Back

ⓘ భౌగోళికము                                               

ఖమ్మం

ఖమ్మం, భారతదేశం లోని తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా, ఖమ్మం అర్బన్ మండలానికి చెందిన పట్టణం. ఖమ్మం జిల్లా ముఖ్య కేంద్రం.ఖమ్మం పట్టణం వ్యాపార,ఆర్థిక కేంద్రం.

                                               

కర్ణాటక

కర్ణాటక భారతదేశములోని ఐదు దక్షిణాది రాష్ట్రాలలో ఒకటి. 1950 లో పూర్వపు మైసూరు రాజ్యము నుండి యేర్పడటము వలన 1973 వరకు ఈ రాష్ట్రము మైసూరు రాష్ట్రముగా వ్యవహరించబడింది. 1956 లో చుట్టుపక్క రాష్ట్రాలలోని కన్నడ మాట్లాడే ప్రాంతాలు కలుపుకొని విస్తరించబడింది. కర్ణాటక రాజధాని బెంగళూరు రాష్ట్రములో 10 లక్షలకు పైగా జనాభా ఉన్న ఏకైక నగరము. మైసూరు, మంగుళూరు, హుబ్లి-ధార్వాడ్, బళ్ళారి, బెళగావి రాష్ట్రములోని ఇతర ముఖ్య నగరాలు. కన్నడ, కర్ణాటక రాష్ట్ర అధికార భాష. 2001 జనాభా లెక్కల ప్రకారము దేశములో 5 కోట్లకు మించి జనాభా ఉన్న పది రాష్ట్రాలలో ఇది ఒకటి.

                                               

హర్యానా

హర్యాణా వాయువ్య భారతదేశములోని రాష్ట్రము. దీనికి ఉత్తరాన పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రములు, పశ్చిమాన, దక్షిణాన రాజస్థాన్ సరిహద్దులుగా ఉన్నాయి. తూర్పున యమునా నది హర్యాణా, ఉత్తరాఖండ్, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రములకు సరిహద్దుగా ఉంది. ఘగ్గర్ నది, మర్ఖందా, తంగ్రి, సాహిబీ మొదలైన నదులు రాష్ట్రము గుండా ప్రవహించుచున్నాయి.

                                               

ఉత్తరాఖండ్

BASWARAJ 1ST KING మూస:BASWARAJ ఉత్తరాఖండ్ హిందీ:उत्तराखण्ड ఉత్తర భారతదేశంలోని ఒక రాష్ట్రము. ఇది 2006 వరకు ఉత్తరాంచల్ గా పిలవబడింది. ఉత్తరాఖండ్ 2000 సంవత్సరము నవంబరు 9న భారతదేశంలో 27వ రాష్ట్రంగా ఏర్పడింది. ఇది అంతకు ముందు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఒక భాగము. 1990నుండి కొద్దికాలం శాంతియుతంగా సాగిన ప్రత్యేకరాష్ట్ర ఉద్యమం విజయవంతమై ఉత్తరాఖండ్ రాష్ట్రం ఆవిర్భవించింది. ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్లు ఉత్తరాఖండ్ రాష్ట్రానికి హద్దులు. ఉత్తరాన చైనా టిబెట్, నేపాల్ దేశాలతో సరిహద్దులున్నాయి. రాష్ట్రం యొక్క తాత్కాలిక రాజధాని డెహ్రాడూన్. ఇదే ఈ రాష్ట్రంలో అతి పెద్ద నగరం. హైకోర్టు మాత్రం నైనిటాల్లో ఉంది. రాష ...

                                               

తణుకు

తణుకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఒక మండలం. ఇదే తారకాపురం, తళుకు, తణుకుగా రూపాంతరం చెందింది. 2011 జనాభా లెక్కల ప్రకారం తణుకు 32 వార్డుతో 72.348 జనాభాతో ఉండేది 2013వ సంవత్సరంలో తణుకు మున్సిపాలిటీ లో మూడు గ్రామాలను వెంకటరాయపురం, పైడిపర్రు మరియు వీరభద్రపురం విలీనం చేశారు అప్పుడు తణుకు మున్సిపాలిటీ పరిధి 24.83 కి.మీ గా పెరిగి 34 వార్డు లో 90.430 మంది జనాభా ఉన్నారు. పశ్చిమగోదావరి జిల్లా లో ప్రస్తుతం 2011 జనాభా లెక్కలు ప్రకారం ఏలూరు, భీమవరం, తాడేపల్లిగూడెం మరియు పాలకొల్లు తర్వాత తణుకు ఐదవ పెద్ద పట్టణంగా ఉంది.

                                               

అరుణాచల్ ప్రదేశ్

అరుణాచల్ ప్రదేశ్ భారత దేశములోని ఒక రాష్ట్రము. భారత దేశ పాలనలో ఉన్నా, ఈ ప్రాంతాన్ని టిబెట్ స్వయంప్రతిపత్త ప్రాంతములో భాగమని చైనా వాదన. భారత, చైనాల మధ్య వివాదాస్పదముగా మిగిలిన ప్రాంతాలలో అక్సాయి చిన్తో పాటూ అరుణాచల్ ప్రదేశ్ కూడా ఒకటి. ఈ రాష్ట్రానికి దక్షిణాన అస్సాం రాష్ట్రము, ఆగ్నేయాన నాగాలాండ్, తూర్పున బర్మా, పశ్చిమాన భూటాన్ సరిహద్దులుగా ఉన్నాయి. ఇటానగర్ రాష్ట్ర రాజధాని. పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా ఈ రాష్ట్రాన్ని గానీ, రాష్ట్రము యొక్క ఉత్తర సరిహద్దైన మెక్‌మెహన్ రేఖను గానీ అధికారికముగా గుర్తించడంలేదు. చైనా ఈ ప్రాంతాన్ని దక్షిణ టిబెట్ గా వ్యవహరించి ఈ ప్రాంతాన్ని టిబెట్ స్వయంప్రతిపత్త ప్రాంతము ...

                                               

మాల్దీవులు

మాల్దీవుల గణతంత్రరాజ్యం భారతదేశానికి నైఋతిన హిందూ మహాసముద్రంలో కొన్ని పగడపు దీవుల సముదాయాలతో ఏర్పడిన దేశం. మాల్దీవులలో 26 పగడపు దిబ్బలలో మొత్తం 1.196 పగడపు దీవులు ఉన్నాయి.

                                               

తుర్కమేనిస్తాన్

తుర్కమేనిస్తాన్, మధ్య ఆసియాలో ఒకప్పుడు తుర్క్‌మెన్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ గా పిలవబడిన దేశము. దీనికి సరిహద్దులుగా ఆఫ్ఘానిస్తాన్, ఇరాన్, ఖజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్ దేశాలు, తూర్పున కాస్పియన్ సముద్రము ఉన్నాయి.

                                               

బ్రూనై

బ్రూనై అధికారికంగా దీనిని స్టేట్ ఆఫ్ బ్రూనై దారుస్సలామ్ లేక నేషన్ ఆఫ్ దారుస్సలామ్, ది అబోడ్ ఆఫ్ పీస్ గా పిలుస్తారు. ఇది ఆగ్నేయాసియాలోని బోర్నియో ద్వీపంలో ఉపస్థితమై ఉన్న సార్వభౌమాధికారమున్న దేశము. ఇది దక్షిణ చైనా సముద్రములో చైనాకు అభిముఖంగా ఉన్న దేశము. ఇది మలేషియా దేశ రాష్ట్రమైన సారవాక్‌ మధ్య ఉపస్థితమై ఉంది. ఇది సారవాక్‌కు చెందిన లింబాంగ్ నగరము చేత రెండు భాగముగా విభజింపబడి ఉంది. బోర్నియో ద్వీపములో ఉన్న పూర్తి దేశము ఇది ఒక్కటే. మిగిలిన ద్వీపము మలేషియా, ఇండోనేషియా దేశాలకు చెందినది. 2010 జనసంఖ్య గణనలో బ్రూనై జనసంఖ్య 4.00.000లుగా నమోదైనదని అంచనా. బ్రూనై 7వ శతాబ్దములో శ్రీవిజయన్ సామ్రాజ్యంలో పోల ...

                                               

సముద్రమట్టానికి సగటు ఎత్తు

భౌగోళిక స్థానం యొక్క ఎలివేషన్ అనగా ఒక స్థిర సూచికకు కంటే పైనున్న ఎత్తు, సర్వసాధారణంగా ఒక సూచన జియాయిడ్, గురుత్వాకర్షణ ఉపరితలానికి సమానంగా తూలతూగగలిగినట్టి భూమి యొక్క సముద్రమట్టం యొక్ఒక గణితశాస్త్ర నమూనా. ఎలివేషన్ లేదా జియోమెట్రిక్ ఎత్తు భూమి ఉపరితలం మీద పాయింట్లు సూచించేందుకు ప్రధానంగా ఉపయోగిస్తారు, అయితే అల్టిట్యూడ్ లేదా జియోపొటెన్షియల్ ఎత్తు ఉపరితలం పైకి కూడా పాయింట్ల కోసం ఉపయోగిస్తారు, ఎగురుతున్న విమానం లేదా క్షక్ష్య లోని అంతరిక్షనౌక వంటివి, లోతు ఉపరితలం క్రింది పాయింట్ల కోసం ఉపయోగిస్తారు.

                                               

తెరా ఖుర్ద్

తెరా ఖుర్ద్ 240 అమృత్‌సర్ జిల్లాకు చెందిన అజ్నాలా తాలూకాలోని గ్రామం, ఇది 2011 జనగణన ప్రకారం 270 ఇళ్లతో మొత్తం 1474 జనాభాతో 281 హెక్టార్లలో విస్తరించి ఉంది. సమీప పట్టణమైన అజ్నాలా అన్నది 8 కి.మీ. దూరంలో ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 768, ఆడవారి సంఖ్య 706గా ఉంది. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 715. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 37400.

                                               

తిమ్మొవాల్

తిమ్మొవాల్ 132 అమృత్‌సర్ జిల్లాకు చెందిన బాబా బాకలా తాలూకాలోని గ్రామం, ఇది 2011 జనగణన ప్రకారం 728 ఇళ్లతో మొత్తం 3653 జనాభాతో 728 హెక్టార్లలో విస్తరించి ఉంది. సమీప పట్టణమైన రయ్యా 20 కి.మీ. దూరంలో ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 1918, ఆడవారి సంఖ్య 1735గా ఉంది. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 843. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 37695.

                                               

అల్టిట్యూడ్

అల్టిట్యూడ్ అనగా భూమికి పైన లేదా సముద్రమట్టానికి పైన ఎత్తు. సాధారణంగా విమానయానంలో, భౌగోళిక/సర్వేయింగ్ లలో ఉపయోగిస్తారు. జ్యామితిలో దీనిని వస్తువు యొక్క ఎత్తుగా కూడా ఉపయోగిస్తారు. సాధారణంగా అల్టిట్యూడ్ అనగా ఒక వస్తువుకు పైనున్న మరొక వస్తువుకు గల దూరం. ఇది నిలువుగా లేదా "పై" దిశలో ఉంటుంది. భూమి యొక్క ఎత్తు కోసం ఎలివేషన్ పదం ఉపయోగిస్తారు, ఆ పదం మంచి ఎంపిక కూడా కావచ్చు. నిలువు దూర కొలతలను "క్రింది" దిశలో సాధారణంగా లోతు అనే పదంతో సూచిస్తారు. నేలపైనున్న భవనాలు, ఇతర విషయాలలో సాధారణంగా ఎత్తు అనే పదం ఉపయోగిస్తారు.

                                               

ఉత్తరార్ధగోళం

భూమధ్య రేఖకు ఉత్తరాన ఉన్న భూభాగమే ఉత్తరార్థగోళం. సౌరకుటుంబంలోని ఇతర గ్రహాల ఉత్తర దిశ, భూమి యొక్క ఉత్తర ధృవం సౌరకుటుంబపు తలానికి ఎటువైపున ఉంటుందో, అటువైపే ఉంటుంది. భూపరిభ్రమణతలం నుండి భూమి అక్షం కొంత కోణంలో వంగి ఉన్న కారణంగా ఉత్తరార్థగోళంలో శీతాకాలం డిసెంబరు ఆయనం డిసెంబరు 21 నుండి మార్చి విషువత్తు మార్చి 20 వరకూ ఉంటుంది. వేసవి కాలం జూన్ ఆయనం జూన్ 21 నుండి సెప్టెంబరు విషువత్తు సెప్టెంబరు 23 వరకూ ఉంటుంది. కాలెండరు సంవత్సరానికి, ఖగోళ సంవత్సరానికీ మధ్య ఉన్నతేడా వలన ఈ తేదీలు ప్రతీ ఏడాదీ ఒకేలా ఉండక కొద్దిగా మారుతూ ఉంటాయి. ఉత్తరార్థగోళంలో భూమి 60.7% నీటితో నిండి ఉంటుంది. దక్షిణార్థగోళంలో ఇది 80.9% ...

                                               

కుమారి ఖండం

కుమారి ఖండం భౌగోళికంగా భూ పరిమాణంగా సిద్ధాంతీకరించబడింది భారతదేశం దక్షిణాన ఉన్న హిందూ మహాసముద్రంలో ఉన్న పురాతన తమిళ నాగరికత. ప్రత్యామ్నాయ పేరు కుమారినాడు. గురించిన కథనాలు వివిధ గ్రంథాలలో ప్రస్ధావనలు ఉన్నాయి. 19 వ శతాబ్దంలో, యూరోపియన్, అమెరికన్ పండితుల్లో ఒక విభాగం ఆఫ్రికా, ఆస్ట్రేలియా, భారతదేశం, మడగాస్కర్ల మధ్య భూగర్భ, ఇతర సారూప్యతలను వివరించడానికి లెమురియా అనే మునిగి ఉన్న ఖండం ఉనికిని ఊహించారు. పురాతన తిమింగలం, సంస్కృత సాహిత్యంలో వర్ణించబడినట్లుగా, తమిళ పునరుద్ధరణకర్తల యొక్ఒక విభాగం ఈ సిద్ధాంతానికి అనుగుణంగా, సముద్రానికి కోల్పోయిన భూములను పాండ్యన్ పురాణాలకు అనుసంధానించింది. ఈ రచయితల అభిప్ ...

                                               

చాంద్రమాన కేలండర్

చాంద్రమాన కేలండర్ ఒక కేలండర్, చంద్రుని గమనాలపై ఆధారపడి తయారుచేసినది. ఈ కేలండర్ ప్రస్తుతం ఎక్కువగా ముస్లింలు ఉపయోగించే ఇస్లామీయ కేలండర్ లేదా హిజ్రా కేలండర్ లకు మూలం. ఈ కేలండర్ లోనూ 12 మాసాలున్నాయి. ఋతుకాలచక్రాల ఆధారంగా కాకుండా, పరిపూర్ణంగా చంద్రగమనాలపై ఆధారపడియున్నది. సూర్యమాన కేలండర్ కంటే ఈ కేలండర్ లో 11 రోజులు తక్కువ. సూర్యమాన, చాంద్రమాన కేలండర్లు ఒకే స్థితికి ప్రతి 33 సంవత్సరాలకొకసారి వస్తాయి. ఈ కేలండర్ ప్రత్యేకంగా ధార్మిక అవసరాలకు ఉపయోగిస్తారు. సౌదీ అరేబియాలో వాణిజ్యావసరాలకునూ ఈ కేలండర్ ను ఉపయోగిస్తున్నారు. హిజ్రీ కేలండర్‌ను తప్పించి మిగతావి చాంద్ర-సూర్యమాన కేలండర్ లే. అనగా నెలలు చాంద్ర ...

                                               

దక్షిణార్ధగోళం

భూమధ్యరేఖకు దక్షిణాన ఉన్న భూభాగమే దక్షిణార్ధగోళం. ఐదు ఖండాల భాగాలు నాలుగు మహాసముద్రాలు ఓషియానియా లోని పసిఫిక్ దీవులు దక్షిణార్ధగోళంలోనే ఉన్నాయి. దీని భూభాగంలో 80.9% నీరు ఉంది. ఉత్తరార్ధగోళంలో నీరు 60.7% దాకా ఉంది. భూమ్మీది మొత్తం నేలలో 32.7% దక్షిణార్ధగోళంలో ఉంది. భూపరిభ్రమణ తలం నుండి భూమి అక్షం వంగి ఉన్న కారణంగా దక్షిణార్థగోళంలో వేసవికాలం డిసెంబరు నుండి మార్చి వరకు, శీతాకాలం జూన్ నుండి సెప్టెంబరు వరకూ ఉంటాయి. క్యాలెండరు సంవత్సరానికి, సెప్టెంబరు 22 / 23 తేదీన వసంత విషువత్తు, మార్చి 20 / 21 న శరద్ విషువత్తు తటస్థిస్తాయి. దక్షిణ ధ్రువం దక్షిణార్థగోళానికి మధ్యలో ఉంటుంది.

                                               

భూమధ్య రేఖ

భూమధ్య రేఖ, భూ ఉపరితలం మీద ఉత్తర దక్షిణ ధ్రువాల నుండి సమాన దూరంలో ఉండే ఊహా రేఖ. ఇది భూగోళాన్ని ఉత్తరార్థ, దక్షిణార్థ గోళాలుగా విభజిస్తుంది. భూమధ్య రేఖ 48.075 కి.మీ. పొడవుంటుంది. ఇది 78.7% నీటిలోను, 21.3% నేలమీదుగానూ పోతుంది. ఇతర గ్రహాలు, ఖగోళ వస్తువులకు కూడా ఇదే విధంగా మధ్య రేఖ ఉంటుంది. సాధారణంగా, గుండ్రంగా తిరుగుతున్న గోళం యొక్క భ్రమణాక్షానికి లంబంగా ఉన్న తలం, గోళపు ఉపరితలాన్ని ఖండించే రేఖను మధ్య రేఖ అంటారు. ఇది ఆ గోళపు రెండు ధ్రువాలకూ సమదూరంలో ఉంటుంది.

                                               

శేషాచలం కొండలు

శేషాచలం కొండలు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఒక పర్వత శ్రేణి. ఇవి తూర్పు కనుమల్లో ఒక అంతర్భాగం. తిరుపతి పట్టణం ఈ కొండలను ఆనుకునే ఉంది. ఇక్కడ ఏడు పర్వతాలను అంజనాద్రి, గరుడాద్రి, నారాయణాద్రి, నీలాద్రి, శేషాద్రి, వెంకటాద్రి, వృషబాధ్రి అనే పేర్లతో పిలవబడుతున్నాయి. హిందూ పురాణాల ప్రకారం ఈ ఏడు కొండలు ఆదిశేషుని ఏడు పడగలకు ప్రతిరూపాలుగా భావిస్తారు. శ్రీవేంకటేశ్వర జాతీయ ఉద్యానవనం, తిరుమల కొండలు ఈ పర్వత శ్రేణిలో భాగమే. ఈ పర్వతాలను 2010 వ సంవత్సరంలో జీవవైవిధ్య నెలవుగా గుర్తించారు

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →