Back

ⓘ శాస్త్రాలు                                               

శాంతి స్వరూప్ భట్నాగర్ శాస్త్ర సాంకేతిక పురస్కారం

శాంతి స్వరూప్ భట్నాగర్ శాస్త్ర, సాంకేతిక పురస్కారం భారతదేశంలో ప్రతీ సంవత్సరం కౌన్సిల్ ఆఫ్ సెంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ద్వారా ప్రముఖ శాస్త్ర పరిశోధకులకు అందజేయబడుతున్న శాస్త్ర పురస్కారం. ఈ పురస్కారాలను శాస్త్ర రంగాలైన జీవశాస్త్రం, రసాయన శాస్త్రం, పర్యావరణ శాస్త్రం, ఇంజనీరింగ్, గణితశాస్త్రం, వైద్యరంగం, భౌతిక శాస్త్రాలలో అసమాన ప్రతిభ కనబరచిన వారికి అందజేస్తారు. ఈ పురస్కారం భారతీయ శాస్త్ర, సాంకేతిక రంగాలలో మంచి గుర్తింపు తెచ్చిన వారికి అంజజేయబడుతుంది. ఇది భారతదేశంలోని శాస్త్ర రంగంలో అతి గౌరవనీయమైన పురస్కారం. ఈ పురస్కారానికి భారతదేశ కౌన్సిల్ ఆఫ్ సెంటిఫిక్, ఇండస్ట్రియల్ రీసెర్చ్ స్థాపకు ...

                                               

శాస్త్రము

శాస్త్రము అనేది ఒక సంస్కృత పదం. దీని అర్థం "సూత్రం, నియమాలు, నిబంధనల పత్రం, సంకలనం, పుస్తకం లేదా గ్రంథం". ఈ పదాన్ని సాధారణంగా భారతీయ సాహిత్యంలో, నిర్వచించిన ప్రదేశంలో సాంకేతిక లేదా ప్రత్యేక జ్ఞానం కోసం ప్రత్యయం వలె ఉపయోగిస్తారు. శాస్త్రానికి ఆంగ్లపదమైన -లజీ logy కి సమానమైన అర్ధం ఉంది. ఉదా. ఎకాలజీ, సైకాలజీ. అంటే ప్రత్యేకమైన అంశంపై శాస్త్రీయ, ప్రాథమిక జ్ఞానమును శాస్త్రం అనవచ్చు. ఆంగ్లంలో ఉన్న రకరకాల మాటలకి సమానార్ధకంగా తెలుగులో శాస్త్రం అన్న ఒక్క మాట వాడతారు. ఉదాహరణకి ఆంగ్లంలో మాథమెటిక్స్ కు తెలుగులో గణితం లేదా గణితశాస్త్రం అంటారు. ఆంగ్లంలో "ఫిజిక్స్" అన్న మాటని భౌతికం అని అనకుండా భౌతిక శాస్ ...

                                               

ముస్లిం శాస్త్రవేత్తలు

ముస్లిం శాస్త్రవేత్తలు ముస్లిం ప్రపంచంలో శాస్త్రాలు శాస్త్రీయ చరిత్రలో పాత్రను పోషించాయి. ముస్లిం ప్రపంచానికి చెందిన అనేక శాస్త్రజ్ఞులు మానవాళికి సేవ చేసారు. ముస్లిం శాస్త్రజ్ఞుల జాబితా:

                                               

వీరకంకణం (నవల)

వీరకంకణం నవలని దండిపల్లి వేంకట సుబ్బాశాస్త్రి 1949లో రచించి ప్రచురించారు. వీరకంకణం నవల ఇతివృత్తం సంస్కృత సాహిత్యంలో గొప్ప ఆలంకారికునిగా ప్రఖ్యాతి గాంచిన జగన్నాథ పండితరాయలు జీవితం చుట్టూ అల్లబడింది. ఇది నవల అయినప్పటికీ ఇందులో చాలావరకు చారిత్రకమైన విషయాలున్నాయి. కథ నేపథ్యం శ్రీకృష్ణదేవరాయల పరిపాలన, ఢిల్లీ సుల్తానుల పాలన వంటి వాటి నేపథ్యంలో తయారైంది.

                                               

విజ్ఞానశాస్త్రం

Kona jadu reddy విజ్ఞాన శాస్త్రం లేదా సైన్సు అనేది ఈ ప్రపంచం గురించి మనకు తెలిసిన విషయాల్ని ఒక పద్ధతి ప్రకారం వివరించే శాస్త్రం. ప్రస్తుతం ఈ శాస్త్రం అనేక విభాగాలుగా విభజించబడి ఉంది. ప్రకృతి శాస్త్రంలో భౌతిక ప్రపంచం|భౌతిక ప్రపంచాన్ని గురించిన అధ్యయనం ఉంటుంది. సామాజిక శాస్త్రంలో ప్రజలు, సమాజం గురించిన విషయాలు ఉంటాయి. గణిత శాస్త్రం లాంటివి సాంప్రదాయ శాస్త్రము|సాంప్రదాయ శాస్త్రాల క్రిందికి వస్తాయి. ఈ సాంప్రదాయ శాస్త్రాలు అనుభవం ద్వారా లేదా ప్రయోగాల ద్వారా ఏర్పడ్డవి కాదు కాబట్టి సాధారణంగా విజ్ఞానశాస్త్రాల కోవ లోకి రావు. విజ్ఞాన శాస్త్రాన్ని ఉపయోగించుకునే ఇంజనీరింగ్, వైద్యశాస్త్రం లాంటి రంగాలను ...

                                               

హిందూధర్మశాస్త్రాలు

హిందూమతము నకు సంబంధించిన ఆధారాలు, నియమాలు, సిద్ధాంతాలు, తత్వాలను వివరించేవి హిందూ ధర్మశాస్త్రాలు. ఇవి ప్రధానంగా సంస్కృత భాషలో వ్రాయబడ్డాయి. ఈ విధమైన సంస్కృత సాహిత్యమును మతపరంగా ఆరు విభాగాలు, మతంతో సంబంధం లేకుండా నాలుగు విభాగాలుగా పరిగణిస్తారు.

                                               

గార్గి

గార్గి హిందూ పురాణాలలో యోగిని. బ్రహ్మజ్ఞానం పొందింది. సకల వేదాలు, శాస్త్రాలు అవగతం చేసుకొన్న జ్ఞాని. వచక్నుడి కుమార్తె. బ్రహ్మచారిణి. పరబ్రహ్మ యొక్క ఉనికిని ప్రశ్నిస్తూ సూక్తాలను రచించింది. జనకుని సభలో యాజ్ఞవల్క్య ని ఆత్మ, పరమాత్మ ల గురించి గార్గి వేసిన ప్రశ్నలకు జవాబు చెప్పలేక మమ్మల్ని ఇలా బ్రతకనివ్వు, చెప్పలేని ప్రశ్నలడుగుతున్నావు అంటాడు. గార్గి వేదకాలం నాటి మహాయోగిని.ఈమె బ్రహ్మజ్ఞానం పొందిన సాధ్వి.ఈమె సకల వేదాలు,శాస్త్రాలు అవగతం చేసుకొన్న జ్ఞానిగా పేరు పొందినది.ఆ కాలంలోని మహా జ్ఞానులలో ఈమె ఒకరు. ఈమె వచక్నుడు అనే మహాముని యొక్క కుమార్తె.చిన్నప్పటి నుండే గార్గి యొక్క విద్యాభిలాష ప్రస్ఫుటంగ ...

                                               

విద్యా విభాగాల జాబితా

బాక్టీరియాలజీ: బాక్టీరియా అనే సూక్ష్మజీవుల అధ్యయన శాస్త్రం. లిమ్నాలజీ: సరస్సుల్లో నివసించే జంతువుల అధ్యయన శాస్త్రం. పెడగాగీ: బోధనాపద్ధతుల అధ్యయన శాస్త్రం. సైటాలజీ: కణం, కణాంగాల అధ్యయన శాస్త్రం. సెలినాలజీ: చంద్రుని గురించి అధ్యయనం చేసే శాస్త్రం. పిసికల్చర్: చేపల పెంపకం. క్రిమినాలజీ: నేరాలు, నేరస్థుల అధ్యయన శాస్త్రం. పేలియోబోటనీ: వృక్షశిలాజాల అధ్యయన శాస్త్రం. ఫ్లోరీకల్చర్: పుష్పాల పెంపకం. టిష్యూకల్చర్: కణజాలాల సంవర్ధనం. వర్మికల్చర్: వానపాముల పెంపకం. ప్టిక్స్: కాంతి అధ్యయన శాస్త్రం. ఫిలాటలీ: స్టాంపుల సేకరణ. సిల్వీకల్చర్: కలపనిచ్చే చెట్ల పెంపకం. లెక్సికోగ్రఫీ: నిఘంటువుల అధ్యయన శాస్త్రం. మైకాలజ ...

                                               

పుల్లెల శ్రీరామచంద్రుడు

పుల్లెల శ్రీరామచంద్రుడు, రచయిత, అనువాదకుడు, సంస్కృత పండితుడు. సంస్కృత కావ్యాలు, నాటకాలు, శాస్త్రాలు వంటివి తెలుగులోకి అనువదించి వ్యాఖ్యానించారు.

                                               

బాలభారతం(పత్రిక)

2013 మే 27న పత్రికావిష్కరణ కార్యక్రమం ఫిల్మ్‌సిటీలో జరిగింది. రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ పత్రికను ఈనాడు మేనేజింగ్ డైరక్టర్ అయిన సుమన్, మార్గదర్శి చిట్ ఫండ్స్ అధినేత శైలజా కిరణ్ ల చిన్న కుమార్తె దివిజ ఆవిష్కరించింది. ఫిల్మ్‌సిటీ, డాల్ఫిన్‌ హోటళ్ల ఎండీ విజయేశ్వరి, సుమన్‌ల కుమారుడు సుజయ్‌ లాంఛనంగా ఆవిష్కరించాడు. 2013 జూన్ 1 వ తేదీన తొలి సంచిక విడుదలైంది. నాణ్యమైన కాగితంపై 84 పేజీలతో సర్వాంగ సుందరంగా వెలువడుతున్నది. డిసెంబరు 2019 లో పత్రిక ధర 20 రూపాయలు మాత్రమే. ప్రస్తుతం సంచికలు ఉచితంగా అంతర్జాలంలో అందుబాటులో వున్నాయి. మార్చి2021 సంచికతో పత్రిక ...

                                               

ఆచమనము

ఆచమనము అనే పదానికి ఉపస్పర్శం అంటే అరచేతిలో నీరు పోసుకొని నోటితో గ్రహించడమని అర్ధం. ఏదైనా ఒక పవిత్రమైన పనిచేస్తున్నప్పుడు ఆచమనం చేయాలని శాస్త్రాలు చెబుతున్నాయి. మనస్సు, వాక్కు, శరీరం - అనే త్రికరణాల పవిత్రతకు ఆచమనం విధించబడింది. సంధ్యావందనం మొదలైన సమయాలలో ఆచమనానికి చాలా ప్రాముఖ్యమున్నది. ఆచమనం అంటే కేవలం ఒక ఉద్ధరణి నీళ్లు చేతిలో పోసుకొని లోపలికి పుచ్చుకోవడం మాత్రమే కాదు, మంత్ర పూత జలంతో శరీరాన్ని స్పర్శించడం, స్నానం చేయడం కూడా ఆచమనమే. ఆచమనం నాలుగు విధాలు. అవి: 1. శ్రుత్యాచమనం: స్వాధ్యాయ బ్రాహ్మణంలోని శ్రుతి ‘‘హస్తా వవవిజ్య రతిరాచమేత్‌.’’ అంటూ చేతులు కడుగుకొని, ‘‘ఓం కేశవాయ స్వాహా, ఓం నారాయణా ...

                                               

జీవం

దీని నిర్వచనం చాలా క్లిష్టమైనదనే చెప్పాలి. ఈ సృస్టిలో రెండు పదార్ధాలు ఉన్నాయి. అవి జీవులు, నిర్జీవులు. వాటిని వేరు చేసేది కేవలం వాటిలో ఉండే ప్రాణం. భౌతిక శాస్త్రం గానీ, రసాయన శాస్త్రం గాని ఈ జీవం యొక్క నిర్వచనం చెప్పలేదు. జీవ శాస్త్రం లేదా జీవ రసాయన శాస్త్రం మాత్రమే దీనికి కొంత నిర్వచనం చెబుతుంది. అది కూడా అసంపూర్తిగానే. ఎందుకంటే ఈ శాస్త్రాలు కేవలం జీవులలో జరిగే జీవక్రియలు, అవి ఎలా జరుగుతాయి? అని మాత్రమే వివరిస్తాయి. కనుక దీనిని బట్టి చూస్తే ఇది ఎంత క్లిష్టమైన విషయమో అర్ధం చేసుకోవచ్చు.

                                               

కామశాస్త్రం

కామశాస్త్రం: భారతీయ సాహిత్యంలో "కామం" గురించి, శాస్త్రీయ దృక్ఫదంతో రచించబడిన సాహిత్యం. చాణక్యుడు ఆర్థికశాస్త్రం గురించి రచించిన అర్థశాస్త్రం లాగానే, కామశాస్త్రంకూడా ఒక శాస్త్రీయ గ్రంథము. కామశాస్త్రం, నాగరికుల కొరకు సశాస్త్రీయ జ్ఞానంతో, శారీరక ఇచ్ఛను పొందే మార్గాలను సూచించే సాహిత్యం. ప్రాచీన సాహిత్యాలలో ఇప్పటికీ లభ్యమవుతున్న గ్రంథం కామసూత్ర. దీనిని వాత్స్యాయనుడు రచించాడు. వాత్స్యాయనుడి తరువాత, అనేకులు అనేక గ్రంథాలు వ్రాశారు, వాటిలో లభ్యమవుతున్నవి, ముఖ్యమైనవి; కళ్యాణమల్లుడు రచించిన అనంగరంగ 16వ శతాబ్దం. జయమంగలుడి వ్యాఖ్యానాలు వాత్స్యానుడిపై 13వ శతాబ్దం. కొక్కాకుడు రచించిన రతి రహస్యం 13వ శతాబ్దం

                                               

తర్క శాస్త్రము

క్రమ బద్ధమైన చింతనా ప్రక్రియ ద్వారా సాధారణీకరణలు, ఆధరికి అమూర్తీకరణలు సాధించడంతో సంబంధమున్న విజ్ఞాన శాస్త్రం తర్కం. వివేచనా గుణం గురించి, సాక్ష్య బలం గురించి, ప్రవచనాల ఆపాదనల మీద ఆధారపడే అనుమాన ప్రామాణ్యం గురించి అది అధ్యయనం చేస్తుంది. అమూర్తీకరించే లక్షణం, అంటే వస్తువుల సారమందుకోవడం బుద్ధికి మూల స్థంబం. విభాగాలను సామస్త్యం తోనూ, వ్యక్తులను సమూహాలతోను సంధానించడం, సాధారణీకరించడం, వర్గీకరించడం, అమూర్తీకరించడం బౌద్ధిక చర్యలో ఎప్పుడూ ఆపాదితమయి ఉంటాయి. ఉదాహరణకు కింది లక్షణాలను గమనించామనుకోండి - దీర్ఘ చతురప ఘనం, కాగిత పదార్థం, ముద్రిత పుటలు, ఏదో ఒకరకమైన బైండింగ్ అర్థవంతమైయిన వార్తావహనం - పత్రిక, ...

                                               

నాణేల సేకరణ శాస్త్రం

నాణేల సేకరణ శాస్త్రంను ముద్రాశాస్త్రం అని కూడా అంటారు. ఆంగ్లంలో నుమిస్మాటిక్స్ అంటారు. న్యూమిస్మాటిక్స్ కరెన్సీపై అధ్యయనం చేయడం, నాణేలు, టోకెన్లు, పేపర్ మనీని ఇంకా ద్రవ్య సంబంధిత వస్తువులను సేకరించడం చేస్తుంది.

                                               

ప్రయోగం

ప్రయోగం అనేది ఒక ఆలోచన లేదా పద్ధతి యొక్క పరీక్ష. దీనిని తరచుగా శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు ఉపయోగిస్తారు. ఆలోచన వాస్తవ ప్రపంచానికి ఎంతవరకు సరిపోతుందో చూడటానికి ఒక ప్రయోగం ఉపయోగించబడుతుంది. చుట్టుపక్కల ప్రపంచాన్ని ప్రజలు అర్థం చేసుకోవడానికి ప్రయోగాలు చాలా సంవత్సరాలుగా ఉపయోగించబడుతున్నాయి. ప్రయోగాలు శాస్త్రీయ పద్ధతిలో భాగం. అనేక ప్రయోగాలు నియంత్రిత ప్రయోగాలు లేదా జ్ఞానరహిత ప్రయోగాలు. ప్రయోగాలను చాలా వరకు ప్రయోగశాలలో చేస్తారు. ఒక సిద్ధాంతం అబద్ధమయితే, లేదా ఏదైనా పనిని సరిగా చేయకపోతే ప్రయోగాలు మనకు తెలియజేస్తాయి. ఒక సిద్ధాంతం నిజమయినప్పటికి దానిని వెంటనే నిరూపించలేకపోవచ్చు, దానిని ప్రయోగాల ద్వారా ...

                                               

మానవ శాస్త్రము

మానవ శాస్త్రము లేదా మానుష శాస్త్రము మానవజాతి పుట్టు పూర్వోత్తరాలను, పురోగతిని అధ్యయనం చేసే శాస్త్రం. మానవ శాస్త్రము ఒక జీవ శాస్త్రం మాత్రమే కాక ప్రపంచంలో వేర్వేరు జాతుల, తెగల ప్రజలు, వారి మధ్య చారిత్రాత్మకంగా ఏర్పడిన భేదాలను కూడ తెలిపే సాంఘిక శాస్త్రం కూడా. మానవ శాస్త్రజ్ఞులు అనేక ప్రాంతాలలో పరిశోధనలు చేసి ప్రజలు ప్రస్తుతం ఎలా జీవిస్తున్నారో, పూర్వం ఎలా జీవించేవారో పురావస్తు శాస్త్రము Archealogy ప్రకారంగా అధ్యయనం చేస్తారు. ఈ అధ్యయనాలు ఆధునిక నగరాల నుంచి పల్లెటూర్లు, అడవిలో నివసించే తెగల దాక విస్తరిస్తూంతాయి. వివిధ సమూహాల్లో జనం సమయాన్ని, స్థలాన్ని, జీవన శైలిని ఎలా అవగాహన చేసుకున్నారో, ఈ అధ ...

                                               

రస స్వరూపం

రస స్వరూపము భారతీయ కావ్య సిద్ధాంతాలలో ప్రప్రథమమైనది రస సిద్ధాంతం.కావ్యానికి ఆత్మేది అనే విషయంపై ప్రాచ్య అలంకారికులు శతాబ్దాలతరబడి ఎన్నెన్నో చర్చలు చేసారు.వీటిలో ప్రధానమైన సిద్ధాంతాలు ఆరు ఉన్నాయి.అవి.1.రసం 2.అలంకారం. 3.రీతి.4.ధ్వని.5.వక్త్రోక్తి. 6.ఔచిత్యం. ఈ ఆరింటిలో రససిద్ధాంతమే ప్రధానమైనదిగా అలంకారికులు గుర్తించారు. రససిద్ధంత ప్రవక్త భరతుడు.మనకుతెలిసినన్తవరకు మొట్టమొదటి నాట్యశాస్త్రం భరతునిదే.ఇందులో 37 అధ్యాయాలు ఉన్నాయి.6వ అధ్యాయం రసభావ చర్చకి సంబంధించింది. రస శబ్ద అర్ధ వికాసం రసం అనే పదం రుగ్వేదంలో సోమరసం, పాలు అనివాడబడింది.అధర్వణ వేదంలో నది, రుచి అని వాడబడింది.ఉపనిషత్తుల్లో సారం అని వా ...

                                               

రాజనీతి శాస్త్రము

రాజనీతి శాస్త్రము ఒక సాంఘిక శాస్త్రము.రాజ్యాన్ని ప్రభుత్వాన్నిఅధ్యయనం చేయడమే రాజనీతిశాస్త్ర అధ్యయనం. అయితే ఇది సాంప్రదాయంగా వస్తున్న నిర్వచనం.ఆధునిక కాలంలో రాజనీతి శాస్త్రము శక్తినీ, అధికారాన్నీ అధ్యయనం చేస్తొంది. స్థూలంగా రాజ్యం, ప్రభుత్వం, రాజకీయాల గురించి అధ్యయనం చేస్తుంది. "రాజనీతి శాస్త్రము" అంటే రాజ్యాన్ని గురించి అధ్యయనం" అని అరిస్టాటిల్ నిర్వచించారు.అరిస్టాటిల్ మానవుడు సంఘజీవి అని పేర్కొన్నాడు.అదే విధంగా మానవుడు రాజకీయజీవి అని కూడా తెలిపాడు.ఆది నుండి మానవుడు సమాజంలో సభ్యుడిగా వుంటూ, క్రమేపి రాజకీయజీవిగా మారి, రాజ్య ప్రభుత్వాలను ఏర్పారుచుకున్నాడు. ఇంగ్లీష్: పొలిటికల్ సైన్స్.రాజనీతి ...

                                               

వాణిజ్యశాస్త్రం

వాణిజ్య శాస్త్రం ను ఇంగ్లీషులో కామర్స్ అని అంటారు. వ్యాపారం లేదా వర్తకం లో జరిగే వ్యవహారాలను ఒక క్రమ పద్ధతిలో నమోదు చేయటాన్ని వాణిజ్యం అంటారు. వ్యాపారానికి సంబంధించిన వ్యవహారాలు గురించి తెలిపే శాస్త్రం. వాణిజ్య సంస్థ, కంపెనీ లేదా ఎంటర్ ప్రైజ్ అనగా వస్తువుల్ని ఉత్పత్తి చేయడానికి లేదా వినియోగదారులకు సేవల్నిఅందించడానికి ఏర్పడినట్టు చట్టపరంగా గుర్తింపు పొందిన సంస్థ. ఇలాంటి వ్యాపారాలు పెట్టుబడిదారి వ్యవస్థలో ఎక్కువగా కనిపిస్తాయి. ఇవి ఎక్కువగా ప్రైవేటు వ్యక్తులచే నడుపబడతాయి. వీటి ముఖ్యమైన ఉద్దేశం లాభాల్ని ఆర్జించడం, వాటి అధిపతుల్ని ధనవంతుల్ని చేయడం. సోషలిస్టు వ్యవస్థలో ప్రభుత్వ సంస్థలు లేదా పబ్ల ...

                                               

వాస్తు శాస్త్రం

వాస్తు శాస్త్రం: వాస్తు అంటే నివాసగృహం/ప్రదేశం అని శబ్దార్థం. శాస్త్రం అంటే శాసించేది / రక్షించేది అని అర్ధం. వెరసి వాస్తు శాస్త్రం అంటే నివాసాల నిర్మాణాలలో విధి విధానాలను శాసించే ప్రాచీన భారతీయ నివాస నిర్మాణ శాస్త్రం. భారతీయులు, చైనీయులు తమ ఇంటి నిర్మాణాల్లో పాటిస్తారు. వాస్తు శాస్త్రంలో ప్రధానం గా నాలుగు భాగాలు ఉన్నాయి. హర్మ్య వాస్తు శయనాసన వాస్తు. యాన వాస్తు. భూమి వాస్తు.

                                               

విజ్ఞానం

అందరి కోసం లేక అనేక అవసరాల కోసం లేక భవిష్యత్ తరాల కోసం మంచి పనులకు ఉపయోగించే జ్ఞానంను విజ్ఞానం అంటారు. పంచే కొలది పెరిగుతుంది విజ్ఞానం. విజ్ఞానాన్ని ఉపయోగించి ఒక క్రమ పద్ధతి ప్రకారం తయారు చేసుకున్న కచ్చితమైన ఫలితాలను శాస్త్రం అంటారు. సైన్స్ అండ్ నాలెడ్జ్ అనగా శాస్త్రం, జ్ఞానంల కలయికతో ఏర్పడినదే విజ్ఞానం.

                                               

విజ్ఞానశాస్త్రాల జాబితా

అంటువ్యాధి శాస్త్రం పర్యావరణ శాస్త్రం పిండోత్పత్తి శాస్త్రం రసయనిక చికిత్స శాస్త్రం ఖగోళ శాస్త్రం జ్యోతిష్య శాస్త్రం కణజన్యు శాస్త్రం అల్ప ఉష్ణోగ్రత శాస్త్రం జీవకాలగణన శాస్త్రం ప్రాచీన లిపి శాస్త్రం విశ్వ శాస్త్రం జీవభౌతిక శాస్త్రం అంతరిక్ష శాస్త్రం పురావస్తు శాస్త్రం కణ రసాయన శాస్త్రం వేలిముద్రల శాస్త్రం రహస్య లేఖన శాస్త్రం పింగాణీ సాంకేతిక శాస్త్రం ఎగ్రొస్టోలజీ క్షేత్ర శాస్త్రం జీవధర్మ శాస్త్రం ఖగోళ భౌతిక శాస్త్రం జీవగణిత శాస్త్రం ధ్వని శాస్త్రం జీవ శాస్త్రం సాంస్కృతిక మానవశాస్త్రం శంకు శాస్త్రం జీవ రసాయన శాస్త్రం ఖగోళ ధర్మ శాస్త్రం అర్ధ శాస్త్రం జీవయాంత్రిక శాస్త్రం విశ్వపటనిర్మాణ శాస్త ...

                                               

వ్యవసాయశాస్త్రం

వ్యవసాయశాస్త్రం ఉత్పత్తి శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం, ఆహార, ఇంధన, ఫైబర్ కొరకు మొక్కలను ఉపయోగించుట, పునరుద్ధరణ. వ్యవసాయశాస్త్రం మొక్క జన్యుశాస్త్రం, మొక్కల శరీర ధర్మ శాస్త్రం, వాతావరణ శాస్త్రం, నేల శాస్త్రం యొక్క పరిధిలో పని చేస్తుంది. వ్యవసాయ శాస్త్రం, జీవశాస్త్రం, రసాయనశాస్త్రం, ఆర్థిక, జీవావరణ, భూగోళ శాస్త్రం, జన్యుశాస్త్రం వంటి శాస్త్రాల కలయిక అంటారు. వ్యవసాయవేత్తలు నేడు ఆహార ఉత్పత్తి, ఆరోగ్యకరమైన ఆహారం సృష్టించడం, వ్యవసాయ నిర్వహణ పర్యావరణ ప్రభావం, మొక్కలు నుండి శక్తి సృష్టించడం వంటి వాటితో సహా అనేక విషయాలలో పాలుపంచుకుంటున్నారు. వ్యవసాయ వేత్తలు తరచుగా పంట మార్పిడి, ఇరిగేషన్ అండ్ డ్రైనేజ ...

                                               

శిలాశాస్త్రం

శిలలను అధ్యయనం చేసి శాస్త్రన్ని శిలాశాస్త్రం అంటారు. ఆంగ్లంలో పెట్రొలజి అంటారు. పెట్రొలజి అనేది రెండు పదముల కలయిక. పెట్రో అనగా శిల అని, లోగస్ అనగా అధ్యయనం. ఈ శాస్త్రం భూగర్బశాస్త్రంలో ఒక భాగం. భూగర్భ ము యొక్క పుట్టున వస్తికర్న, నిర్మనము గురించి అధ్యయనం చేసే శాస్త్రం. శిలాశాస్త్రం ఒక విధంగా పెట్రొగ్రఫి యొక్క పర్యాయపదం. శిలాశాస్త్రం ముఖ్యంగా స్థూల చెతినమునా, రాళ్ళ గుట్టు యెత్తు వివరణ గురించి ద్రిష్టి సరిస్తుంది. కాని పెట్రొఘ్రఫి అనేది సుక్ష్మమైన రాళ్ళ వివరములు గురించి చెపట్టి ప్రత్యెకత. ఈ చమురుపరిశ్రమ, శిలాశాస్త్రము, ప్రత్యెకంగా మట్టిలాగ్ ఎవన్నీ భూగర్భనిర్మణము తెలుసుకొవడనికి ముఖ్య ప్రధాన్యత ...

యూఫాలజీ
                                               

యూఫాలజీ

యూఫాలజీ అనగా "ఎగిరే పళ్ళెములు" గురించి తెలిపే శాస్త్రం అని అర్దం. ఈ శాస్త్రంపై చాలా సంవత్సరాల నుండి వివిధ దేశాల శాస్త్రవేత్తలు, ప్రభుత్వాలు,కొన్ని రహస్యబృందాలు పరిశోధనలు కొనసాగిస్తున్నాయి. UFOlogy అనే పదం UFO+logy అనే రెండు పదాల నుండి ఉత్పన్నమయింది. ఈ రెండు పదాలు గ్రీకుభాష నుండి గ్రహించబడినవి.

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →