగ్లీషులో chastity అంటారు. ప్రతివ్యక్తికీ ఈ శీలసంపద ముఖ్యమని అన్ని మతాలు ఘోషిస్తున్నాయి. వ్యభిచరించిన వ్యక్తికి ఈ శీలం పోయిందంటారు. మంచి నడత కలిగిన స్త్రీని సుశీల అని పిలుస్తారు.

                                               

సంత

సంత అంటే అంగడి. వారంలో ఏదో ఒక రోజు పెద్ద గ్రామాల్లో, పట్టణాల్లో సంత జరుగుతుంది. సంతలో వివిధ రకాలైన వస్తువులు అమ్మకానికి లభిస్తాయి. ఇది ఊరి వెలుపల బహిరంగ ప్రదేశంలో జరుగుతుంది. ఎందరో వ్యాపారులు తమ సామగ్రిని ఎడ్లబళ్ళమీద, లారీల్లో లేదా స్వయంగా మోసుకొని సంతకు తెస్తారు. ఉదయాన్నే డేరాలు వేసుకొని దుకాణాలు తెరుస్తారు. వ్యవసాయదారులు తాము పండించిన ధాన్యాలు, కూరగాయలు, పండ్లు మొదలైనవి అమ్మకానికి తెస్తారు. కొందరు వ్యాపారులు చిన్న పిల్లలకోసం ఆట వస్తువులు, తినుబండారాలు కూడా తెచ్చి అమ్ముతారు. సంతలో సామాన్యంగా రోజూ గ్రామంలో దొరకని వస్తువులు కూడా కొనుక్కొనే అవకాశం కలుగుతుంది. ఆ గ్రామానికి చెందినవారే కాకుండా ...

                                               

సమాచార సాధనాలు

ముఖ్య వ్యాసం: భారత దేశంలో సమాచార సాధనాల విస్తృతి మీడియా రీసర్చ్ యూసర్స్ కౌన్సిల్ 2008R2 జులై 2008 ప్రకారం టెలివిజన్ 55.84%, పత్రికలు 38.3%, రేడియో 21.4%, సినిమా 9.9% ఇంటర్నెట్ 1.7%వ్యక్తులకు చేరుతున్నది. 2006 R2 పోల్చితే టెలివిజన్, రేడియో, ఇంటర్నెట్ తమ విస్తృతిని పెంచుకొనగా, పత్రికలు, సినిమా తగ్గుముఖం పట్టాయి.

                                               

సమాజసేవ

చెరువు కానీ, సరస్సు కానీ, బావి కానీ, కాలువ అయినా సరే తవ్విస్తే అమితమైన పుణ్యఫలాలు దక్కుతాయంటోంది నారద పురాణం. స్వయంగా నిర్మించినా, లేదంటే ఇంకొకరు నిర్మించేటప్పుడు అందుకు సహకరించినా, తల్లి వైపు, తండ్రి వైపు ఉన్నవారంతా లక్ష కోట్ల తరాల వరకూ, మూడు కల్పాల కాలం వరకూ విష్ణులోకంలో నివసించొచ్చు. చెట్లు పెంచితే దివ్యదేహాన్ని ధరించి ఉత్తమ విమానాన్ని అధిరోహించి, మూడు కల్పాల పాటు విష్ణులోకంలో ఉండి బ్రహ్మలోకానికి వెళ్ళొచ్చు. అక్కడ రెండు కల్పాల పాటు నివసించి, అక్కడి నుంచి స్వర్గానికి చేరి ఒక కల్పం పాటు ఉండి అనంతరం యోగులలో జన్మించి చివరగా ముక్తిని పొందేంత పుణ్యం లభిస్తుంది. చివరకు వేతనం తీసుకొని అయినా సరే ...

                                               

సామాజిక కార్యకర్త

సామాజిక సంక్షేమం కోసం కృషి చేసేందుకు స్వచ్చంద సంస్థలు, ట్రస్టులు, సామాజిక సేవా సంస్థలు, రాజకీయ పార్టీలు వంటి వాటిలో కార్యకర్తగా పనిచేసేవారు. గిరిజనులు, దళితులు సంక్షేమం, సమాచార హక్కు, పర్యావరణం, అడవుల పరిరక్షణ, నిర్వాసితులకు న్యాయం, ప్రభుత్వంలో అవినీతి వంటి అంశాలపై క్షేత్ర స్థాయిలో సామాజిక కార్యకర్తలు పని చేస్తారు.

                                               

సునీతా కృష్ణన్

డా. సునీతా కృష్ణన్ ఒక ప్రముఖ సంఘసేవకురాలు. ప్రజ్వల అనే సేవాసంస్థ స్థాపించి అందులో ప్రధాన బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వ్యభిచార వృత్తిలో కూరుకుపోయిన ఆడపిల్లలను రక్షించి వారిని తిరిగి మంచి జీవితాల్ని ప్రసాదించడం ఈ సంస్థ యొక్క ప్రధానోద్దేశ్యం. 2016 లో ఆమెను భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. ఆమె కథ అందించి ఆమె భర్త రాజేష్ టచ్ రివర్ దర్శకత్వంలో రూపొందిన నా బంగారు తల్లి అనే సినిమాకి నాలుగు జాతీయ సినిమా పురస్కారాలు లభించాయి.

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →